Wednesday, October 22, 2025

చిత్రగుప్త దేవాలయం - కాంచీపురం.

చిత్రగుప్త దేవాలయం - కాంచీపురం.



చిత్రాయ చిత్రగుప్తాయ యమాయనమః.




భగినీ హస్త భోజనం. యమద్వితీయ. కార్తీక శుద్ధ విదియ. అన్నలందరూ  చెల్లెలు ఇంటికి వచ్చేరోజు.  చెల్లెలు తన చేతి వంట అన్నకు తినిపించి తన అన్న జోలికి రావద్దని యములోరిని అడిగే రోజు. 

మనకు దక్షిణ భారతంలో ఎక్కడా యమధర్మరాజు ఆలయాలు లేవనుకుంటా. వున్నా అటు తొంగి చూడటానికే మనకు భయం.

పోనీ ఆయన కుడి భుజాన్నయినా చూసొద్దామా.

ఆ కుడి భుజమే చిత్ర గుప్తుడు.

ఈ చిత్రగుప్తుని పుట్టిన రోజే యమ ద్వితీయ.

చిత్రగుప్త ఆలయం.

చిత్రగుప్తుడు అనంగానే తలపాగాతో వ్రాత బల్ల (writing table) ముందు బాసింపట్లు వేసుకుని కూచుని చేత కలం పట్టుకుని లెక్కలు చూస్తున్న వ్యక్తి కనిపిస్తాడు.

యమధర్మరాజు  "సమవర్తి"త్వానికి కారకుడు, సహాయకుడు ఈ చిత్ర గుప్తుడే. ఒక్క మాటలో చెప్పాలంటే యమధర్మరాజుకు కుడిభుజమన్నమాట. వీరిద్దరూ ఒకరు కారు కానీ వారే వీరు వీరే వారు.

మన పాపపుణ్యాలు బేరీజు వేసి చూసి చెప్పే మనిషి. అందుకే ఆయనంటే ప్రతివారికీ కొద్దో గొప్పో భయం వుండి తీరుతుంది.

మనకు తెలుగునాట చిత్రగుప్తునికి, యమధర్మరాజుకీ పెద్దగా ఆలయాలు కనిపించవు. 

కానీ తమిళనాడులో వీళ్ళు  చాలా ప్రశస్తి. ప్రతి ప్రసిద్ధ దేవాలయంలోను వీళ్ళిద్దరూ కనిపిస్తూనే వుంటారు. 

కంచిలో కామాక్షి అమ్మవారి ఆలయానికి సమీపంలోనే చిత్రగుప్తునికి ప్రత్యేకంగా ఒక ఆలయం వుంది.

బహుశా దక్షిణ భారతదేశంలోనే చిత్ర గుప్తునికి  ప్రత్యేకంగా వున్న ఏకైక దేవాలయమేమో.

మరీ పెద్ద ఆలయమేమీ కాదుకానీ మెయిన్ రోడ్డు మీదనే వుంటుంది. రాజగోపురం దగ్గరకు రాగానే కుడివేపు వినాయకుడు, ఎడమప్రక్క  వల్లల్లార్ కనిపిస్తారు.

ప్రధాన దేవత చిత్రగుప్తుడు. ఒళ్లంతా బంగారు తొడుగు వేసుకుని వెండి తాపడం చేసిన గర్భాలయంలో కుడి చేతిలో గంటం, ఎడమ చేతిలో పుస్తకం పట్టుకుని ఎదురుగా వున్న నూనెదీపాల కాంతి ఒంటి మీద పడి ధగధగా మెరిసిపోతూ హాయిగా తీరికగా కూచుని  వుంటాడు. 

కానీ ఆయన కనిపిస్తున్నంత తీరికేం కాదులేండి.

ఈయన భార్య కర్ణికాంబాళ్.

గర్భాలయంలో ఒంటరిగానే వుంటాడు కానీ ఉత్సవ మూర్తి భార్య  సమేతుడై వుంటాడు.

కర్ణికాంబాళ్ కు ఆలయంలో ఒక ప్రక్క ఉపాలయం.

ఆలయ నలుమూలలా విష్ణుదుర్గ, అయ్యప్ప, నవగ్రహాలు.

చిత్రగుప్తుడు కేతుగ్రహ అదిష్ఠాన దైవం. 

అమ్మవారి నడుముకు వుండే వడ్డాణం కేతుగ్రహ వడ్డాణం. అందుకే అమ్మను దర్శిస్తే అమ్మకు పెట్టిన నమస్కారంతో తాను కూడా  తృప్తి చెంది మనల్ని అనుగ్రహిస్తాడట. అలా ఈయన దయ కూడా పొందినట్లే మరి.

అందుకేనేమో ఇక్కడ అమ్మ ఆలయానికి అతి దగ్గరగా ఈయనకూ ప్రత్యేకంగా ఒక ఆలయం వుంది.

చిత్రి మాస పున్నమి రోజున  ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరుగుతై. చిత్రగుప్తునికి, "కర్ణికాంబాళ్" కు ఆ రోజున కళ్యాణము జరిపిస్తారు.

చైత్ర మాసం పౌర్ణమి చిత్ర గుప్తుడు జన్మించాడట. 

అదేమిటి మొదట్లోనేమో యమద్వితీయ నాడు అని చూసినట్లున్నాము అనేకదూ......అవును అదీ నిజమే. ఇదీ నిజమే. ఉత్తరాదిన అలా అంటారు దక్షణాదిన ఇలా అంటాము.

గర్భాలయ వెనుక భాగాన చిత్రగుప్తుని మూర్తి ఒకటి వుంటుంది. ఆలయానికి వచ్చిన భక్తులు ఇక్కడ దీపాలు వెలిగించి 

"వత్తి ముక్తిగాచు 
కొడి గండంగాచు 

వత్తిచేసి  వత్తి వెలిగించిన వనితలకు ఏమి ఫలము  కద్దంటే ....నూరు నోముల ఫలం కద్దు. నిక్షేపమంటి నలకలేని దీపం పెట్టితిని. పరమాత్మా ఈ దీపం నా ఇంట వెలుగు నింపాలి. రక్షింపుము పరమేశ్వరా పాలింపుము దీనబంధు  యమలాత్మ రక్షింపుము".

అని దణ్ణం  పెట్టుకుంటారు. 

అక్కడే వత్తి నూనె వేసిన ప్రమిదలు అమ్ముతూ వుంటారు.

మనం తెలిసీ తెలియక చేసిన తప్పిదాలను మన్నించమని  "చిత్రగుప్త నోము" అని చిత్రగుప్తునికి ఒక నోము నోస్తాము. 


నోము పట్టి ఒక ఏడాది పాటు రోజూ చిత్ర గుప్తునికి పూజ చేసి అక్షతలు తలపై వేసుకుంటాము. ఏడాది తరువాత ఒక మంచి రోజు చూసి కట్లులేని కొత్త గంప తెచ్చి అందులో  తెల్లని కొత్త వస్త్రం పరచి ఎడ్లు తొక్కని వడ్లు అయిదు కుంచాలు పోసి 

(మరి ఆ రోజుల్లో వ్యవసాయం అంటే ఎద్దులు లేకుండా జరిగేది కాదు కదా. అందుకని అలా చెప్పారు లేండి.  ఇపుడు ఎడ్లు ఎక్కడా ?? అలాగే  కుంచాలు అంటే ఎవరికి తెలుస్తుంది చెప్పండి. 25 కిలోలు)  

మరియొక తెల్లని వస్త్రంలో అడ్డెడు తవ్వెడు బియ్యం పోసి (10 కిలోలు)  మూటకట్టి పెట్టి వాటిమీద మంచి గుమ్మడి పండు నొకదానిని వుంచి ఒక వెండి పుస్తకము బంగారు గంటం చేయించి పట్టు వస్త్రాలు తెచ్చి చిత్రగుప్తుని ముందు వుంచి  ఆయనను యథావిథిగా పూజిస్తాము.

తరువాత సోదరుని కానీ సోదర సమానులను గానీ మన ఇంటికి పిలిచి ఈ వస్తువులు అన్నీ వారికి దక్షిణ తాంబూలాలతో ఇచ్చి భోజనం పెడతాము. 

మన పాప పుణ్యాల పట్టిక ఈయన దగ్గరే వుంటుంది కదూ మరి ఆ మాత్రమయినా చేయవద్దా.  

ఇక ఆలయం విషయానికి వస్తే ఉలగళంద పెరుమాళ్  ఆలయంలో నించి బయటకు వచ్చి ఎడమవేపు తిరిగి నడుస్తూ వెళితే వచ్చే రెండో ఎడమకు తిరిగితే చిత్రగుప్త దేవాలయం ఉంటుంది. గట్టిగా 5 నిముషాల నడక. బస్టాండుకి బాగా దగ్గర.

వీలయితే కాదు వీలుచేసుకుని అమ్మను చూసిన తరువాత ఒక్క అడుగు వేసి ఈయన్నూ చూస్తేసరి.

అన్నట్లు మనకు హైదరాబాదులో కూడా చాంద్రాయణగుట్ట దగ్గరలో చిత్రగుప్తునికి ఒక ఆలయం వున్నది తెలుసా.


ఫలాశపుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం
రౌద్రం రౌద్రాత్మకం  ఘోరం తం కేతుం ప్రణమామ్యహం !!


🙏🙏🙏🙏🙏

Tuesday, October 21, 2025

64 తంత్ర విద్యలు — వివరంగా

ఇది ప్రాచీన తాంత్రిక గ్రంథాల (కౌల, శ్రీ, శైవ, శాక్త) సారాంశంతో రూపొందించబడింది.

64 తంత్ర విద్యలు — వివరంగా


1. నారికేల్ తంత్ర

దేవత: మహా కాళీ / లక్ష్మీ
విధానం: కొబ్బరి (నారికేల్)ను ప్రధాన యంత్రంగా భావించి మంత్రోచ్ఛారణతో హోమం చేయడం.
ఫలితం: శుభ ఫలాలు, శక్తి సాధన, సంపద ప్రాప్తి.

2. మూషిక తంత్ర

దేవత: గణపతి
విధానం: మూషిక (ఎలుక) రూపాన్ని గణపతికి వాహనంగా భావించి రహస్య న్యాస, జప సాధన.
ఫలితం: శత్రు నివారణ, రక్షణ, మానసిక నియంత్రణ.

3. వృచ్చిక తంత్ర

దేవత: సుబ్రహ్మణ్య స్వామి
విధానం: వృచ్చిక (చెదపురుగు) సంకేతాన్ని శక్తి రూపంగా పూజించడం.
ఫలితం: వ్యాపారం, విజయం, శత్రు నాశనం.

4. శరభ తంత్ర

దేవత: శరభేశ్వర స్వామి (శివుడి ఉగ్రరూపం)
విధానం: శరభ మంత్రసాధన, బిల్వదళార్చన, హోమం.
ఫలితం: శక్తివంతమైన రక్షణ, కష్ట నివారణ, శత్రు వినాశనం.

5. పంచభూత తంత్ర

దేవత: పంచభూతేశ్వరులు
విధానం: భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశ — ఈ ఐదు మూలభూతాలతో మంత్ర సాధన.
ఫలితం: భౌతిక శక్తి నియంత్రణ, స్థిరత్వం.

6. చక్ర తంత్ర

దేవత: శ్రీచక్ర రూపిణి (లలిత త్రిపురసుందరి)
విధానం: యంత్ర పూజ, చక్ర న్యాస, మంత్ర జపం.
ఫలితం: ఆధ్యాత్మిక శక్తి, జ్ఞానం, మానసిక సమత.

7. కలా తంత్ర

దేవత: సరస్వతి / విష్ణు
విధానం: కళారూప సాధన, నాద బ్రహ్మ ధ్యానం.
ఫలితం: కళా సామర్ధ్యం, సృజనాత్మకత, జ్ఞానం.

8. భూత విద్య తంత్ర

దేవత: భూతేశ్వర / కాళీ
విధానం: భూతగణాల నియంత్రణ, భూత న్యాస, మంత్రసిద్ధి.
ఫలితం: రక్షణ, ఆత్మబల, దుష్టశక్తి నివారణ

9. యంత్ర తంత్ర

దేవత: శ్రీయంత్ర రూపిణి
విధానం: యంత్రరచన, మంత్రోపచార పూజ.
ఫలితం: ఆధ్యాత్మిక శక్తి, ఫలసిద్ధి, క్షేమం.

10. మంత్ర తంత్ర
దేవత: వాక్దేవత / శివ-శక్తులు
విధానం: మంత్రజపం, హృదయ న్యాసం, ధ్యానం.
ఫలితం: శక్తిసిద్ధి, ధ్యానసిద్ధి, ఆత్మశాంతి

11. అగ్ని తంత్ర
దేవత: అగ్ని దేవుడు
విధానం: అగ్నిహోత్ర, అగ్నికుండ హోమం.
ఫలితం: శుద్ధి, శక్తి, దుష్టదోష నివారణ

12. జల తంత్ర
దేవత: గంగా దేవి
విధానం: జల మంత్రసాధన, తర్పణం, స్నాన పద్ధతులు.
ఫలితం: శాంతి, పవిత్రత, ఆత్మశుద్ధి.

13. వాయు తంత్ర

దేవత: వాయు దేవుడు
విధానం: ప్రాణాయామ, వాయునియంత్రణ, ధ్యాన సాధన.
ఫలితం: ప్రాణశక్తి పెరుగుదల, ఆరోగ్యం.

14. భూమి తంత్ర

దేవత: భూదేవి
విధానం: భూమి న్యాసం, మంత్ర తర్పణం.
ఫలితం: స్థిరత్వం, కుటుంబ క్షేమం.

15. ఆకాశ తంత్ర

దేవత: ఆకాశభైరవుడు
విధానం: ధ్యానం, ఆకాశ ధారణ.
ఫలితం: మానసిక విస్తృతి, జ్ఞానసిద్ధి.

16. రుద్ర తంత్ర

దేవత: రుద్ర శివుడు
విధానం: రుద్ర జపం, రుద్రాభిషేకం, హోమం.
ఫలితం: శత్రు నాశనం, శక్తి సాధన.

17. కాళిక తంత్ర

దేవత: మహా కాళి
విధానం: రహస్య కాళి మంత్ర జపం, రాత్రి సాధన.
ఫలితం: రక్షణ, శక్తిసిద్ధి, దుష్టశక్తి నాశనం.

18. లక్ష్మీ తంత్

దేవత: మహాలక్ష్మీ
విధానం: శ్రీ సూత్ర జపం, యంత్ర పూజ, నారికేల్ హోమం.
ఫలితం: సంపద, శ్రేయస్సు, విజయ సాధన.

19. సరస్వతి తంత్ర

దేవత: సరస్వతి దేవి
విధానం: విద్యా మంత్ర జపం, హంసధ్యానం.
ఫలితం: జ్ఞానం, వాక్ప్రతిభ, విద్యా ప్రాప్తి.

20. గణపతి తంత్ర

దేవత: గణేశుడు
విధానం: గణపతి మంత్ర జపం, మూషిక న్యాసం.
ఫలితం: అడ్డంకుల నివారణ, విజయ సాధన.

21. మత్స్య తంత్ర

దేవత: మత్స్యావతార విష్ణు
విధానం: జల సంబంధ సాధన — నదీ తీరంలో జప హోమాలు.
ఫలితం: రక్షణ, సముద్ర / నీటి ప్రమాదాల నివారణ.

22. వృక్ష తంత్ర

దేవత: వనదేవత / భూమాత
విధానం: పుణ్య వృక్షాల (అశ్వత్థ, బిల్వం) కింద సాధన, మంత్ర జపం.
ఫలితం: ఆరోగ్యం, దీర్ఘాయుష్యం, కుటుంబ శాంతి.

23. గరుడ తంత్ర

దేవత: గరుడ దేవుడు
విధానం: పక్షి-మంత్ర సాధన, శత్రు శక్తుల నివారణ.
ఫలితం: దుష్ట దృష్టి, పిశాచ దోషం తొలగింపు.

24. అశ్వ తంత్

దేవత: హయగ్రీవ స్వామి
విధానం: హయగ్రీవ మంత్ర జపం, ధ్యానం.
ఫలితం: విద్య, విజ్ఞానం, దైవకృప.

25. సింహ తంత్

దేవత: నరసింహ స్వామి
విధానం: ఉగ్ర నరసింహ మంత్ర సాధన, రాత్రి హోమం.
ఫలితం: ధైర్యం, రక్షణ, శత్రు నాశనం.

26. వృషభ తంత్ర

దేవత: నందీశ్వర / శివుడు
విధానం: వృషభ న్యాసం, పంచాక్షర మంత్ర జపం.
ఫలితం: స్థిరత్వం, ఆర్థిక బలం, ఆత్మబలం.

27. కుహు తంత్ర

దేవత: చాంద్ర శక్తి / కుహు దేవి
విధానం: రాత్రి ధ్యానం, చంద్రమంత్ర జపం.
ఫలితం: మానసిక సమత, రహస్య సాధన ఫలితాలు.

28. రక్షక తంత్ర

దేవత: భైరవుడు
విధానం: రక్షామంత్ర హోమం, న్యాస పూజ.
ఫలితం: దుష్టశక్తుల నివారణ, గృహ రక్షణ.

29. చంద తంత్ర

దేవత: చండీ / చాముండా
విధానం: చండీ పఠనం, రాత్రి యాగ సాధన.
ఫలితం: ఉగ్రశక్తి ఆహ్వానం, శత్రు వినాశనం.

30. సూర్య తంత్ర

దేవత: సూర్యనారాయణుడు
విధానం: సూర్య నమస్కార, ఆదిత్య హృదయ మంత్రం.
ఫలితం: ఆరోగ్యం, శక్తి, కాంతి.

31. చంద్ర తంత్ర

దేవత: చంద్ర దేవుడు
విధానం: జల ధ్యానం, శాంతి మంత్రాలు.
ఫలితం: మానసిక ప్రశాంతత, కుటుంబ సౌఖ్యం.

32. అశ్వినీ తంత్ర

దేవత: అశ్వినీ దేవతలు
విధానం: ఆయుర్వేద సంబంధ మంత్ర సాధన.
ఫలితం: వైద్యశక్తి, ఆరోగ్య సాధన.

33. నంది తంత్ర

దేవత: నందిేశ్వరుడు
విధానం: పంచాక్షర జపం, నంది యంత్ర పూజ.
ఫలితం: శక్తి, ధైర్యం, భక్తి స్థిరత్వం.

34. కపిల తంత్ర

దేవత: కపిల ముని
విధానం: సాంక్య ధ్యానం, ధ్యానయోగ పద్ధతి.
ఫలితం: జ్ఞానం, ఆత్మావగాహన.

35. వాయుక తంత్ర

దేవత: వాయు దేవుడు
విధానం: ప్రాణాయామ, వాయు నియంత్రణ సాధన.
ఫలితం: శరీరశక్తి, జీవన బలం.

36. చిత్త తంత్ర

దేవత: దక్షిణామూర్తి
విధానం: మనోనియంత్రణ ధ్యానం, మౌనసాధన.
ఫలితం: మానసిక బలం, ఆత్మశాంతి.

37. బృహస్పతి తంత్

దేవత: గురు బృహస్పతి
విధానం: గురు మంత్ర జపం, విద్యా హోమం.
ఫలితం: జ్ఞానం, గురు కృప, విద్యా ప్రాప్తి.

38. శుక్ర తంత్ర

దేవత: శుక్రాచార్య
విధానం: శుక్ర మంత్ర జపం, రసాయన సాధన.
ఫలితం: ఆకర్షణ, శరీర బలం, కాంతి.

39. మంగళ తంత్ర

దేవత: మంగళ దేవుడు
విధానం: మంగళ గాయత్రీ జపం, అగ్నిహోత్రం.
ఫలితం: ధైర్యం, విజయ సాధన, శక్తి.

40. బుధ తంత్ర

దేవత: బుధ దేవుడు
విధానం: బుధ మంత్ర జపం, విద్యా పూజ.
ఫలితం: జ్ఞానం, వ్యాపార విజయం, బుద్ధి శక్తి.

41. రాహు తంత్ర

దేవత: రాహు దేవుడు
విధానం: రాత్రి జపసాధన, నీలవర్ణ దీపారాధన.
ఫలితం: దుష్టదృష్టి నివారణ, మాయావిద్య నియంత్రణ, రక్షణ.

42. కేతు తంత్ర

దేవత: కేతు దేవుడు
విధానం: నాగమంత్ర సాధన, భూమి న్యాస పూజ.
ఫలితం: పితృశాంతి, దోష నివారణ, ఆధ్యాత్మిక ప్రగతి.

43. కృష్ణ తంత్ర

దేవత: శ్రీకృష్ణుడు
విధానం: గోపాల మంత్ర జపం, ప్రేమ-భక్తి సాధన.
ఫలితం: భక్తి, ఆకర్షణ, హృదయశాంతి.

44. రామ తంత్ర

దేవత: శ్రీరాముడు
విధానం: రామనామ జపం, హనుమత్ఉపాసన.
ఫలితం: ధైర్యం, రక్షణ, ధర్మబలం.

45. వేద తంత్ర

దేవత: వాగ్దేవత / సరస్వతి
విధానం: వేదమంత్ర ధ్యానం, శబ్దయోగ సాధన.
ఫలితం: జ్ఞానం, వాక్ప్రతిభ, బ్రహ్మజ్ఞానం.

46. యోగా తంత్ర

దేవత: దక్షిణామూర్తి / ఆదినాథుడు
విధానం: కుండలినీ యోగ, ప్రాణాయామ, ధ్యానం.
ఫలితం: ఆత్మసిద్ధి, మానసిక స్థిరత్వం.

47. మాధవ తంత్ర

దేవత: శ్రీ మహావిష్ణు
విధానం: విష్ణు సూత్ర జపం, వైకుంఠ ధ్యానం.
ఫలితం: భక్తి, శాంతి, పరమపద ప్రాప్తి.

48. విష్ణు తంత్ర

దేవత: శ్రీ విష్ణు
విధానం: నారాయణ మంత్ర జపం, చక్ర ధ్యానం.
ఫలితం: సంపద, విజయ సాధన, రక్షణ.

49. శివ తంత్ర

దేవత: మహాదేవుడు
విధానం: పంచాక్షర జపం, లింగాభిషేకం, ధ్యానం.
ఫలితం: శక్తిసిద్ధి, జ్ఞానసిద్ధి, మోక్షం.

50. కాళ తంత్ర

దేవత: మహా కాళ భైరవుడు
విధానం: రాత్రి భైరవ మంత్ర జపం, కాళసాధన.
ఫలితం: ఉగ్రశక్తి సాధన, కాల నియంత్రణ, రక్షణ.

51. శక్తి తంత్ర

దేవత: పరాశక్తి / లలిత త్రిపురసుందరి
విధానం: శ్రీచక్ర పూజ, నవరాత్రి హోమం.
ఫలితం: శక్తిసిద్ధి, సంపద, ఆధ్యాత్మిక ఉత్కర్ష.

52. విత్తి తంత్ర

దేవత: కుబేరుడు
విధానం: కుబేర మంత్ర జపం, నారికేల్ హోమం.
ఫలితం: ఆర్థిక సంపద, సౌభాగ్యం, విజయ సాధన.

53. చందన తంత్ర

దేవత: చంద్ర దేవుడు / సౌమ్య శక్తి
విధానం: చందన అర్చన, ధ్యానం.
ఫలితం: మానసిక శాంతి, దేహ శుద్ధి, వైద్యశక్తి.

54. హంస తంత్ర

దేవత: పరమహంస రూపిణి
విధానం: సూత్రధ్యానం – “హంస సోహం” మంత్ర సాధన.
ఫలితం: ఆత్మబోధ, జ్ఞానప్రాప్తి.

55. మృగ తంత్ర

దేవత: వనదేవత / చండేశ్వరుడు
విధానం: అరణ్యాధ్యానం, రక్షామంత్ర సాధన.
ఫలితం: భయం నివారణ, శత్రు రక్షణ.

56. గజ తంత్ర

దేవత: గజాననుడు (గణపతి)
విధానం: గజ మంత్ర జపం, గణపతి హోమం.
ఫలితం: స్థిరత్వం, ధైర్యం, అడ్డంకుల నివారణ.

57. నంది తంత్ర (రహస్య రూపం)

దేవత: నందిేశ్వరుడు
విధానం: పంచాక్షర మంత్రంతో నంది ధ్యానం.
ఫలితం: శివశక్తి అనుభూతి, ఆత్మసిద్ధి.

58. అశ్వత్థ తంత్ర

దేవత: విష్ణు / పితృదేవతలు
విధానం: అశ్వత్థ వృక్ష పూజ, తర్పణ సాధన.
ఫలితం: పితృకృప, సంతాన సౌఖ్యం.

59. పుష్ప తంత్ర

దేవత: లలితా / లక్ష్మీ దేవి
విధానం: పుష్పార్చన, సుగంధ సాధన.
ఫలితం: శుభఫలాలు, ఆకర్షణ, సౌభాగ్యం.

60. మణి తంత్ర

దేవత: నాగదేవతలు
విధానం: రత్న మంత్ర సాధన, నాగపూజ.
ఫలితం: రక్షణ, సంపద, మానసిక బలం.

61. రత్న తంత్ర

దేవత: భూమాత / కుబేరుడు
విధానం: రత్న ధ్యానం, భూమి న్యాసం.
ఫలితం: సంపద, స్థిరత్వం, ఆర్థిక విజయాలు.

62. కుంభ తంత్ర

దేవత: వరుణ దేవుడు
విధానం: జల కుంభ పూజ, తర్పణ సాధన.
ఫలితం: శుద్ధి, ఆరోగ్యం, శాంతి.

63. గగన తంత్ర

దేవత: ఆకాశేశ్వరుడు
విధానం: ధ్యాన పద్ధతి — శూన్య సాధన.
ఫలితం: మానసిక విముక్తి, ఆత్మసిద్ధి.

64. తార తంత్ర

దేవత: తారాదేవి (బౌద్ధశక్తి)
విధానం: తారా మంత్ర జపం, ధ్యాన సాధన.
ఫలితం: భయ నివారణ, ఆధ్యాత్మిక రక్షణ, జ్ఞానప్రాప్తి.

64 తంత్ర విద్యలు — భౌతికం నుండి ఆధ్యాత్మికం వరకు విస్తరించిన సాధన పద్ధతులు.

ప్రతి తంత్రం ఒక శక్తి, దేవత, సాధన విధానం, ఫలితంతో అనుసంధానమై ఉంటుంది.
వీటిని శివుడు పార్వతికి తంత్రాగమ రూపంలో ఉపదేశించినట్లు కౌల మరియు శాక్త సంప్రదాయాలు చెబుతాయి.

Saturday, October 18, 2025

తాళపత్రాలలో నిక్షిప్తమై ఉన్న సనాతన సాంప్రదాయ, శాస్త్రీయ, సంస్కృతి, విశ్వాసాల సమాహార గోపురం

 తాళపత్రాలలో నిక్షిప్తమై ఉన్న సనాతన సాంప్రదాయ, శాస్త్రీయ, సంస్కృతి, విశ్వాసాల సమాహార గోపురం  


               *1.  సూర్యుని ఏఏ సమయాల్లో చూడరాదు?*

                *ప్రభాతవేళ, సూర్యాస్తమయవేళ, మిట్టమధ్యాహ్న సమయమున రవిని సూటిగా చూడరాదు. అలాగే సూర్య మరియు చంద్రగ్రహణ సమయాల్లోనూ చూడరాదు. అట్టి సమయాల్లో సూర్యుని నుంచి వెలువడే కిరణాలు మానవ శరీర నిర్మాణానికి కీడును కల్గిస్తాయి.*

                *2.  శ్రీకృష్ణపరమాత్ముడు నెమలి పింఛాన్ని తలపై ఎందుకు ధరిస్తాడు?*

                *సకల చరాచర సృష్టిలో సంభోగం చెయ్యని ఏకైక ప్రాణి నెమలి మాత్రమే. శ్రీకృష్ణునికి 16,000 వేలమంది గోపికలు. అన్ని వేలమంది గోపికలతో శ్రీకృష్ణుడు సరససల్లాపాలు మాత్రమే ఆడాడు. అల్లరిచేసి గెలిచే వాడు. ఆ విషయాన్ని తెలియచేయటానికే శ్రీకృష్ణుడు నెమలి పింఛం ధరిస్తాడు. శ్రీకృష్ణుడు ఒట్టి అల్లరి కృష్ణుడు మాత్రమే.*

             *3.  మాతృ, పితృ, ఆచార్య, దైవ, ఋషి రుణాలంటే?*

             *పశుపక్షాదుల్లా పుట్టగానే, కాళ్ళు రాగానే బైటికి తరిమెయ్యరు. తల్లీ, తండ్రీ ఇద్దరూ జీవితకాలం సంపాదించిన ధనాన్ని పోగు చేసి ఇచ్చి, పెళ్ళి కూడా చేసి ధర్మ, అర్ధాలతో సుఖించే పరిస్థితులని సృష్టిస్తారు. ప్రేమతో పెంచుతారు. తల్లీ, తండ్రీ రుణం, ఎంత సేవచేసినా తీరదు. చేయాల్సిందల్లా ముసలితనంలో వార్ని బిడ్డల్లా చూసుకోవటమే.*

             *మల మూత్రాలను కడిగి పెంచి పెద్ద చేసినందుకు ఆ సమయంలో తల్లి ఋణం తీర్చుకోవాలి. తాను సంపాదనతో నిస్వార్ధముతో పెంచి పెద్ద చేసిన తండ్రి ఋణం తీర్చుకోవాలి. లోకజ్ఞానాన్నీ, విజ్ఞానాన్నీ, నేర్పినందుకు గురు ఋణాన్నీ, మనకి బుద్ధినీ, కర్మనీ ఇస్తున్న దైవ ఋణాన్ని భక్తి ద్వారా ధర్మ మార్గం ద్వారా, సకల శాస్త్రాలనూ, ధర్మాలనూ గ్రంథాల ద్వారా మనకు అందచేసినందుకు ఋషి రుణాన్ని తీర్చుకోవాలి. వివాహం ద్వారా అన్ని రుణాలన్ని తీర్చి, తిరిగి తాను ఋణ పడటమే మానవ జన్మ.*

              *4.  హారతి వల్ల లాభము ఏమిటి ?*

              *గృహములోను, పూజాగదిలోనే కాదు, గుడిలోను, శుభకార్యాలప్పుడూ.... పిల్లల పుట్టిన రోజుల వేడుకలలోను, క్రొత్త పెళ్ళికూతురు గృహములోకి ప్రవేశించేటప్పుడూ హారతి ఇస్తుంటారు. ఎక్కడ హారతి పట్టినా '' ఓ ఆరోగ్య సూత్రం ఉంది. శుభకార్యాల్లో ఎన్నో కుటుంబాలకు సంబంధించిన వారు ఒకేచోట చేరుతారు. అలాగే దేవాలయలలో అనేక మంది భక్తులు దేవుడ్ని దర్శిస్తుంటారు. దానివలన పరిసర ప్రాంతపు గాలి అపరిశుభ్రం అవుతుంది. అనేక క్రిములు చేరతాయి. కనుక హారతి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం ద్వారా అనేక సూక్ష్మక్రిములు కర్పూర పొగకు నశిస్తాయి. ముక్కుకు సంబంధించిన వ్యాధులూ, అంటువ్యాధులూ ప్రబల కుండా ఉంటాయి. కర్పూరహారతి ఎలాగైతే క్షీణించి పోతుందో, అలాగే మనం తెలిసీ తెలియక చేసిన పాపాలు సమసిపోవాలని కోరుకుంటూ హారతిని కళ్ళకద్దుకోవటమే అసలు సిసలు ఆధ్యాత్మిక అర్థం, పరమార్ధం.*

           *5.  చిన్న పిల్లలకి దిష్టి ఎందుకు తీస్తారు?*

           *చిన్నారుల పుట్టిన రోజు పండగ వేడుకలలో అలాగే అనేక శుభకార్యాల్లో పాల్గొన్న పెద్దలకీ, పిల్లలకీ దిష్టిని విభిన్న పద్ధతుల్లో తీస్తూ ఉంటారు. పిల్లలూ, పెద్దలూ ఘనవిజయాలు సాధించినప్పుడూ, బాగా ప్రశంసలు పొందినప్పుడు అతిగా నీరసించి డీలాపడినప్పుడు దిష్టితీస్తారు. అలాగే పిల్లలకి పసుపూ, సున్నం కలిపిన నీటితో దిష్టితీస్తూంటారు. బయటజనుల దృష్టిదోషం తగలకుండా ఉండాలని దిష్టితీస్తే చిన్నపిల్లవాడు కలవరింతలు లేకుండా నిద్రపోవటమూ, నిద్రలో ఉలిక్కిపడుతూ లేవటం వంటి అవలక్ష ణాలు లేకుండా ఉంటాడు.*

           *చిన్నపిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చూ అనేక వేడుకల్లో పాల్గొనటం వల్ల చుట్టూ అంతా చేరటంవల్ల, చిన్నపిల్లలూ లేదా పెద్దలూ కొంత అస్వస్థతకు గురి అవుతారు. అందుకే వివాహ వేడుకలలోను, పుట్టినరోజు వేడుకలలోను విధిగా హారతి ఇచ్చి చివరలో ఎర్ర నీళ్ళతో దిష్టి తీస్తారు. ఎర్రరంగు పదేపదే చూడటం వల్ల అనేక రోగాలు సమసిపోతాయి. మనసుకి ప్రశాంతతోపాటు ధైర్య గుణంవస్తుంది.*

             *6.  ఎలాంటివేళల్లో భోజనాన్ని తినకూడదు?*

             *గ్రహణం సమయమున అనగా సూర్యగ్రహణానికి 12 గంటల ముందుగా, అలాగే చంద్రగ్రహణానికి 9 గంటల ముందుగా ఎటువంటి పదార్థాన్ని ఆహారంగా తీసుకోకూడదు.*

        *సర్వేజనాః సుఖినోభవంతు*

*🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Thursday, October 16, 2025

పితృదేవతలకు ముక్తినిచ్చే స్మశాన నారాయణస్వామి ఆలయం, అలంపురం

పితృదేవతలకు ముక్తినిచ్చే స్మశాన నారాయణస్వామి ఆలయం, అలంపురం


*పితృదోషం:* మన తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులను వంశపారంపర్యంగా అనుభవించటానికి మనం ఎలాగ హక్కు అర్హత పొందుతామో  అలాగే... తాతలు తండ్రులు చేసిన పాపపుణ్యాలు కూడా ఆ వంశానికి వర్తిస్తాయి. మన పెద్దలు పుణ్యాలు మంచిపనులు చేస్తూ ఉంటే వారి వంశం సుఖ సంతోషాలతో ఉంటుంది. అలాగే అదే పూర్వికులు పాపాలు గనుక చేసి ఉంటే అది తెలుసు కావచ్చు తెలియక కావచ్చు ఏదైనా గాని వారు చేసిన పాప కర్మలు ఆ వంశపారంపర్యంగా ఆ కుటుంబంలోని వారు అనుభవించక తప్పదు..

మేము తెలిసి తెలియక ఏ తప్పు చేయలేదు కానీ బాధలను కర్మలను అనుభవిస్తున్నాను అనే బాధ పడేవారు ముఖ్యంగా తెలుసుకోవలసినది ముఖ్యమైనది ఒక్కటే. అదే *పితృదోషం*.

(ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విషయం. అందుకే ఈ పోస్టు పెడుతున్నాను)

🔹పితృ దోషం ఉన్నవారు ఈ జన్మలో వారు ఏ పాప కర్మలను చేయకపోయినా కుటుంబం ఇబ్బందులపాలు అవుతూ కష్టాలకు లోనవుతూ ఉంటుంది.

🔹ఎందుకంటే మన పెద్దలు చేసిన పాప ఫలాలు. వారి ఆస్తులను పంచుకున్నప్పుడు వారి పాపాలను కూడా కచ్చితంగా పంచుకొని తీరవలసిందే.

*పితృదోష వలన కలిగే దుష్పరిణామాలు కొన్ని చర్చించుకుందాము...*

- చిన్న వారు అకాలమరణం పొందడం. 

- శరీరంలోని ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి ఆస్పత్రి పాలవడం.

- అప్పులపాలు అవ్వడం, లేనిపోని అపనిందల పాలు అవ్వడం.

- మన ప్రమేయం లేకుండా ప్రమాదాలకు గురయ్యే జీవితాంతం కర్మలను అనుభవించడం.

- మన కళ్ళ ముందు మన పిల్లలు చెడు వ్యసనాలకు బానిస అయ్యి కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించడం

*🔹ఇలా వీటన్నిటికీ కారణం పితృ దోషం కారణం. దీని నుండి విముక్తి పొందడానికి ఏకైక పరిష్కారం. స్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకోవడమే* ... అయితే ఈ స్మశాన నారాయణుడి ఆలయాలు ఈ భారతదేశంలో రెండే రెండు ఉన్నాయి.

1 కాశీ
2 పాపనాశి  (అలంపురం 'జోగుళాంబ గద్వాల జిల్లా)

🔹అలంపురంలోని ఈ స్మశాన నారాయణుడి ఆలయం గురించి కేరళ తాంత్రిక శాస్త్రంలో చెప్పడం జరిగింది.

🔹 విచిత్రం ఏమిటంటే ఈ స్మశాన నారాయణ ఆలయం అలంపురంలో ఉన్నదన్న విషయం ఎవరికీ తెలియదు.

🔹అయితే ఈ స్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకుని మన బాధల నుండి విముక్తి పొందాలంటే ఏమి చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం...

🔹స్మశాన నారాయణుని ప్రసన్నం చేసుకోవాలంటే... పాలు అన్నముతో చేసిన పాయసం, అన్నము, ముద్దపప్పు, నేయి, వడ ఇవి నైవేద్యంగా పెట్టాలి ! ఈ విధంగా స్మశాన నారాయణుడికి నైవేద్యం పెడతారో ఆ ప్రసాదాన్ని వారి ఇంటి పేరు గల వంశస్థులు మాత్రమే దానిని  స్వీకరించాలి. ఇతరులకు ఇవ్వరాదు. 

🔹స్వామికి తెల్లటి కండువా అలంకరించాలి.  ఈ వంటలను స్వయంగా వండుకొని తీసుకొని వెళ్ళి నివేదన చేయాలి లేదా (వెళ్ళడానికి వీలు లేనివారు ఖర్చులను ఇచ్చి అక్కడి పూజారి చే చేయించ వచ్చును).

🔹అలంపురం తెల్లవారుజామునే వెళ్లి తుంగభద్రా నదీ స్నానం చేసి అమ్మవారిని అయ్యవార్లను దర్శనం చేసుకున్న తరువాత ఈ  స్మశాన నారాయణుడిని సేవించుకొని ఇంక వేరే చోటకి వెళ్లకుండా ఇంటికి చేరుకోవాలి.

🔹ఈ ఆలయ ప్రాముఖ్యము  తంత్ర గురు "వేణు మాధవ నంబూద్రి" ద్వారా తెలుసుకోవడం జరిగింది ' ఈ అలంపుర స్మశాన నారాయణుడి దాని ప్రాముఖ్యము కేరళ తంత్ర శాస్త్రంలో లిఖించబడి ఉన్నదట !

🔹ఎంతోమంది పితృదోషం తో బాధపడే వారు ఉన్నారు. అలాంటివారికి ఈ విషయం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం.

*చేరుకొనే విధానం:*

💚అలంపూర్ "హరిత హోటల్ " కు ప్రక్కన ఒక చిన్న దారి ఉంటుంది . ఆ చిన్న దారి ఎడమవైపున 1.2 కిలోమీటర్ల దూరంలో పాపనాశేశ్వర ఆలయ సముదాయం ఉంటుంది . ఆలయ సముదాయంలో ఒక ప్రత్యేక ఆలయం "స్మశాన నారాయణుని ఆలయం".

*💚ఇంకొక ముఖ్య విషయం :* స్మశాన నారాయణుడి ఆలయ సమూహాలలో ప్రధాన దైవం శ్రీ పాపనాశేశ్వరుడు ' 7వ శతాబ్దం నాటి అతి పురాతన ' అతిపెద్ద మరకత లింగం ' దక్షిణ కాశి అంటారు. ఈ స్వామిని దర్శించుకున్న నంతనే పాపాలు నాశనం అవుతాయని ప్రతీతి!

కార్తీకమాసంలో ఏ తిథి రోజున ఏం చేయాలి? విధానాలు తెలుసుకుందా..!!

కార్తీకమాసంలో ఏ తిథి రోజున ఏం చేయాలి? విధానాలు తెలుసుకుందా..!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌸దీపావళి మరుసటిరోజు నుంచి మొదలయ్యే కార్తీక మాసం అన్ని మాసాల్లో కెల్లా విశిష్టమైనదని మొట్టమొదట వశిష్ట మహర్షి జనక మహారాజుకు చెప్పాడని పురాణోక్తి.

🌿న కార్తీక సమో మాసో
న శాస్త్రం నిగమాత్పరమ్ |
నారోగ్య సమముత్సాహం న దేవః కేశవాత్పరః||

🌸అంటే కార్తీక మాసంలోని ప్రతీ రోజు పుణ్యప్రదమే. ఒక్కో రోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది. 

🌷 ఈ మాసంలో ఏ తిథిలో ఏమి చేయాలో తెలుసుకుందాం. 🌷

🌿కార్తీక శుద్ధ పాడ్యమి :
తెల్లవారుజామునే లేచి, స్నానం చేసి, గుడికి వెళ్లాలి. కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేట్టుగా అనుగ్రహించమని ప్రార్థించి, సంకల్పం చెప్పుకొని, ఆకాశదీపాన్ని సందర్శించుకోవాలి.

🌸విదియ :
సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి, కానుకలు ఇచ్చి రావాలి. ఇలాంటివారికి యమగండం తప్పుతుందంటారు.

🌿తదియ :
అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి.

🌸చవితి :
నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి. పుట్టలో పాలు పోయాలి.

🌿పంచమి :
దీన్ని జ్ఞాన పంచమి అంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే జ్ఞానవృద్ధి కలుగుతుంది.

🌸షష్ఠి :
ఈరోజున బ్రహ్మచారికి ఎర్ర గడుల కండువాను దానం చేస్తే సంతానప్రాప్తి కలుగుతుంది.

🌿సప్తమి :
ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానం ఇస్తే ఆయుఃవృద్ధి ప్రాప్తిస్తుంది.

🌸అష్టమి :
ఈరోజున చేసే గోపూజ మంచి ఫలితాలను ఇస్తుంది. దీన్ని గోపాష్టమి అని కూడా అంటారు.

🌿నవమి :
నేటి నుంచి మూడు రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి.

🌸దశమి :
నేడు రాత్రిపూట విష్ణుపూజ చేయాలి.

🌿ఏకాదశి :
దీన్నే బోధనైకాదశి అంటారు. ఈరోజున విష్ణుపూజ చేస్తే సద్గతులు కలుగుతాయి.

🌸ద్వాదశి :
ఈరోజు క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. సాయంకాలం ఉసిరి, తులసి మొక్కల వద్ద విష్ణుపూజ చేసి, దీపాలను వెలిగించాలి. దీంతో సర్వపాపహరణం అవుతుంది.

🌿త్రయోదశి :
సాలగ్రామ దానం చేస్తే కష్టాలు దూరమవుతాయి.

🌸చతుర్దశి :
పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే మంచిది.

🌿కార్తీక పూర్ణిమ :
కార్తీక మాసంలోకెల్లా అతి పవిత్రమైన రోజు. ఈరోజున నదీస్నానం చేసి, శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవాలి. ఈరోజున సత్యనారాయణ వ్రతం చేస్తే సర్వపాపాలూ తొలగిపోతాయి.

🌸కార్తీక బహుళ పాడ్యమి :
ఆకుకూర దానం చేస్తే మంచిది.

🌿విదియ :
వనభోజనాలు చేయడానికి అనువైన రోజు.

🌸తదియ :
పండితులు, గురువులకు తులసిమాలను సమర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయి.

🌿చవితి :
రోజంతా ఉపవాసం చేసి, సాయంకాలం గరికతో గణపతిని పూజించాలి. ఆ గరికను దిండు కింద పెట్టుకుని పడుకుంటే పీడకలలు పోతాయి.

🌸పంచమి :
చీమలకు నూకలు చల్లడం, శునకాలకు అన్నం పెట్టడం మంచిది.

🌿షష్ఠి :
గ్రామదేవతలకు పూజ చేయాలి.

🌸సప్తమి :
జిల్లేడు పూల దండను శివునికి సమర్పించాలి.

🌿అష్టమి :
కాలభైరవాష్టకం చదివి, గారెల దండను భైరవుడికి (శునకం) సమర్పిస్తే ధనప్రాప్తి కలుగుతుంది.

🌸నవమి :
వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి, పండితునికి దానమిస్తే పితృదేవతలు సంతోషిస్తారు.

🌿దశమి :
అన్నదానం చేస్తే విష్ణువు సంతోషించి, కోరికలు తీరుతాయి.

🌸ఏకాదశి :
విష్ణు ఆలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ చేస్తే మంచి ఫలితాలుంటాయి.

🌿ద్వాదశి :
అన్నదానం లేదా స్వయంపాకం సమర్పిస్తే శుభం.

🌸త్రయోదశి :
ఈరోజున నవగ్రహారాధన చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి.

🌿చతుర్దశి :
ఈరోజున మాస శివరాత్రి. కాబట్టి శివారాధన, అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు, గ్రహబాధలు తొలగుతాయి.

🌸అమావాస్య :
పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకు నరక బాధలు తొలగుతాయి..స్వస్తి..🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

Saturday, October 11, 2025

వాడపల్లి_వెంకటేశ్వరస్వామి_ఆలయ_చరిత్ర

వాడపల్లి_వెంకటేశ్వరస్వామి_             ఆలయ_ చరిత్ర


ఏడు శనివారాల వెంకన్న దేవుడిగా ప్రసిద్ధి చెందిన స్వామి వాడపల్లి ఏడు కొండలవాడు. కోనసీమ తిరుపతిగా ఖ్యాతి పొందింది వాడపల్లి. తిరుపతి తర్వాత వెంకటేశ్వర స్వామి క్షేత్రాల్లో ముఖ్యమైన ఆలయంగా భక్తుల నమ్మకం పొందింది వాడపల్లి వేంకటేశ్వరుడి ఆలయం. ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి. వాడపల్లి క్షేత్రం లోని మూలవిరాట్టు రాతితో చేయబడింది కాదు ఇక్కడ వెంకటేశ్వరడు రాయితో కాకుండా నల్లని చెక్కలో స్వయంభుగా కొలువై ఉన్నాడు. సాక్షాత్తు నారద మహర్షి విష్ణువుకు ఇక్కడ వెంకటేశ్వరడిగా పేరు పెట్టినట్లు చెబుతారు. వరుసగా ఏడు శనివారాలు క్రమం తప్పకుండా స్వామివారి ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేసి స్వామిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి అని భక్తుల నమ్మకం అందువల్లే ఈ కేత్రానికి శనివారాల్లో వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.

శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి వైకుంఠానికి చేరుకుంటారు. దీంతో ద్వాపర యుగం ముగిసి కలియుగం ప్రారంభమవుతుంది. కలియుగంలోని ప్రజలు దైవచింతన మరిచిపోయి డబ్బు సంపాదన పై ఎక్కువ దృష్టి సారిస్తూ ఉంటారు దీంతో భూమండలంపై పాపాలు పెరిగిపోతూ ఉంటాయి. ఈ విషయమై మునులు తీవ్రంగా భయపడతారు నారదుడి ఆధ్వర్యంలో వైకుంఠానికి వెళ్లి ఈ భూమండలంపై జరుగుతున్న విషయాలను విష్ణువుకు తెలియజేసి ప్రజలను చెడు మార్గం వైపు వెళ్లకుండా రక్షించాల్సిందిగా వేడుకుంటారు. దీంతో వారికి విష్ణువు అభయమిస్తాడు ఈ కలియుగంలో తాను కలియుగ దైవంగా వెలసి నిత్యం ప్రజలతో పూజలు అందుకుంటానని చెబుతాడు దీనివల్ల మనుషుల్లో భక్తి భావం పెరుగుతుందని అభయమిస్తాడు. వాడపల్లిలో స్వయంభుగా వ్యవస్థానని వారికి వివరిస్తాడు దీనితో మునులు సంతోషంతో అక్కడ్నుంచి వెని తిరుగుతారు.

కొన్ని రోజుల తర్వాత వాడపల్లి వద్ద ఉన్న గౌతమీ నదిలో ఓ చందనం పెట్టే తీరం వైపు వస్తున్నట్లు కనిపిస్తుంది అయితే దానిని గుర్తించి తీసుకురావడానికి వెళితే నదిలో ఆ పెట్ట కనిపించదు. చివరికి వాడపల్లి గ్రామంలో, ఓ వృద్ధ బ్రాహ్మణుడి కలలో ఆ పెట్టెలో మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉన్నాడని, సుచిగా వెళితే కనిపిస్తాడని వినిపిస్తుంది. దీంతో ఆ తీరంలో ఉన్న ప్రజలు మంగళ స్నానాలు చేసి నదిలోకి వెళితే ఓ పక్షినీడలో ఉన్న పెట్టే కనిపిస్తుంది. భక్తిశ్రద్ధలతో ఆ పెట్టిన ఒడ్డుకు చేరుస్తారు. దానిని తెరిచి చూడగా అందులో శంఖం చక్రం గదతో పాటు లక్ష్మీదేవితో శ్రీమహావిష్ణువు కనిపిస్తాడు ఇంతలో అక్కడికి చేరుకున్న నారదుడు మహావిష్ణువు అవతారం గురించి చెబుతాడు. అంతేకాకుండా ఆ మూర్తికి వేమ్ అంటే పాపాలను కట అంటే పోగొట్టేవాడు అని నామకరణ చేసి గోదావరి నది తీరంలో విగ్రహాన్ని ప్రతిష్టింప చేస్తాడు. అలా ఇక్కడ కొలువైన స్వామికి వెంకటేశ్వరగా పేరు వచ్చింది. స్థానికులు ఆలయాన్ని చిన్నగా నిర్మిస్తారు అయితే కాలక్రమంలో ఈ దేవాలయం నదిలో మునిగిపోతుంది ఇది ఇలా ఉండగా ఈ ప్రాంతంలో పెనుబోతుల గజేంద్రుడు అనే క్షత్రియుడు ఉండేవాడు. అతడు చాలా ఓడలకు అధిపతి. ఒకసారి తుఫాను సంభవించి అతని ఓడలన్నీ సముద్రంలో ఎక్కడికో కొట్టుకుపోతాయి. దీంతో తన ఓడలు సురక్షితంగా ఒడ్డుకు తీసుకువస్తే నదిలో మునిగిపోయిన దేవాలయంలోని విగ్రహాన్ని తిరిగి ఒడ్డుకు చేర్చి దేవాలయాన్ని నిర్మిస్తానని మొక్కుకుంటాడు. తుఫాను వెలిశాక ఓడలు భద్రంగా ఒడ్డుకు చేరాయి. దీంతో గజేంద్రుడు వాడపల్లిలో ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని కట్టించాడని స్థానిక శాసనాలు చెబుతున్నాయి

వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపం చూడగానే ఆకట్టుకుని తిరుమలేశాన్ని దర్శించిన అనుభూతి కలుగుతుంది. భారతదేశంలో అశేష భక్తజనం సందర్శించే ఆరాధ్య దేవాలయాలలో వాడపల్లి ఒకటి ప్రతి ఏటా చైత్ర శుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామివారి తీర్థం కల్యాణోత్సవం వైభవంగా జరుగుతాయి వాటిలో భాగంగా జరిగే రథోత్సవం గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ ఉత్సవాలు చూడడానికి ఉభయ తెలుగు రాష్ట్రాలు భక్తులు తరలివచ్చను.

Friday, October 10, 2025

శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయం : అయినవిల్లి

శ్రీ  విఘ్నేశ్వర స్వామి దేవాలయం :  అయినవిల్లి


#స్వయంభూ గణపతి క్షేత్రాలలో 'అయినవిల్లి' ఒకటి.
కృతయుగం నుండే నెలకొని ఉన్నట్లుగా చెప్పబడుతున్న ఈ స్వయంభూ గణపతి అత్యంత మహిమాన్వితుడు. #పవిత్రకోనసీమలో అయినవిల్లి గ్రామంలో స్వయంభువుగా నెలకొనియున్నది శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవాలయం. #దక్షప్రజాపతి దక్షయజ్ఞం నిర్వర్తించేముందు విఘ్న వినాయకుడైన ఈ వినాయకుని పూజించి, పునీతుడైనట్లు క్షేత్రపురాణం తెలుపుతోంది. #వ్యాసమహర్షి దక్షిణ దేశయాత్ర ప్రారంభంలో పార్వతీ తనయుణ్ణి ప్రతిష్టించాడని మరొక కథ వ్యాప్తిలో ఉంది. 

#అమలాపురానికి 12 కి.మీ దూరంలో ఉన్న అయినవిల్లి గ్రామంలో వెలపి ఉన్న సిద్ధివినాయకస్వామి గురించి ఆంధ్రప్రదేశ్‌లో తెలియని వారుండరు. 

 #ఈ సిద్ధివినాయకుని భక్తిగా తలచుకుని ఏ కార్యం తలపెట్టినా జయప్రదంగా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. #ఈ అయినవిల్లి గణపతికి గరిక పూజలన్నా, కొబ్బరికాయ మొక్కులన్నా ఎంతో ఇష్టం. #అందుకే ఈ క్షేత్రం గరిక పూజలకు, కొబ్బరికాయ మొక్కులకు పెట్టిన పేరయింది. #ఏటా ఇక్కడకొచ్చే భక్తులు తమ మొక్కుల రూపంలో స్వామికి సమర్పించే కొబ్బరికాయల సంఖ్య దాదాపు ఇరవై లక్షలు దాటే ఉంటుందంటే నమ్మబుద్ధి కాదు. #కానీ ఇది నిజం అని ఈ సిద్ధివినాయకుడు తన కృపాకటాక్షాలతో భక్తుల కోరికలు తీరుస్తూ ప్రతి సంవత్సరం నిరూపిస్తూనే ఉన్నాడు. 

#దక్షిణాంధ్రలో 'కాణిపాకం' ప్రసిద్ధి చెందినట్లు ఉత్తరాంధ్రలో అయినవిల్లి ప్రసిద్ధి చెందింది. #కృతయుగం నుండే నెలకొని ఉన్నట్లుగా చెప్పబడుతున్న ఈ స్వయంభూ గణపతి అత్యంత మహిమాన్వితుడు. #అయినవిల్లిలోని సిద్ధివినాయకుడు స్వయంభువుడు. #ఈయన కాణిపాకం వినాయకుడి కంటే ముందే ఇక్కడ కొలువై ఉన్నాడని చెబుతారు. #అసలు కాణిపాకం  పుణ్యక్షేత్రం కావడానికి ఈ అయినవిల్లి సిద్ధివినాయకుడే కారణమని స్థలపురాణం చెబుతుంది.

#ఇక్కడ నిత్యం లక్ష్మీగణపతి హోమం చాలా ఏళ్లుగా జరుగుతూ ఉంది. అదే విధంగా ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో స్వామివారికి పెన్నులతో అభిషేకం చేయించి వాటిని విద్యార్థులకు అందజేస్తారు.

#సర్వేజనా సుఖినోభవంతు 

@highlight

Thursday, October 9, 2025

ఆయుష్షును హరించే అగంతక మృత్యువులు అంటే ఏంటి*??? కాలమృత్యువు అన్న ఏంటి??? జ్యోతిష శాస్త్రం లో కొన్ని కారణాలు*???

ఆయుష్షును హరించే అగంతక మృత్యువులు అంటే ఏంటి*??? కాలమృత్యువు అన్న ఏంటి???
జ్యోతిష శాస్త్రం లో కొన్ని కారణాలు*???


*అగంతక మృత్యువులు*
ఏకోత్తరం మృత్యుశత మస్మిస్ ప్రతిష్ఠితం! 
తత్రైకః కాలసంయుక్త శేషాస్తాగంతవః స్మృతాః॥

మనిషి శరీరంలో మొత్తం 101 రకాల   మృత్యువులు ఉంటాయని చెప్పబడింది. 
వీటిలో *100 అగంతు మృత్యువులు* అనేవి అనుకోకుండా, బయటి కారణాల (ప్రమాదాల)వల్ల లేదా వ్యాధుల రూపంలో వచ్చేవి. మిగిలిన ఒకే *కాలమృత్యువు*.

*కాలమృత్యువు* అంటే మనిషికి నిర్ణయించబడిన ఆయుష్షు తీరిపోయి, సమయం వచ్చినప్పుడు సంభవించే మరణం. దీనిని ఆపడానికి లేదా నివారించడానికి ఎలాంటి మార్గమూ (ఉపాయం) లేదు.

మిగతా 100 అగంతు మృత్యువులు రోగాల రూపంలో లేదా ముందు చేసిన కర్మల (ఆగామి కర్మలు) ఫలితంగా వస్తాయి.

ఈ 100 రకాల మృత్యువులు జపాలు, దానాలు, హెూమాలు (యాగాలు), మందులు (ఔషధాలు) వంటి వాటి ద్వారా నివారించవచ్చు.

*కాలమృత్యువు*
ఆయుష్యే కర్మణి క్షీణే లోకేయాందూయతేమయా నౌషథాని న మంత్రాశ్చన హెూమ నపునర్జపాః। త్రాయంతే మృత్యునోవేతం జరయాపిచ మానవమ్||     జ్యోతిస్తత్వము 

ఆయుష్యము, కర్మము క్షీణించి మహామృత్యువు చేతను, ముసలితనము చేతను ఆవరించబడిన మనుష్యుని ఔషధములుగాని, మంత్రములుగాని హెూమజపాదులు కాని రక్షించవు.

ఒక మనిషి యొక్క ఆయుష్షు మరియు కర్మఫలం బలం పూర్తిగా క్షీణించిపోయి, అతను మహామృత్యువు (పెద్ద మరణం లేదా కాలం తీరిన మరణం) మరియు ముసలితనం (వృద్ధాప్యం) చేత పూర్తిగా ఆవరించబడినప్పుడు (పట్టుబడినప్పుడు), అతడిని మందులు (ఔషధములు) గానీ, మంత్రాలు గానీ, హెూమాలు, జపాలు వంటి పూజా కార్యక్రమాలు గానీ రక్షించలేవు (కాపాడలేవు)

వేదాంగ జ్యోతిష శాస్త్రం లో 
మృత్యుకారక గ్రహములెవరు?????

రంధేశ్వరో రంధ్రయుక్తో రంధ్రదృష్టా ఖగేశ్వరః రంధ్రాధిపతియుతశ్చైవ చతుఃషష్ఠ్యాంశనాయకః॥ రంధేశ్వరాతి శత్రుశ్చ సప్త ఛిద్రగ్రహాః స్మృతాః తేషమధ్యే బలీయస్తు తస్యదాయే మృతింవదేత్|| జా.పా 5-52/53

 అష్టమాధిపతి, అష్టమంలో ఉన్న గ్రహం, అష్టమాన్ని చూసేగ్రహం, 22వ ద్రేక్కాణాధిపతి,అష్టమాధిపతితో కలసిన గ్రహం, 64వ నవాంశాధిపతి (చంద్రుని నుండి) అష్టమాధిపతికి అతిశత్రుగ్రహము వీరిలో బలవంతుడు మృత్యుకారకుడు అవుతాడు.
(ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇంకా చాలా ఉంటాయి పరిశీలన లో)
తరువాత మృత్యుంజయ దేవతలు?????
*మహాదేవ మహాదేవ మహాదేవ*
*రాళ్ళబండి శర్మ*

Wednesday, October 8, 2025

రాహుకాలంలో దుర్గ పూజ విశిష్టత ............!!

రాహుకాలంలో దుర్గ పూజ విశిష్టత  ............!!

రాహువుకు శరీరమంతా విషమైతే.. 
తోకలో మాత్రం అమృతం ఉంటుందట..!!
మహిళలు మంగళ, శుక్రవారాల్లో దుర్గాపూజ చేస్తుంటారు. 
దుర్గాదేవిని మంగళ, శుక్రవారాల్లో భక్తిశ్రద్ధలతో పూజించి.. 
కోరిన కోరికలు నెరవేరాలని సంకల్పించుకుంటారు. యువతులైతే వివాహ ప్రాప్తి కోసం.. 
వివాహితులైతే దీర్ఘసుమంగళీ ప్రాప్తం కోసం అమ్మవారిని పూజించడం విశ్వాసం. 

ముఖ్యంగా వారంలోని ఈ రెండు రోజుల్లో 
దుర్గాపూజ చేయడం ద్వారా మహిళలు కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం.

ఇందులో మంగళవారం రాహుకాల పూజకు 
ప్రత్యేక విశిష్టత ఉంది. 
రాహు దోషాలు నివృత్తి కావాలంటే మంగళవారం రోజున రాహు కాలంలో దుర్గాదేవిని స్మరిస్తూ పూజ చేయాలని పురోహితులు అంటున్నారు. 

దుర్గాదేవి శ్రీకృష్ణుడికి సోదరి కావడంతో 
విష్ణు అవతార తిథులైన అష్టమి, నవమి 
తిథుల్లోనూ అమ్మవారిని పూజించడం 
విశేష ఫలితాలను ఇస్తుంది. 
ఇంకా అమ్మవారిని..
అమావాస్య, 
పౌర్ణమి, 
మంగళ, 
శుక్ర, 
ఆదివారాల్లో 
పూజించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి.

రాహు దోషం తొలగిపోవాలంటే....!!

రాహు గ్రహానికి, దుర్గాదేవికి ఓ సంబంధం ఉంది. రాహు గ్రహానికి అధిదేవత దుర్గాదేవి. 
అందుచేత రాహు కాలంలోనే దుర్గాపూజ జరుగుతోంది. 

ఆదివారం రాహు కాల పూజ విశిష్టమైనది. రాహువుకు శరీరమంతా విషంతో నిండివుంటుంది. కానీ తోకలో మాత్రం అమృతం ఉంటుంది. అందుచేత ఆదివారం సూర్యుడు అస్తమించే సంధ్యాకాలానికి ముందు వచ్చే రాహుకాలంలో ఆయన తోక అమృతంగా మారివుంటుంది. 
అంటే ఆదివారం సాయంత్రం 4.30 గంటల నుంచి 
6 గంటలలోపు దుర్గాదేవిని పూజించినట్లైతే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం.

అనారోగ్య సమస్యలు, 
ఈతిబాధలు, 
రుణబాధలు 
తొలగిపోవాలంటే.. ఆదివారం సాయంత్రం రాహుకాలంలో దుర్గాదేవి కంటూ ప్రత్యేకంగా 
గల ఆలయంలో ఒక నిమ్మపండును సగంగా కోసి.. నిమ్మరసాన్ని పిండేసి.. 
నిమ్మపండును ప్రమిదల్లా తిప్పి.. 
అందులో నెయ్యి పోసి ఐదు వత్తులతో దీపమెలిగించాలి. 
ఈ దీపాలు అమ్మవారిని చూసేట్లు వెలిగించాలి. 
ఈ పూజ చేసేటప్పుడు అమ్మవారికి మల్లెపువ్వులు లేదా పసుపు చామంతులను మాత్రమే సమర్పించాలి.

అర్చన చేయాలనుకుంటే అమ్మవారి పేరు మీదే 
పూజ చేయాలి. 
దీపం వెలిగించాక అమ్మవారిని మూడుసార్లు ప్రదక్షణ చేసుకుని నమస్కరించుకోవాలి. 
దుర్గాస్తుతి చేయాలి. 
దుర్గాపూజ తర్వాత నవగ్రహ ప్రదక్షణలు కూడదు. 

ఇంటికొచ్చాక పూజగదిలో నెయ్యిదీపమెలిగించి.. ఐదు అగరవత్తులు, కర్పూరంతో పూజ చేయాలి. ఇలా తొమ్మిదివారాల పాటు దుర్గాదేవిని పూజిస్తే.. కుజదోషాలు పటాపంచలవుతాయని పండితులు చెప్తున్నారు

ఓం శ్రీ దుర్గాయై నమః

RECENT POST

చిత్రగుప్త దేవాలయం - కాంచీపురం.

చిత్రగుప్త దేవాలయం - కాంచీపురం. చిత్రాయ చిత్రగుప్తాయ యమాయనమః. భగినీ హస్త భోజనం. యమద్వితీయ. కార్తీక శుద్ధ విదియ. అన్నలందరూ  చెల్లెలు ఇంటికి వ...

POPULAR POSTS