*పంచబహ్మ మంత్రములు.*
హరహర మహాదేవ శంభో శంకర
హరహర మహాదేవ శంభో శంకర
ఓం నమఃశ్శివాయ
ఓం నమఃశ్శివాయ
ఓం నమఃశ్శివాయ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్లోకం: ఏకఏవ శివః సాక్షాత్
సత్యజ్ఞానాది లక్ష్మణః!
వికార రహితః శుద్ధః
స్వశక్త్యా పంచధా స్ధితః!!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నిన్నటిదినమున సద్యోజాతాది మంత్రాలు సాక్షాత్తూ పరమేశ్వరుని పంచముఖములనుండి ఉద్భవించినవే అని తెలుసుకున్నాము. నిన్నటి దినమున సద్యోజాత, వామదేవ
అవతారాల గురించి తెలుసుకున్నాము.
నిన్నటి దినమున సద్యోజాతాది
పంచబహ్మ మంత్రములు
తెలుసుకున్నాం.
మనకు 7 కోట్ల మహామంత్రములన్నియు సద్యోజాతాది పంచబహ్మ ముఖములనుండి ఉద్భవించినవే. ఏఏ ముఖము నుండి ఎన్ని మంత్రాలు ఉద్భవించాయో ఈ రోజు తెలుసుకుందాం.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సద్యోజాతాది పంచబహ్మ
మంత్రములు:
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం సద్యో జాతం ప్రపద్యామి
సద్యో జాతాయ వై నమో
నమః!!
భవే భవే నాతి భవే
భవస్వమాం భవోద్భవాయ
నమః!!
ఓం. వామదేవాయ నమో
జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ
నమో
రుద్రాయ నమః
కాలాయ నమః
కలవికరణాయ నమో
బలవికరణాయ నమో
బలాయ నమో
బలప్రమధనాయ
నమస్సర్వ
భూతదమనాయ నమో
మనోన్మనాయ నమః!!
ఓం. అఘోరేభ్యోఽథఘోరేభ్యో
ఘోర ఘోరతరేభ్యః!
సర్వేభ్యః సర్వశర్వేభ్యో
నమస్తే అస్తు రుద్రరూపేభ్యః
ఓం. తత్పురుషాయ విద్మహే
మహాదేవాయ ధీమహి!
తన్నో రుద్రః ప్రచోదయాత్!!
ఓం. ఈశాన స్సర్వ
విద్యానామీశ్వర
సర్వభూతానాం
బ్రహ్మాధిపతి
ర్బ్రహ్మణోధిపతిర్
బ్రహ్మ శివోమే అస్తు
సదాశివోం!!
1) "సద్యోజాత ముఖము నుండి
గాయత్రీ మొదలగు రెండు కోట్ల
మంత్రములు ఉద్భవించినవి.
వీనిని వైదిక మంత్రములందురు
2) వామదేవ ముఖము నుండి
శైవాగమనమునకు చెందిన మంత్రములు ఒక కోటి జనించినవి.ఇవి దక్షిణామూర్తి
ఇత్యాది మంత్రములు.
3) అఘోర ముఖమునుండి వైష్ణవ ఆగమోక్తములైన ఒక కోటి
మంత్రములు వెలువడినవి.
4) తత్పురుష ముఖము నుండి
శాక్తేయములగు రెండు కోట్ల మంత్రములు ఉద్భవించినవి.
మహా విద్యాది మంత్రములు
ఇవియే.
5) ఈశాన ముఖము నుండి
ఆత్మానందప్రదములైన ఒక
కోటి మంత్రములు ఉద్భవించినవి.
ఈ విధంగా మొత్తము సప్త కోటి
మహా మంత్రములు పరమేశ్వరుని పంచముఖములనుండి ఉద్భవించినవిగా తెలుసుకొన
వలెను.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
హరహర మహాదేవ శంభో శంకర
హరహర మహాదేవ శంభో శంకర
హరహర మహాదేవ శంభో శంకర
No comments:
Post a Comment