మనస్సు ఎప్పుడూ వేర్వేరే ప్రాంతాలను చూడాలని కోరుకొంటుంది. కొన్నిసార్లు పచ్చటి మైదానాలను, గలగలపారేజలపాతాలను చూడాలనుకొంటే మరికొన్నిసార్లు అద్భుత శిల్పసంపదను మనసారా వీక్షించాలని కోరుకొంటుంది. అలాంటి సమయంలో భారతీయ శిల్పకళ సంపదకు నిలయమైన దేవాలయాలను సందర్శించడం ఒక్కటే మార్గం.
#చంద్రమౌళేశ్వర దేవాలయం, #హుబ్లీ..
జంటనగరాలైన హుబ్లీ-ధార్వాడ నగరాల మధ్య #ఉణకల్ అనే ఊరు ఉంది. ఈ ఊరు నుంచి ఒక కిలోమీటరు దూరంలో అత్యంత సుందరమైన #చంద్రమౌలేశ్వర దేవాలయం ఉంది.
చాలుక్యులు నిర్మించిన ఈ దేవాలయం దాదాపు 900 ఏళ్లకు పూర్వం నిర్మించినదని చెబుతారు.బాదామి, ఐహోలు దేవాలయాల వలే అత్యంత అరుదుగా లభించే రాతితో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయానికి గోపురం అనేదే ఉండదు. ఇలా ప్రాచీన కాలానికి చెంది గోపురం లేని దేవాలయం ఇది చంద్రమౌలేశ్వర దేవాలయం మాత్రమేనని పురావస్తుశాఖ అధికారులు కూడా చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ దేవాలయం పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. మిగిలిన దేవాలయాలతో పోలిస్తే ఈ దేవాలయం విభిన్నమైనది. నాలుగు దిక్కుల్లో నాలుగు ద్వారాలతో సహా మొత్తం 12 ద్వారాలు ఉన్న దేవాలయం ఈ చంద్రమైలేశ్వర దేవాలయం.
అంతేకాకుండా ఒక్క గర్భగుడిలోనే రెండు శివలింగాలు ఉండటం ఈ దేవాలయం ప్రత్యేకత. ఒక శివలింగానికి నాలుగు ముఖాలు ఉంటాయి. అందువల్లే ఈ దేవాలయాన్ని చతుర్ముకేశ్వర దేవాలయం అని అంటారు. ప్రతి శివలింగానికి ఎదురుగా రెండు నందులు ఉంటాయి.
అదే విధంగా దేవాలయంలో నాలుగు దిక్కులకు ఉన్న నాలుగు ద్వారాల పైన అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. 900 ఏళ్లనాటి ఈ దేవాలయంలో ఇప్పటికీ పూజలు జరుగుతుండటం విశేషం.
ప్రతి రోజూ ఉదయం 8 నుంచి 11 వరకూ అదే విధంగా సాయంత్రం 5 నుంచి 7.30 గంటల వరకూ ఈ దేవాలయాన్ని సందర్శించుకోవచ్చు..
హుబ్లీ నుండి సాయినగర్ కు వెళ్ళే బస్సు సర్వీసులు చాల ఉన్నాయి. దారిలోనే ఆలయం కలదు..
No comments:
Post a Comment