*1). విహంగ న్యాయం:-*
*పక్షి గుడ్లను పెట్టి పొదిగి తన రెక్కల స్పర్శ చేత గుడ్లను పిల్లలుగా చేస్తుంది.*
*అలాగే సద్గురువు తన 'స్పర్శ' చేత శిష్యునికి ఆత్మజ్ఞానాన్ని అందిస్తాడు.( స్పర్శ ప్రేమ మయంగా ఉండవచ్చు లేదా కొట్టవచ్చు కూడా)*
*2). భ్రమర కీటక న్యాయం:-*
*భ్రమరం ఒక కీటకాన్ని తెచ్చి దాని చుట్టూ తిరుగుతూ 'ఝుంకార' శబ్దం చేస్తుంది. అప్పుడు ఆ కీటకము ఝుంకారము వల్ల భ్రమరంగా మారిపోతుంది.*
*అలాగే సద్గురువు శిష్యునకు 'వాక్కు' ద్వారా బోధ చేస్తూ తన వలే తయారు చేస్తాడు.*
*( వాక్కు మధురంగా ఉండవచ్చు లేదా తిట్టవచ్చు )*
*3). మీన న్యాయం :-*
*చేప గుడ్లను పెట్టి వెనకకు తిరిగి వాటిని తీక్షణంగా చూస్తుంది. తల్లి చేప దృష్టి సోకగానే గుడ్లు పిల్లలుగా మారుతాయి.*
*ఇదేవిధంగా సద్గురువు కరుణామృత 'దృష్టి' ప్రసరించడంవల్ల శిష్యుడు జ్ఞాన పరిపుష్టి పొందుతాడు.*
*4). తాబేటి తలపు న్యాయము :-*
*తాబేలు ఒకచోట గుడ్లు పెట్టి ఆహారానికి వెళుతుంది. ఆ గుడ్లు పిల్లలు కావాలని 'సంకల్పిస్తుంది'. ఆ సంకల్పబలంతో ఆ గుడ్లు పిల్లలుగా తయారవుతాయి.*
*అలాగే శిష్యుడు ఎక్కడ ఉన్నా అతను ‘పర బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి, పరమార్థ జ్ఞానాన్ని చేరాలి!’ అని సద్గురువు 'సంకల్పిస్తారు'.*
*ఆ దివ్య సంకల్పంతో శిష్యుడు అభివృద్ధి పొంది పరమార్ధం పొందుతారు.*.
No comments:
Post a Comment