Wednesday, June 7, 2023

పడిపూజా విధానం - 13వ మెట్టు అధిష్టాన దేవత స్వప్న వారాహి

పడిపూజా విధానం - 

13వ మెట్టు అధిష్టాన దేవత స్వప్న వారాహి


 స్వప్న వారాహిని కొలిచే సాధకులకు అమ్మ స్వప్నంలో భూత,భవిషత్, వర్థమానాలను తెలియచేస్తూ, సాధకులకు కానీ వారి కుటుంబసభ్యులకు కానీ ఏదైనా ప్రమాదం కానీ, మంచి చెడులను ముందుగానే సాధకుల స్వప్నంలో కనిపించి,సమాధానం చెబుతుంది.

లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితాసహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరఫున పోరాడేందుకే  భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయనీ, శత్రుభయం ఉండదనీ, జ్ఞానం సిద్ధిస్తుందనీ, కుండలినీ శక్తి జాగృతమవుతుందనీ... తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం.

 త్రయోదశ సోపాన అధిష్టాన దేవతా పూజ

స్పర్శ సుఖలాంస గుణ నివారణార్థం మేఘదేవతా ముద్దిశ్య త్రయోదశ సోపాన అధిష్టాన దేవతా ప్రీత్యర్థం పవనాయ నమః |
చర్మాయుధ సహిత వాయుదేవ షోడశోపచార పూజాం కరిష్యే॥

వాయుర్గం ధవతీ నాధః కించత స్యాంజన ప్రియ |
సారంగ వాహధ్వజ బృద్వాయువ్యాం దిశీవర్తితే ||

త్రయోదశ సోపాన అధిష్టాన దేవతాయై నమః ధ్యాయామి | 
ఆవాహయామి |
రత్న ఖచిత సింహాసనం సమర్పయామి | 
పాదయోః పాద్యం సమర్పయామి |
హస్తయోః అర్ఘ్యం సమర్పయామి | 
ముఖే ఆచమనీయం సమర్పయామి |
స్నాపయామి | 
పంచామృత స్నానం సమర్పయామి | 
శుధోదక స్నానం సమర్ప
యామి |
వస్త్ర యుగ్మం సమర్పయామి | 
యజ్ఞోపవీతం సమర్పయామి | 
దివ్య పరిమళ గంధాం ధారయామి | 
గంధస్యోపరి హరిద్రా చూర్ణకుంకుమం
సమర్పయామి |
పుష్పాణి సమర్పయామి ఓం శ్రీ వాయు దేవాయ నమః  పుషైః పూజయామి ||

ఓం శ్రీ వాయువాస్త్రాయ నమః |
ఓం చర్మా యుధాయ నమః |
ఓం అనిరుద్దాయ నమః |
ఓం జనార్ధనాయ నమః |
ఓం మధుసూధనాయ నమః |
ఓం రాహువే నమః |
ఓం కేతువే నమః |
ఓం గణపతే నమః |
ఓం దుర్గాయై నమః |
ఓం అనిలాయ నమః |
ఓం పవనాయ నమః |
ఓం కవచినే నమః |
ఓం మారుతాయ నమః |
ఓం మలయాయ నమః |
ఓం పావనాయ నమః |
ఓం శరణ్యాయ నమః |
ఓం వాయుస్వామినే నమః | ( లేక) ఓం మేఘస్వామినే నమః |

స్పర్శ సుఖలాలస నివారణార్థం సమశీతోష్ణ సిద్ధ్యర్థం త్రయోదశ సోపాన అధిష్టాన దేవతాయైనమః  సర్వ తత్వాత్మనే ధూప , దీప , నైవేద్య , తాంబూలాది
సర్వోపచార పూజాం సమర్పయామి॥

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS