Monday, June 12, 2023

కామాఖ్య గుడి

కామాఖ్య గుడి


కమాఖ్య గుడి మెట్లు ఎక్కే టప్పుడు కుడి వైపు కాళీ పీఠం ఉంటుంది అక్కడ గర్భగుడి లో అమ్మవారు ఇలా ఉంటారు ఒకటిన్నర అడుగు ఎత్తు రాయి లాగా కనిపిస్తూ ఎప్పుడూ పువ్వులు వస్త్రాలతో కప్పి ఉంటుంది ఇక్కడ గుడి బయట  ఉండే చిన్న వరండాలో హోమం చేస్తుంటారు భక్తులు ఇక్కడ స్వయంగా పూజ చేసుకుని వెళ్ళచు అందువల్ల మద్యం మాంసం కూడా అక్కడ తెచ్చి పెట్టి పూజ చేసుకుని వెళ్తుంటారు..

ఇక్కడ ఫొటోలో చూస్తున్న విధంగా ఇది కాళీ యోని పీఠం అని ఇక్కడ పిలుస్తారట.. ఇక్కడికి రావడానికి ముందు మెట్లు ఎక్కడానికి ముందే కాళీ గుడి బైరావుడు ఉన్న మందిరం ఉంటుంది అక్కడ ఇలానే మూల స్తానం ఉంటుంది వెనుక పీఠం పైన కాళీ విగ్రహం ఉంటుంది..

తర్వాత మెట్లు ఎక్కే మొదట్లో చిన్నమస్త గుడి ఉంటుంది.. కొంచెం లోపలికి ఉంటుంది నిలువుగా ఒక 10 మెట్లు దిగితే చిన్నమస్త మూల స్థలం ఉంటుంది ఒక వస్త్రం కప్పిన రాతి పలకలాగా పువ్వులు తో కప్పబడి ఉంటుంది.. విగ్రహం ఏమి ఉండదు.. దారిలో కొండపైన భువనేశ్వరి గుడికి కూడా వెళ్ళాము అక్కడ కూడా అమ్మవారు చూడటానికి ఇలానే ఉంటారు.. ఇలాంటి ఒక కప్పబడి ఉన్న  మూర్తిని ముట్టికొనిస్తారు పూజారి ఉంటారు అక్కడ కూర్చోబెట్టి అర్చన చేస్తారు..

ఇంక కమాఖ్య గర్భ గుడిలోకి వెళ్లే ముందు ఒక సింహసం పైన అమ్మవారి 12 ఇంచెస్ విగ్రహం ఉంటుంది ముఖ దర్శనం అంటారు కమాఖ్య యొక్క కుంజికా రూపం లో అమ్మవారు చిన్న ఇత్తడి విగ్రహం ముఖం మటుకు కనిపిస్తుంది..

అక్కడ నుండి గర్భ గుడిలోకి వెళ్తే అక్కడ కూడా ఇప్పుడు పెట్టిన ఫోటో లో చూస్తున్న విధంగా ఒక చతురాకారం అందులో ఒకటిన్నర ఎత్తు రాతి   (మూర్తి) వస్త్రాలతో పువ్వులతో కప్పబడి ఉంటుంది, ఈ మూర్తికి ముందు చిన్న నీటి కాలువ ప్రవహిస్తూ ఉంటుంది ఆ నదీ జలాన్ని మనపైన చల్లుతారు అమ్మవారి మూర్తిని ముట్టుకుని నమస్కారం చేసుకోవచ్చు, పక్కనే ఇంకో రెండు చిన్న మూర్తులు ఉంటాయి అవి లక్ష్మీ సరస్వతి గా ఇక్కడ కొలిస్తారు అవి ముట్టుకుని మొక్కుకోవచ్చు,  గర్భ గుడిలో చిమ్మ చీకటి ఉంటుంది ఒక రెండు దీపాలు వెలుగులో నే స్పష్టంగా దర్శనం చేసుకోవచ్చు..

ఇక్కడ ఎక్కడ అమ్మవారి విగ్రహాలు ప్రతిష్ట చేసి ఉండవు. అన్ని మూల స్థానాలు ఇలానే ఒక రాయి కప్పబతి ఉన్నట్టు చతురాకారం లో ఉన్న పీఠంలో ఉంటాయి.. గర్భ గుడిలో యోని ఆకారం ఏమి ఉండదు అమ్మవారి శరీర భాగం పడిన భాగం ఒక చిన్న భాగం అది కూడా ఒక రాయిలగా ఉంటుంది అంతే.. అక్కడ అర్చకులు మటుకే పూజ చేస్తారు మద్యం మాంసం లాంటివి గర్భ గుడిలో కనిపించవు , బలులు అన్ని బయట ఇస్తుంటారు కానీ గర్భ గుడిలోకి ఎవరికి ఏది అనుమతి లేదు ఆకారం కనిపించని ఒక పవర్ స్టేషన్ లాగా ఉంటుంది చాలా కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. మీరు ఫోటోల్లో చూస్తున్నట్టు యోని ఆకారాలు అక్కడ ఎక్కడా గుడిలో ఉండవు . ఒకరు మన గ్రూవ్ లో అడిగిన సందేహం వల్ల వివరిస్తున్నాను..తల్లి యోని స్తానం పడిన ప్రాంతం కాబట్టి యోని పీఠం అంటారు కానీ అటువంటి ఆకారాలు అక్కడ ఉండవు..ఇటువంటి అపోహలు వదిలేయండి తెలియక చాలా మంది అలా అనుకుంటున్నారు అని అర్థం ఐయ్యింది..

అంబువాచి సమయంలో కూడా ఆ కనిపిస్తున్నవిధంగా ఉన్న మూల మూర్తి పైనే ఒక ఎర్రటి వస్త్రాలు కప్పుతారు మూడు రోజులు తర్వాత అది వేలంలో అమ్ముతారు ముందుగా అది కావాలి అనుకునే వారు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.. ఆ మూడు రోజులు అధికమైన శక్తిని ఆకర్షించే కేంద్రం ,రజస్వల  సమయం  కనుక ఆ శక్తి ఆ వస్త్రాన్ని అధికంగా ఉంటుంది.. ఆ వస్త్రాన్ని కొని బీరువాలో పెట్టుకుంటారు.. కొందరు చిన్న ముక్కలుగా చేసి చేతికి కట్టుకుంటూ ఉంటారు.. 

అంబువాచి సమయంలో గుడి మూడు రోజులు తెరవరు 3 రోజులు తర్వాతే దర్శనం, గుడి దగ్గర వరకు వాహనాలు అనుమతి ఉండదు చాలా దూరంలో వాహనాలు అపేసి ఇక్కడ ఈ మెల కోసం ఏర్పాటైన వాహనాలు లోనే అంబువాచి మెల జరిగే ప్రాంతానికి వెళ్ళాలి. అప్పుడు అక్కడ ప్రదక్షిణ చేయడానికి వస్తారు..జనం చాలా అధికంగా ఉంటారు..

మీరు ఆన్లైన్ చూసే కమాఖ్య పీఠం అన్ని గోహతి గుడివి కాదు

🌷శ్రీ మాత్రే నమః🌷

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS