Thursday, June 15, 2023

తీర్థానికి, క్షేత్రానికి తేడా ఏమిటో తెలుసా?

తీర్థానికి, క్షేత్రానికి తేడా ఏమిటో తెలుసా?


మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనం అప్పుడప్పుడు తీర్థ యాత్రలు, పుణ్య క్షేత్రాలు అంటూ దైవ క్షేత్రాలకు వెళ్తుంటాం.

ఎవరడిగినా మన నోటికి వచ్చిన పదం చెప్తుంటాం. కానీ అలా చెప్పడం సరైన పద్ధతి కాదు.ఎందుకంటే పుణ్య క్షేత్రాలకు, తీర్థ క్షేత్రాలకు చాలా తేడా ఉంది.

అయితే అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.వాస్తవానికి తీర్థం, క్షేత్రం రెండూ వేరు వేరు.

నదీ నదాలు, సముద్ర తీరాన వెలసిన ఆలయాలను తీర్థాలు అంటారు.పవిత్ర గంగ, గోదావరి, కృష్ణ, తుంగ భద్ర వంటి నదుల తీరంలో ఉన్న వారణాసి, గోకర్ణ, రామేశ్వరం వంటివి తీర్థాలు.

అలాగే నదీ జలాలు లేని ప్రాంతాల్లో కొలువైన ఆలయాలను క్షేత్రాలు అంటారు.ఇవి స్థల క్షేత్రాలు, గిరి క్షేత్రాలు అని రెండు రకాలు ఉంటాయి.

నేలపై ఉన్న ఆలయాలను స్థల క్షేత్రాలు అంటారు.అలాగే కొండల పై వెలసిన గుడులను గిరి క్షేత్రాలు అంటారు.

తిరుమల, మగళ గిరి, సింహాచలం, శ్రీశైలం, యాదగిరి గుట్ట వంటివి గిరి క్షేత్రాలు.

అహోబిలం నరసింహ స్వామి ఆలయం ఆలంపూరు జోగులాంగ దేవాలయం, బాసర సరస్వతీ ఆలయం, వేములవాడు రాజ రాజేశ్వర స్వామి ఆలయం వంటి మొదలగునవి స్థల క్షేత్రాలు.

పక్కన నది ఉన్నప్పటికీ కొండపై వెలసిన ఆలయాలను కూడా క్షేత్రాలు గానే పరిగణిస్తుంటారు.అందుకే పక్కనే నది ఉండి.

కొండపై వెలసిన విజయవాడ కనక దుర్గ అమ్మవారి ఆలయాన్ని కూడా క్షేత్రంగానే పిలుస్తారు.🍁

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS