Friday, June 9, 2023

ముద్రలు - దోష నివారణ


ముద్రలు - దోష నివారణ

గ్రహాదిపతులను పూజ సమయమున ఆయా గ్రహదీపతుల కు ఇష్టమైన ముద్రలను ప్రదర్శించాలి. 

జప పూజాదుల సమయము నందు ఆయా ముద్రలను ప్రదర్శించి ఆయా గ్రహధిపతుల కరుణాకటాక్షములను, ప్రసన్నం చేసుకోవడానికి ముద్రలను ప్రదర్శిస్తూ వుంటారు. 

మన చేతుల్లో శక్తి ప్రవహిస్తూ ఉంటుందని, మన చేతికున్న ఐదు వేళ్ళూ ఐదు తత్వాలకు సంకేతమని అంటారు. 

బొటని వేలు అగ్నికి, 

చూ పుడు వేలు వాయువుకు, 

మధ్యవేలు ఆకాశం, 

ఉంగరం వేలు పృధ్వి, చిటికెనవేలు జలానికి సంకేతాలు గా చెప్తారు. 

ఈ ఐదు తత్వాల అసమతుల్యత వల్లనే వ్యాధులు వస్తాయని, వీటిని ఆత్మశక్తి, ముద్రల సాయంతో సరిచేయవచ్చని అంటారు లేకపోతే మందులు.

ఈ ముద్రలను రోజూ అరగంట సాధన చేస్తే చాలు.

బ్రహ్మదేవుడు చెప్పిన 108 ముద్రలలో 55 ముద్రలు మాత్రమే పూజలలో వినియోగించబడతాయి.

జపం,ప్రాణాయామం,ధ్యానమ, ఆసనాలు అన్నీ ముద్రలు లేకుండా చేస్తే చేసిన పూజ నిష్పలమంటారు.

*శిఖరిణీ ముద్ర*

ఈ ముద్ర సూర్యు గ్రహానికి ప్రీతికరమైన ముద్ర.

కుడిచేతిని పిడికిలిగా బిగించి బొటన వ్రేలిని మాత్రం నిటారుగా ఉంచితే శిఖరిణీ ముద్ర అంటారు.

*అర్ధధేను ముద్ర*

ఈ ముద్ర చంద్రునికి ప్రీతికరమైన ముద్ర.

ఎడమ,కుడి చేతుల అనామిక కనిష్ట వ్రేళ్ళు నిటారుగా కలిపి ,తర్జనీ మధ్యమాంగుళులను ధేనుముద్రగా వస్తే అర్ధధేను ముద్ర అవుతుంది.

*సమ్మీలిని ముద్ర*

ఈ ముద్ర కుజునికి ప్రీతికరమైన ముద్ర. 

రెండుచేతుల వ్రేళ్ళ కొసలను విడివిడిగా ఉంచి,అరచేతులను,అరచేయి మూలాన్ని ఒకటిగా కలిపితే సమ్మీలినీ ముద్రా అవుతుంది.

*కుండ ముద్ర*

ఈ ముద్ర బుధునికి, శివునికి, సరస్వతికి ప్రీతికరమైన ముద్ర.

కుడిచేతియొక్క అన్నీ వ్రేళ్ళను ఒకటిగా కలిపి కొంచెం లోపలి వైపుకు వంచి,రెండు అరచేతులను కుండ ఆకారంలో కలిపితే కుండ ముద్ర అవుతుంది.

*చక్రముద్ర*

ఈ ముద్ర గురునికి, విష్ణువుకి, శివునికి ప్రీతికరమైన ముద్ర.

ఎడమచేతి యొక్క నాలుగు వ్రేళ్ళు బ్రొటన వ్రేలు కాకుండా కుడిచేతి యొక్క నాలుగు వ్రేళ్ళ మధ్యగా పోనిచ్చి , రెండుచేతుల బొటన వ్రేళ్ళ చివరాలు ఒకటిగా కలిపి , రెండు బొటన వ్రేళ్ళను సాధకుని వైపు వ్యాపించినచో అది చక్రముద్ర అవుతుంది.

*శూల ముద్ర*

ఈ ముద్ర శుక్రునికి,శివునికి ప్రీతికరమైన ముద్ర.

కుడిచేతి యొక్క బొటనవ్రేలుతో మద్యవ్రేలును కొంచెం లోపలివైపుకు వంచి మిగతా మూడు వ్రేళ్ళ చివరలు ఒకటిగా కలిపితే శూలముద్ర అవుతుంది.

*సింహముఖి ముద్ర*

ఈ ముద్ర దుర్గాదేవికి, విష్ణువుకు, శనీశ్వరునికి ఇది ప్రీతికరమైన ముద్ర.

రెండు అరచేతులు ఒకటిగా కలిపి ఎడమచేతి 5 వ్రేళ్ళ కొసలు కుడి అరచేతిలో ఉంచి ,ఎడమచేతిని కొంచెం క్రిందికి జార్చినచో సింహముఖి ముద్ర అవుతుంది.

*భగముద్రా*

ఈ ముద్ర శివునికి, విష్ణువుకు, రాహువునికి ప్రీతికరమైన ముద్ర.

రెండు చేతివ్రేళ్ళను గోముఖాకారంలో చేసి చెవుల దగ్గర ఉంచితే భగ ముద్ర అవుతుంది.

*త్రిముఖ ముద్ర*

ఇది కేతువుకు, విశ్వేదేవతలకు, మాతృగాణాలకు ప్రీతికరమైన ముద్ర.

కుడిచేతి బొటనవ్రేలు,చూపుడువ్రేలు మధ్యవ్రేళ్ళ యొక్క చివరలు ఒకటిగా కలిపి,అనామిక కనిశ్తికాంగుళులను లోపలకుముడిస్తే త్రిముఖ ముద్ర అవుతుంది.

నవగ్రహ ముద్రలను దైనందిన పూజా కార్యక్రమాల్లో వినియోగించుకొనిన యెడల , నవగ్రహల అనుగ్రహం కలుగుతుంది.
🙏🌹

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS