ఆది శంకరాచార్యుల నుంచి నేటి అందరు స్వాముల వరకూ చేతిలో కర్ర ఉండటాన్ని అందరూ గమనించే ఉంటారు.
స్వామీజీ అంటే కర్ర పట్టుకోవాలనుకుంటే పొరపాటే..
దాని వెనుక ఎంత ఆంతర్యం ఉందో తెలుసా...
ఆదిశంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజచార్యులు, జీయర్ స్వాములు మరికొందరు..వీళ్లందరి చేతిలో పొడవాటి కర్ర ఉంటుంది గమనించారా.
ఏ సమయంలో చూసినా వాళ్ల చేతిలో ఉంటాయి.
అదేమైనా ఊతకోసమా అంటే కానేకాదు.
మరి ఎప్పుడూ చేత్తో పట్టుకుని ఉంటారెందుకు అంటారా..
అవి వైరాగ్యానికి, తాత్వికతకు, ద్వైత, అద్వైత భావానికి గుర్తు.
ఈ (దండాలు) కర్రలు వివిధ ఆకారాల్లో ఉంటాయి.
అయితే ప్రతి ఆకారానికి ఓ అర్థం ఉంది.
గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం పంచభూతాల సమ్మేళనమే మనిషి,
కాబట్టి సన్యాసులు ఐదడుగుల కర్రను చేతపట్టుకుని తిరుగుతారని చెబుతారు.
ఈ కర్రల్లో మూడు రకాలున్నాయి అవే ఏకదండి, ద్విదండి, త్రిదండి.
*ఏకదండి:-*
*ఒక కర్రను (ఏకదండి ) ధరించేవారు అద్వైత సిద్ధాంతాన్ని విశ్వసిస్తారు*.
*అందుకు ఉదాహరణ ఆదిశంకరాచార్యులు.*
అద్వైతం అంటే జీవుడు, దేవుడు ఒక్కటేననే సిద్ధాంతం.
అంతరాత్మకు విరుద్ధంగా అక్రమ, అన్యాయ మార్గాన సంచరించినా, ప్రవర్తించినా ఆ పాపఫలితాన్ని బతికి ఉండగానే ఏదో ఒక రూపంలో ఇక్కడే తప్పకుండా అనుభవించక తప్పదనే సిద్ధాంతాన్ని వారు బోధిస్తారు.
వీరి చేతిలో జ్ఞానానికి సంకేతమైన రావిచెట్టు నుంచి సేకరించిన కర్ర ఉంటుంది.
*ద్విదండి:-*
రెండు కర్రలు కలిపి ఒక్కటిగా కట్టి (ద్విదండి)ధరించి బోధనలు చేసేవారు ద్వైత సిద్ధాంతాన్ని అవలంబించేవారు.
ఇందుకు ఉదాహరణ మధ్వాచార్యులు.
వీరిని ‘ద్విదండి స్వాములు’అంటారు. దేవుడు వేరు– జీవుడు వేరు అని బోధిస్తారు.
జీవాత్మ, పరమాత్మ వేరువేరన్నది వీరి ఉద్దేశం.
జీయర్ లు అందరూ ఈ సిద్ధాంతం కిందకు వస్తారు.
*త్రిదండి:-*
*మూడు కర్రలను ఒకే కట్టగా కట్టి (త్రిదండి) భుజాన పెట్టుకునేవారిని తత్వత్రయం అంటారు.*
*ఇలా ధరించే వారు విశిష్ఠాద్వైతాన్ని బోధిస్తారు*.
వీరిది రామానుజాచార్యుల పరంపర.
శరీరంలో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉంటాడని విశ్వసిస్తారు.
జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి సత్యాలని, ఈ మూడింటిని నారాయణ తత్వంగా నమ్ముతూ,
జీవుడు ఆజ్ఞానంతో సంసార బంధాన చిక్కుకుంటాడని,
నారాయణుని శరణు వేడిన వారు భగవదనుగ్రహం వలన అజ్ఞానం నుంచి విముక్తులై,
మరణానంతరం నారాయణ సాన్నిధ్యం, మోక్షం పొందుతారని,
వారికి మరుజన్మ ఉండదని విశిష్ఠాద్వైతపు సిద్ధాంతాన్ని బోధిస్తారు.
*ఇది ఏకదండి, ద్విదండి, త్రిదండి అనే వాటి గురించిన వివరణ, స్వస్తి*
No comments:
Post a Comment