రుణాల బాధ తొలగిపో వడానికి ఒక చిన్న సాధన.
స్వగృహంలో వివిధ రకాల వత్తులతో దీపారాధన చేస్తుంటారు. అయితే ఈ దీపారాధనకు ఉపయోగించే వత్తులు సాధారణంగా పత్తితో తయారు చేసినవై ఉంటాయి. వివిధ రకాల వత్తులతో ఈ దీపారాధన చేయవచ్చు. ఏ రకమైన వత్తులతో దీపారాధన చేస్తే ఏ ఏ ఫలితాలు కలుగుతాయన్న అంశాన్ని ఇక్కడ పరిశీలిద్ధాం.
అరటి నారతో దీపారాధన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలుగ గలదు, అరటి నారతో తయారు చేసిన వత్తులతో దీపారాధన చేస్తే ఆ ఇంట్లో మంచి సంతానం కలుగుతుంది .జిల్లేడు నార వత్తులతో దీపారాధన చేయడం వల్ల శ్రీ గణపతి అనుగ్రహం కలుగుతుంది . పసుపురంగు వస్త్రంతో దీపారాధన చేయడం అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.పత్తితో చేసిన దేవునికి దీపారాధన చేస్తే ఇంట్లో గల పితృదేవతలకు దోషాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెపుతున్నాయి. అలాగే, తామర తూడులతో వత్తులు చేసి స్వామివారికి దీపారాధన చేయడం వల్ల శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో పాటు.. రుణాల బాధ తొలగిపోతుంది. శతృబాధలు తొలగటానికి మీ ఇంటి సింహద్వారం పైన ఇనుపమేకులు లేకుండా చూసుకోవాలి. దారిద్ర్య, శతృబాధలు, వివాదాలు తగ్గగలవు.
🌹 మీరు ఎవరికైనా పుస్తకం దానం చేయాల్సి వస్తే గురువారం లేదా శుక్రవారం లేక ఆదివారం రోజున దానం చేస్తే సంపూర్ణ దాన ఫలం లభిస్తుంది అంటారు పెద్దలు.
🌹 నిరుద్యోగంతో బాధపడుతున్న వ్యక్తులు సోమవారం రోజున ఉద్యోగ ప్రయత్నాలు గట్టిగా చేయడం ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతుంది అంటారు.
🌹 కార్య విఘ్నాలు లేకుండా ఉండాలి అంటే నుదుటన సింధూరం ధరించడం వల్ల కార్యవిఘ్నాలు , అపనిందలు , అవమానాలు నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది.
🌹 ప్రతి నిత్యం నవగ్రహాల వద్ద ఆవుపేడతో చేసిన ప్రమిదలో దీపారాధన చేయడం వలన జాతక రీత్యా కలిగే గ్రహదోషాలు చాలా వరకూ నివారణ అవుతాయి
🌹 తండ్రి కొడుకుల మధ్య తరచూ గొడవలు కలుగుతుంటే పదకొండు ఆదివారాలు , 21 కందిపప్పు వక్కలను పారుతున్న నీటిలో విడిచి పెట్టడం మంచిది. ఇద్దరిలో ఎవరైనా ఇలా చేయవచ్చు తొందరగా ఈ గొడవల నుంచి బయటకు రాగలరు.
🌹 తులసి కోట వద్ద 3 వత్తులు వేసి దీపారాధన చేయండి. ప్రతీ గురువారం రోజు అరటి ఆకులో భోజనం చేసి చివరగా అరటి పండు తినండి త్వరలో మంచి సంబంధం వస్తుంది. పెళ్ళి ఆలస్యం అవుతున్న వారికి.
🌹 ఆదివారం రోజున సూర్యుడికి 21 తెల్ల జిల్లేడు పూలతో ఆరాధన చేస్తే ఆయురారోగ్యాలతో పాటు జ్ఞానం కూడా కలుగుతుంది అని పెద్దలు చెబుతారు.
🌹 ఇంటి ముందు మురికి కాలువ నీరు పారకుండా నిలబడిపోయి ఉంటే ఆ ఇంట్లో ఏదో వెలితి, అశాంతి కలుగుతుంది. కనుక ఈ విషయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు తప్పనిసరి .
🌹 పశువులకు గాడిద వెంట్రుకలతో చేసిన తాడును మెడలో కడితే వాటికి త్వరగా జబ్బులు రావు .
🌹 కీర్తి శేషులు అయిన వారి పేరుతో అమావాస్య రోజున దానం చేయడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది.
🌹 మీ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వారికి ఏదైనా పండును తినడానికి పెట్టండి. ఇలా చేయడం వలన విఘ్ననాశనం, ఆయురారోగ్యాలతో, కీర్తి కలుగుతాయి.
🌹కుటుంబ సమస్యలు, ఋణబాధలు, అనారోగ్యం ఈ మూడింటిలో నుంచి బయటకు రావడం కోసం ఆదివారం రోజున బ్రాహ్మణుడికి వస్త్ర దానం చేసి మంగళవారం రోజు అదే బ్రాహ్మణుడికి తేనెను దానం చేయడం వలన శుభం కలుగుతుంది.
🌹తులసి కోట వద్ద ఉదయం సాయంత్రం 6 వత్తులు వేసి దీపారాధన చేయడం వలన కుటుంబ సౌఖ్యం , ఆర్థిక వృద్ధి కలుగుతుంది. 1.ఎన్ని ప్రయత్నాలు చేసినా పని కానపుడు ఆవుపాలతో కాళభైరవుడికి అభిషేకం చేయించండి.కాలం సహకరిస్తుంది.
2.ఇరుగు పొరుగు వాళ్ళతో గొడవ అవుతుంటే పాయసాన్నం చేసి అమ్మవారికి నివేదన చేసి ప్రసాదంగా పంచి పెట్టండి.
3.పిల్లలు ఏదో ఒక జబ్బుతో బాధపడుతుంటే రాగిబిళ్ళ తీసుకొని వారిపైనుండి తిప్పి పుట్టకు పూజ చేసి పుట్టలో వేయండి.
4.ఇంట్లో పిల్లలు ఎక్కువగా అల్లరితో ఇబ్బంది పెడితే ఐదు మంగళవారాలు సుబ్రమణ్య స్వామికి వారి పేరుమీద అర్చన చేయించండి.
5.ఇచ్చిన డబ్బులు ఎంతకూ రానపుడు తెల్లవారు జాము డాబా పైకి వెళ్ళి ఆకాశంవైపు చూస్తూ వారి పేర్లతో పిలవండి.11 రోజులు.
No comments:
Post a Comment