Friday, February 18, 2022

పుట్టిన తేది ప్రకారం వీటిని ఇంట్లో ఉంచండి

 పుట్టిన తేది ప్రకారం వీటిని ఇంట్లో ఉంచండి



జ‌న్మించిన‌ తేది ద్వారా జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవ‌చ్చు. పుట్టిన తేదిని బట్టి కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచితే శుభం జరుగుతుంది. వ్యక్తులు వారి జన్మ తేదిలను బట్టి ఏం చేయాలో తెలుసుకుందాం. 

ఏదైనా నెలలో ఒకటో తేదిన జన్మించిన వ్యక్తులు వెదురుతో తయారు చేసిన ఫ్లూట్ ను ఇంట్లోని ఉత్తర దిక్కులో ఉంచాలి.

పుట్టిన తేది 2 అయితే తెలుపు రంగు గవ్వలతో తయారు చేసిన బొమ్మలను ఇంట్లోని వాయవ్య దిశలో ఉంచాలి. ఇవి ఎప్పుడు సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి.

నెలలో మూడో తేదిన పుట్టిన వ్యక్తులు రుద్రాక్షను ఇంట్లోని ఈశాన్య దిక్కులో ఉంచాలి. అయితే దీన్ని మాత్రం రుద్రాక్ష మాలలో ఉపయోగించకండి.

పుట్టిన తేది నాలుగు అయితే అద్దాలను ధీర్ఘచతురస్రాకారంలో చిన్న ముక్కలుగా కోసి ఇంట్లో నైరుతి దిశలో ఉంచాలి. అయితే ఇవి చెల్లాచెదురుగా ఉంటే ఎవరికైనా కీడు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి.

అయిదో తేదిన జన్మించిన వ్యక్తులు కుబేరుడు లేదా లక్ష్మీదేవి విగ్రహాలను ఇంట్లోని ఉత్తర దిక్కులో ఉంచాలి. దీని వల్ల అపార సంపదలు, శ్రేయస్సు లభిస్తుంది.

ఏదైనా నెలలోని ఆరో తేదిన జన్మించిన వాళ్లు నెమలి పింఛాన్ని ఇంట్లోని ఆగ్నేయ దిశలో ఉంచితే సంపద విస్తారంగా వృద్ధి చెందుతుంది.

ఏడో తేదిన పుట్టిన వ్యక్తులు ఆగ్నేయ దిశగా రుద్రాక్షను ఉంచాలి. అయితే ఇది ముదురు రంగులో ఉండాలి.

ఎనిమిది జనన తేది అయితే ఇంటిలోని దక్షిణ దిశలో బ్లాక్ క్రిస్టల్ ఉంటే నెగెటివ్ ఎనర్జీని స్వీకరించి అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది.

తొమ్మిది పుట్టిన సంఖ్య అయితే పిరమిడ్‌ను ఇంట్లోని దక్షిణంగా ఉంచితే దుశ్శకునాలు తొలిగిపోతాయి.

ఇప్ప‌టివ‌ర‌కు చెప్పుకున్న అంశాలు సంబంధిత తేదీలో జన్మించిన వారికి వర్తిస్తుంది. ఎలా అంటే మీరు 11వ తేదీ జ‌న్మిస్తే మీ జ‌న‌న సంఖ్య 2 అవుతుంది. 21 తేదిన జన్మిస్తే మీ జనన సంఖ్య 3 అవుతుంది. 22 అయితే 4, 23 అయితే 5, 24 అయితే 6 అవుతుంది. ఆ విధంగా జన్మ తేదిలను బట్టి ఆయా కార్యాలు చేస్తే మీ జీవితం సుఖమయం అవుతుంది.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS