చామరం ( Chamaram )
లలితా సహస్రనామంలో చామరం గురించి ప్రస్తావన ఉంది . లలితా సహస్రనామ స్తోత్రములో ' స చామర రమావాణీ సవ్య దక్షిణ సేవితా .
" చామర ( మృగము వెంట్రుకలతో చేయబడిన ) వింజామరము లను చేతిలో కలిగిన రమా ( లక్ష్మీదేవి ) , వాణీ సరస్వతీదేవి ) , ఎడమ ( సవ్య ) , కుడి ( దక్షిణ ) వైపు ఉండి సేవిస్తుంటారు . " పంచభూత తత్వాలతో దేవా లయంలోను ,
పూజామందిరంలోను దేవతా విగ్రహా లకు పూజలు నిర్వహిస్తారు .
దేవతా విగ్రహాలకు చందనం పూయుట “ భూతత్వం " , గంట మ్రోగించటం “ ఆకాశ తత్వం ” , దీపారాధన చేయటం " అగ్నితత్వం " , తీర్థప్రసాదం ఇవ్వటం “ జలతత్వం ” , చామరసేవ ( వింజామర వీచుట ) " వాయు తత్వం " గాను పూజలు నిర్వహిస్తారు .
కొన్ని దేవాలయాలలో వింజామర సేవలు ( చామర సేవ ) నిర్వహిస్తారు . చామరం హిందూ దేవాలయాలలో కొన్ని పూజా సమయాలలో దేవునికి వింజామరలాగ వీచే ఉపకరణం .
కొన్ని సేవలలో భక్తుల చేత కూడా వీనితో విసరమని చెబుతారు . దీనిని పొడవైన తెల్లని లేదా లేత గోధుమరంగులో ఉండే మెత్తని వెంట్రుకలతో తయారుచేస్తారు . ఈ వెంట్రుకలు ' చమరీ మృగం ' తోకభాగం నుండి తీస్తారు .
పట్టుకోవడానికి అనువుగా వెండితో చేసిన పిడి ఉంటుంది .
చమరీ మృగం వెంట్రుకలు కలిగిన క్షీరదాలు . దేవతల పూజాకార్యక్రమాలలో ఉపయోగించే చామరం దీని వెంట్రుకలతో తయారుచేస్తారు . కాబట్టి చమరీ మృగానికి ఇంత ప్రాముఖ్యత లభించింది .
No comments:
Post a Comment