Friday, August 4, 2023

దగ్ద యోగం అంటే ఏమిటి...........!!

దగ్ద యోగం అంటే ఏమిటి...........!!

దగ్ధయోగాలు :- తిథీ వారం కలిస్తే వచ్చే మొత్తం కనక పదమూడు ఐతే అది దగ్ధ యోగం అన్నారు మనవారు. మాయా బజార్ సినిమాలో శంఖు తీర్ధులవారు లెక్క కట్టి "ఇది దగ్ధ యోగం" వివాహం కాదు అని శాస్త్రం చెబుతోంది అంటారు. పదమూడు అంటే 1+3 =4 నాలుగు సంఖ్య జ్యోతిష శాస్త్రం ప్రకారం రాహువుకు సంకేతం. శనివత్ రాహువు అన్నారు. రాహువు ఛాయా గ్రహం అయిననూ శని ఇచ్చే ఫలితాలను ఇస్తాడు. రాహువు కారకరత్వంలో చెడును చేసే ఫలితాలు గమనిస్తే పైకి ధైర్యం, లోపల పిరికి, భ్రష్టత్వం, ఉద్రేకం, ఉద్వేగం, ఇతరులకు బాధ కలిగించునట్లు చేయుట, మానసిక వ్యధ, వ్యాధులు, పనులలో అంతారాయాలు మొదలగునవి కలిగిస్తాడు.     
ఆ దగ్ధ యోగాలు కలిగించే సందర్భాలు, ఈ క్రింద ఇవ్వబడ్డాయి గమనించండి.
1.  షష్టీ      6 +7   శనివారం
2.  సప్తమీ  7 + 6  శుక్రవారం
3.  అష్టమీ  8 +5  గురువారం
4.  నవమి   9 + 4 బుధవారం
5.  దశమీ   10 +3 మంగళవారం
6.  ఏకాదశి 11+2  సోమవారం
7.  ద్వాదశి 12+1  ఆదివారం
                పైన తెలిపిన రోజులలో ఏ పని మొదలుపెట్టినా జరగదని భావం. షష్టి నాడు మొదలెట్టిన పని కలహంతో ముగుస్తుందిట. అష్టమినాటి పని కష్టాన్ని మిగులుస్తుంది, నవమినాటి పని వ్యయప్రయాసలకే కారణం. 
విశేషం ఏమిటంటే.... త్రయోదశినాటి పని దిగ్విజయంగా ముగుస్తుందట, పదమూడు వర్జించవలసిందికాదు, కానీ వారం+తిథి, ఈ రెండూ కలిసిన  పదమూడు వర్జనీయమే!
*చవితి, షష్టి, అష్టమి, నవమి, ద్వాదశి తిథులను వదిలేస్తాం గనక వీటితో వచ్చే దగ్ధయోగాలను పట్టించుకోం. 
*ఇక దశమి మంగళవారం, ఏకాదశి సోమవారాలే మనల్ని ఇబ్బంది పెట్టేవి. తిధి, వారాలు కలిసి దోషప్రదమైన దగ్ధయోగాన్నిస్తాయి. 
*నిత్యమూ చేసే పనులకి పంచాంగం చూడక్కరలేదంటారు పెద్దలు. ఇవి అత్యంత ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు మాత్ర‌మే ఆచరించాల్సి ఉంటుంది.
1.  షష్టి నాడు వచ్చే శనివారం, 
2.  సప్తమి నాడు వచ్చే శుక్రవారం, 
3.  అష్టమి నాడు వచ్చే గురువారం, 
4.  నవమి నాడు వచ్చే బుధవారం, 
5.  దశమి నాడు వచ్చే మంగళవారం, 
6.  ఏకాదశి నాడు వచ్చే సోమవారం,
7.  ద్వాదశి నాడు వచ్చే ఆదివారం ,
             ఇలా వచ్చినప్పుడు ఏ విధమైన శుభకార్యాలు చేసుకోకూడదు. వీటిని దగ్ధయోగాలు అంటారు.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS