Wednesday, August 30, 2023

శనిదేవుడిని ఇలా పూజిస్తే ఐశ్వర్యాన్ని ఇస్తాడని తెలుసా?

 శనిదేవుడిని ఇలా పూజిస్తే ఐశ్వర్యాన్ని ఇస్తాడని తెలుసా?



👉సాధారణంగా శనీశ్వరుడు పేరు చెప్పగానే ఉలిక్కి పడతాం. ఆయన పేరు వింటే తెగ ఆందోళన పడిపోతారు.శనిదేవుడిని ఈ రకంగా పూజిస్తే మనకు కష్టాలను కాదు ఐశ్వర్యాన్ని ఇస్తాడని మీకు తెలుసా..?


సాధారణంగా శనీశ్వరుడు పేరు చెప్పగానే ఉలిక్కి పడతాం. ఆయన పేరు వింటే తెగ ఆందోళన పడిపోతారు. మన జాతకంలో శని ప్రభావం ఉండకూడదని కోరుకుంటాం. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఈ పేర్లు వింటేనే జనాల్లో ఓ రకమైన వణుకు పుడుతుంది. కానీ శనీశ్వరుడు ప్రసాదించే వాటి గురించి తెలుసుకుంటే ఆయనను తప్పక ఆరాధిస్తారు.


‘నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం’ 


భావం :—  నీలాంజనం అంటే నల్లటి కాటుక రూపంలో ఉండే వాడు, రవిపుత్రం అంటే సూర్యుడి పుత్రుడు, యమాగ్రజం-యముడికి సోదరుడు, ఛాయా మార్తాండ సంభూతం: ఛాయా దేవికి మార్తాండుడు అంటే సూర్య భగవానుడికి జన్మించిన వాడు, తం నమామి శనేశ్చరం: అలాంటి శనీశ్వరుడికి నమస్కరిస్తున్నాను అని అర్థం. 

ఈ మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే శనీశ్వరుడు మిమల్ని అనుగ్రహిస్తాడు.


శనీశ్వరుడిని ఎప్పుడూ శని శని అని పిలవకూడదట. శనీశ్వరా అని మాత్రమే పలకాలి. విశేషం ఏమంటే ఈశ్వర శబ్దం ఎక్కడ ధ్వనిస్తుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. ఉదాహరణకి శివుడిని ఈశ్వరుడు, మహేశ్వరుడు అంటాం, ఆయన అలా అనుగ్రహిస్తాడు... వెంకటేశ్వర స్వామి పేరులోనూ ఈశ్వర శబ్దం ఉంది. ఈశ్వర శబ్దం ఉంది కాబట్టే ఆయన కలియుగ దైవంగా మారి మన కోరికలను నెరవేరుస్తున్నాడు.

అలాగే శనీశ్వరుడి నామంలోనూ శని, ఈశ్వరుడు అనే శబ్దం రావడంతో ఈయన కూడా శివుడిలా, వేంకటేశ్వరుడిలా మనల్ని అనుగ్రహిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి.

శనీశ్వరుడికి బయపడాల్సిన పనిలేదు. నవగ్రహా మండపానికి వెళ్లినప్పుడు శనీశ్వరుడికి భక్తితో నమస్కారం చేయండి. నమస్కరించడం వల్ల, శనివార నియమాల్ని పాటించడం వల్ల, నీలం లేదా నలుపు రంగు వస్త్రాల్ని ధరించడం వల్ల, ఆయనకు ఇష్టమైన చిమ్మిలి నివేదనం చేయడం వల్ల, శివారాధన చేయడం వల్ల, తప్పక అనుగ్రహిస్తాడు.


శనీశ్వరుడి వల్ల కలిగే దోషాలు అంటే గ్రహరీత్యా ఏ గ్రహమైనాసరే మీకు యోగంతోపాటు పీడని కలిగిస్తుంది. శనీశ్వరుడు కూడా అంతే ఆయన నివాసం ఉన్న స్థానాన్ని బట్టి జన్మ శని, ద్వాదశ శని, లేదా ద్వితీయ శనిగా కొద్దిగా కష్టాలకు గురిచేస్తాడు. ఎవరైతే శనీశ్వరుని భక్తిగా పూజించి, గౌరవిస్తారో అలాంటి వాళ్లను అనుగ్రహిస్తాడు. అయితే ఎప్పుడు కూడా శని పీడ రావాలనే కోరుకోవాలట.


ఎందుకంటే శనీశ్వరుడు కొద్దిగా పీడించాడంటే దానికి వందరెట్లు యోగాన్ని, ఐశ్వర్యాన్నీ మీకు అందించి వెళ్తాడు. మాకు శనీశ్వరుడి ప్రభావం కోరుకోకపోతే ఆయన ఇచ్చే యోగం, ఐశ్వర్యం కూడా రాదట. అందుకే శనీశ్వరుడు పీడించాలి, దానికి వందరెట్లు యోగాన్ని, ఐశ్వర్యాన్నీకలిగించాలని భక్తిశ్రద్ధలతో కోరుకోవాలట. శనీశ్వరుడి ఆరాధించాలి.


చక్కగా నీలిరంగు పుష్పాలతో పూజించి, శివారాధన, హనుమాన్, అయ్యప్ప ఆరాధనా చేయాలట. అలాగే శనివార నియమాల్ని పాటించడం వల్ల కూడా శనీశ్వరుడు అనుగ్రహిస్తాడట. కొద్ది ఇబ్బందులు ఎదురైనా అంతకు మించి ఐశ్వర్యాన్నీ ప్రసాదిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది తెలిసిన తర్వాత శనీశ్వరుడు అంటే భయం తొలగిపోతుంది.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS