*శంఖం పూరిచకుండా పూజ ముగించకూడదని ఒక ఆచారం ఉంది.*
*పెద్ద పెద్ద దేవాలయాల్లో గర్భగుడి తలుపులు తీసేటప్పుడు కూడా శంఖాన్ని ఊదుతారు.*
*మన భారతీయ సంస్కృతిలో శంఖానికి ఒక ప్రత్యేక స్థానం ఉండటానికి కారణం అది సముద్ర మథన సమయంలో పాల సముద్రం నుండి బయటకు రావటమే.*
*అలా బయటపడిన దానిని శ్రీమహావిష్ణువు ధరించాడు. దానికే పాంచజన్యం అని పేరు*.
*దాని తరువాత వచ్చిన లక్ష్మిదేవిని కూడా స్వామి స్వీకరించాడు. ముందుగా శంఖం దాని వెంటే లక్ష్మీదేవి రావటంతో శంఖాన్ని ఆ దేవి అన్నగారిగా వర్ణిస్తారు.*
*దేముడు గదిలో శంఖం పెట్టి దానిలో నీరు నింపి ఉంచటం వల్ల శుభాలు జరుగుతాయని ఒక నమ్మకం.*
*ఈ శంఖంలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి దక్షిణావృత శంఖం, రెండవది వామావృత శంఖం.*
*దక్షిణావృత శంఖాలని ఎక్కువగా పూజావిదానంలో వాడరు.*
*ఇవి తెల్లటి తెలుపు రంగులో ఉండి దాని మీద కాఫీ రంగు గీత ఉంటుంది. ఇది కుడి వైపు తెరుచుకుని ఉంటుంది.*
*ఈ శంఖంలో నీరు నింపి సూర్యుడికి ధారపోస్తే కంటికి సంబందించిన రోగాలు తగ్గుతాయి.*
*ఎడమవైపు తెరుచుకుని ఉండే శంఖాన్ని వామావృత శంఖం అంటారు.*
*ఇది పేరుకి తగ్గట్టు ఎడమవైపుకి తెరుచుకుని ఉంటుంది. అన్ని పూజా విధానాల్లో మనం తరచుగా వాడేది దీనినే.*
*ఇది ఇంట్లో ఉంటే దుష్ట శక్తులు ఆ దరిదాపులకి కూడా రావట.*
*వైదికశాస్త్ర ప్రకారం శంఖం పూరించగానే వచ్చే శబ్దానికి ఆ చుట్టుపక్కల ఉండే క్రిమికీటకాలు నాశనమైపోతాయట.*
*దీనిని ఆధునిక శాస్త్ర విజ్ఞానం కూడా ధృవీకరించింది.*
*1929లో బెర్లిన్ యూనివర్సిటీలో దీనిని మళ్లీ నిర్ధారించారు.*
*ఈ శంఖధ్వనికి రెండువేల ఆరువందల అడుగుల దూరంలో ఉండే క్రిములు కూడా స్పృహ తప్పి పోతాయట.*
*అంతేకాదు వైద్యశాస్త్రంలో కూడా దీనికి మంచి గుర్తింపు ఉంది. రోజూ శంఖాన్ని ఊదేవారికి శ్వాససంబందిత వ్యాధులు దగ్గరకి రావట.*
*ఆస్త్మా కూడా తగ్గుతుందని ఒక అధ్యయనం తెలిపింది. రాత్రిపూట శంఖాన్ని నీళ్ళతో నింపి ఆ నీటిని ఉదయాన్నే చర్మంపై రాసుకుంటే చర్మసంబందిత వ్యాదులు దూరమవుతాయట.*
*ఇంట్లో దీనిని ఉంచుకోవటం వల్ల వాస్తు దోషాలు ఉన్నా అన్నీ తొలగిపోతాయి.*
*శంఖాన్ని కాల్చగా వచ్చిన భస్మం వల్ల అనేక రోగాలు నయమవుతాయట*.
*ఈ శంఖాల వల్ల ఆయువృద్ధి, లక్ష్మీ ప్రాప్తి, పుత్రప్రాప్తి, శాంతి, వివాహ ప్రాప్తి కలుగుతాయని ఒక నమ్మకం.*
*శంఖాలలో అనేక రకాలు ఉన్నాయి. అందులో గోముఖ శంఖం ఒకటి. ఇది ఆవు మొహం ఆకారంలో ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. గోముఖ శంఖాన్ని పూజించిన వారికి మనస్సులో ఉన్న కోరికలు తీరుతాయి.*
*దీనిని షాపులో ఉంచుకొని పూజించిన వారికి రోజూ వ్యాపార,ధనాభివృద్ది కలుగుతుంది.*
*శంఖం ఏదైనా దానిని మాత్రం ఎప్పుడూ బోర్లించి ఉంచకూడదు.*
*ఏ ఇంట్లో శంఖాన్ని దేముడి గదిలో ఉంచి పూజిస్తారో ఆ ఇల్లు ధనధాన్యాలతో తులతూగుతుందిట.*
*ఇన్ని ఉపయోగాలున్న శంఖాన్ని పూజించడం, ఆరాదించడం, పూజా విధానాలలో ఉపయోగించడం ఎంతో మంచిది.*
No comments:
Post a Comment