Wednesday, August 30, 2023

దీపారాధన-ఎలాచేయాలి..?

 దీపారాధన-ఎలాచేయాలి..?



మన నిత్య జీవితంలో పూజ అయినా, వ్రతమైనా, శుభకార్యమైనా దీపారాధనతోనే మొదలు పెడతాము. దీపంలో దేవతలు, వేదాలున్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి. దీపారాధనతో శాంతి, కాంతి చేకూరుతాయి. దీపానికి చాలా విశిష్ట ఉందని, అందుచేత దీపారాధన ఒక పద్ధతిగా, నిష్టగా చేయాలి.


నిజానికి దీపారాధన గురించి అనేక విషయాలు వాడుకలో ఉన్నాయి. శివుడికి ఎడమవైపు దీపారాధన చేయాలని, విష్ణువుకి కుడివైపు అనీ ఏ దేవుడికీ ఎదురుగా దీపారాధన చేయకూడదనీ అంటారు. అమ్మవారిముందు తెల్లని బియ్యంపోసి దాని మీద వెండి దీపారాధన కుందిలో దీపారాధన చేసి, తెల్లకలువ పూలతో దీపాన్ని అలంకరించి, అమ్మవారికి పూజ చేస్తే తెలివి తేటలు, మేధస్సుపెరిగి, సాత్విక మార్గంలో సంపాదన పెరుగుతుంది. అగ్గిపుల్ల ద్వారా నేరుగా కుందులలోని దీపాన్ని వెలిగించకూడదు. మరొక దీపం ద్వారా లేదా ఏకహారతి ద్వారా ప్రత్యేకంగా ముందుగా వెలిగించి పెట్టుకున్న దీపం నుంచి దీపారాధన చేయాలి.


దీపారాధన కుందిలో అయిదు వత్తులు వేసి గృహిణి తానే స్వయంగా వెలిగించాలి. మొదటి వత్తి భర్త, సంతానం సంక్షేమం కోసమని, రెండో వత్తి అత్తమామల క్షేమానికి, మూడోది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ క్షేమానికి, నాలుగవది గౌరవ, ధర్మవృద్ధులకూ, అయిదోది వంశాకభివృద్ధికి అని చెప్పవచ్చు.


దీపారాధన ఎవరు చేసినా రెండు వత్తులు తప్పనిసరిగా ఉండాలి. దీపారాధనకు ఉద్ధేశించిన దీపాల నుంచి నేరుగా అగరవత్తులు, ఏకహారతి, కర్పూర హారతులు వెలిగించకూడదు. ఇక ఇంటి ముందు తులసి మొక్కముందు మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు రావు. 


శనీశ్వరుడంటే అందరికీ భయం. అసలు, మనలో జీవ శక్తికీ, ఆయుష్షుకూ అధిదేవత ఆయనే. శనీశ్వడికి అరచేతి వెడల్పుగల నల్లగుడ్డలో ఒక చెంచా నల్ల నవ్వులు పోసి మూటకట్టి, ఆమూట చివర వత్తిగా చేసి, ఇనప ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయాలి. ఈ దీపారాధనకూడా శివుడు, శనీశ్వరుడు, ఆంజనేయస్వామి ముందు చేసి శని దోషాలు పోవాలని నమస్కరించాలి.


వెండి దీపాలతో ఆరాధన

వెండి ప్రమిదల్లో నేతితో గానీ, కొబ్బరి నూనెతో గానీ, నువ్వుల నూనెతోగానీ, . దీపారాధన చేస్తే వారికి వారి ఇంట్లో వారికి అష్ట నిధులు కలుగును. గణపతిని లక్ష్మీనారాయణ స్వామికి లలితా త్రిపుర సుందరీదేవికి, రాజరాజేశ్వరీ అమ్మవారికి సాలగ్రామాలకు శ్రీగాయత్రీ మాతకు గానీ, వెండి ప్రమిదల్లో వత్తులను వేసి దీపారాధన చేస్తే.. వారు అనుకున్న పనులు సకాలంలోనే పూర్తవుతాయి. 


భక్తి శ్రద్ధలతో చేసే పవిత్రమైన దీపారాధన, చీకట్లనే కాదు పాపాలను సైతం తరిమేసి సుఖసంతోషాల తేజస్సును ప్రసాదిస్తుంది. వెలుతురు ప్రవాహమై మోక్షానికి మార్గాన్ని చూపిస్తుంది!

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS