Tuesday, August 22, 2023

"కాకి" అనే ఒక పక్షిని మన ఆచారంలో భాగంగా చూపించారు

*"బలగం" సినిమా లో  "కాకి" అనే ఒక పక్షిని మన  ఆచారంలో భాగంగా చూపించారు... అయితే చాలా పక్షులు ఉన్నప్పటికీ కాకికి మాత్రం ఆ గౌరవం దక్కింది... ఎందుకంటే కాకి - "కాలజ్ఞాని" అంటారు"..!*(


*®️వేకువ జామునే "(బ్రహ్మ ముహూర్తంలో)" మేల్కొని స్నానం ఆచరించే పక్షి కాకి.*

*®️"కావు కావు" అంటూ ఈ బంధాలు, ఈ సిరి సంపదలు... ఏవీ నీవి కావు, ఏవీ శాశ్వతమూ "కావు కావు" అని  అందరికీ గుర్తు చేస్తూ బోధిస్తూ అందరినీ తట్టి లేపేది కాకి.*

*®️ఎక్కడయినా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న "అన్ని కాకులకు" సందేశం పంపి గుమిగూడి అన్ని కాకులు కలసి  ఆహారం ఆరగిస్తాయి అంత స్నేహపూర్వకంగా మసిలేది కాకి.*

*®️శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణలు చేసి "సంఘటితంగా పోరాటం" చేపట్టేవి కాకులు.*

*®️ఆడ కాకి - మగ కాకి కలవడం కూడా 'పరుల కంట' పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి, అంత గుప్త జ్ఞానం కలిగి ఉండటం చెప్పదగ్గ విషయం.*

*®️ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమిగూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోధనలు చేసి స్నానమాచరించి గూటికి చేరే మంచి ఆచరణ కాకులదే...*

*®️సూర్యాస్తమయం సమయానికి గూటికి చేరే సలక్షణమైన అలవాటు సమయపాలన కాకులదే...*

*®️అంతేకాదు సూర్యాస్తమయం తరువాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులదే సుమా...*

*®️కాకులు లేని ప్రదేశం లేదు ఈ భువిపై కాకి పళ్ళు తిని మరో చోట విసర్జన చేస్తే అక్కడ ఆ బీజం పడి మొలకెత్తి మొక్కలు పెరిగి వటవృక్షాలుగా పెరుగుతాయి... అలా పచ్చని ప్రకృతిని విస్తరించి పరిరక్షించుకోవడంలో కాకుల పాత్ర చాలా గణనీయమైనదే అందుకే  "కాకులు దూరని కారడవి" అంటారు.*

*®️కాకులు అరుస్తోంటే  ఎవరో కావలసిన బంధువులు వస్తారు కాబోలు అందుకే కాకి అరుస్తోంది అనేవారు పెద్దలు.*

*®️అంతేకాదు పకృతి వైపరీత్యాలు వచ్చే ముందు (భూమి కంపించే ముందు తుఫానులు వచ్చే ముందు) కాకులు సూచన చేస్తూ అరుస్తూ ఎగురుతూ లోకానికి సూచిస్తాయి.*

*®️సూర్య గ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక  స్నానమాచరించి బయట ఎగురుతాయి.  అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు.*

*®️దానధర్మాలు ఆచరించని వారిని ఎంగిలి చేత్తో కాకిని తోలని వారిగా ఉదహరిస్తారు.*

*®️భోజనం చేసే ముందు మొదటి ముద్ద బయట గోడపై పెట్టి కాకుల్ని పిలిచేవారు పెద్దలు.*

*®️మానవ జీవన పరిణామంలో కొన్ని తరాలను గుర్తు పెట్టుకునే సాక్షీభూతంగా ఉండే పక్షి కాకి.*

*®️ఎక్కువ కాలం జీవిస్తుంది కనుక కాకి కలకాలం జీవించడం శాస్త్రంలో కూడా విశదీకరించారు.!*

*®️కూజాలో రాళ్ళు వేసి అట్టడుగున ఉన్న నీటిని పైకి తెచ్చి తరువాత దాహం తీర్చుకునే సాంకేతిక పరిజ్ఞానం కూడా సంతరించుకుంది కాకి...!!*

*®️భారతీయుల సనాతన ధర్మం - విశిష్టత, ఆవశ్యకత నేటి జనం ఆచరించాల్సినవే.  సంఘజీవనం.., సేవాతత్పరత.., మంచి స్నేహభావాలతో., ఈర్ష్యా ద్వేషాలు లేకుండా., కలసి మెలసి అన్యోన్యంగా., అసమానతలకు అతీతమైన ప్రేమానురాగాలతో., నైతిక విలువలు కలిగి కాకిలా కలకాలం జీవిద్దాము.*
-----------------------------------------------
*ఇది చదివాక, కాకి జీవనంలో ఇంత  తాత్వికత, ఇంత లోతైన అర్థం ఉందా!!!!! అనిపించింది.*

*ఇది వీలైనంతమందికి పంచితే మంచిదేమో !... అనిపిస్తుంది పంపుతారు గదూ!*

*సేకరణ:- ఒక మిత్రుడు ద్వారా వచ్చింది ,నాకు బాగా నచ్చింది, ఇందులో మంచి మేసేజ్ కూడిన నిజాలు ఉన్నాయి కనుక ఈ మెసేజ్ అందరి వద్దకు చేరేలా ప్రయత్నించండి.👌👍🤝✊*

*సత్యమేవ - జయతే !*🙏

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS