అష్టలక్ష్మి దేవాలయం గుంటూరు | Ashta Lakshmi Temple Arundalpet GuntuR అష్టలక్ష్మి దేవాలయం..అరండల్ పేట..4వ లైన్..గుంటూరు
ఓం శ్రీ మాత్రేనమః🙏🙏
ఈ లక్ష్మీదేవి (అష్టలక్ష్మీ ఆలయం..) దేవాలయం గుంటూరు నగరం, అరండల్ పేట 4వలైన్, 4వ అడ్డరోడ్ లో ఉన్న శివాలయం శ్రీగంగా,మీనాక్షి సమేత సోమసుందరేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా ఉన్నది. ఈ అష్టలక్ష్మీ మందిరం హంపి విరూపాక్ష శ్రీ విద్యారణ సంస్థాన్ వారి ఆధ్వర్యంలో 1996లో నిర్మించబడింది. చాలా అద్భుతమైన దేవాలయం చూడటానికి రెండు కళ్లు సరిపోవు. నిత్యం విశేష పూజలతో ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. లక్ష్మీ అమ్మవార్ల మూల విగ్రహాలు ఎంతో అందంగా అమర్చబడి ఉన్నాయి. ఒకవైపు నలుగురు, మరోవైపు నలుగురు లక్ష్మీదేవీలు మధ్యలో లక్ష్మీ నారాయణులు, వారి ఎదురుగా మరో లక్ష్మీవిగ్రహం దానిముందు శ్రీచక్రం ఎప్పుడూ కుంకుమార్చనలతో విరాజిల్లుతూ వుంటుంది. శ్రీసూక్తంతో కుంకుమ పూజ చేస్తూంటారు. ఎంతో అందంగా లక్ష్మీ నారాయణులు అలంకరణ చేస్తారు. కలువపూల అలంకరణలో అమ్మవార్లు ఎంతో అందంగా ఉంటారు. ఇక్కడ అఖండ దీపారాధన చేస్తారు.
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే!
శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే!!
మరో ప్రక్క సాయిబాబా వారి విగ్రహం-ద్వారకా సాయినాధుడు కొలువై ఉన్నారు. బాబా వెనుక కొన్ని ఉత్సవ విగ్రహాలను ఉంటాయి. గణపతి, సుబ్రంహ్మణ్యస్వామి, లక్ష్మీ నారాయణుల ఉత్సవ విగ్రహాలను ఉంటాయి. మరోవైపు దసరా ఉత్సవాల సందర్భంగా వివిధ అమ్మవార్ల అలంకరణల ఉత్సవ విగ్రహాలను ఉంటాయి. ఎంతో అద్భుతంగా మహిషాసుర మర్ధిన, శివుడు, అన్నపూర్ణాదేవి, నెమలి వీణతో సరస్వతీదేవి, ఏనుగులతో లక్ష్మీదేవి, దుర్గాదేవి విగ్రహాలు ఎంతో అదంగా అలంకరిచి ఉంటాయి. ఈ అష్టలక్ష్మీ దేవాలయానికి గోశాల కూడా ఉంది. నిడుముక్కల, తాడికొండలో గోశాల ఏర్పాటు చేశారు. గుంటూరులోని ఈ దేవాలయాన్ని తప్పక దర్శించాలని, ఆ లక్ష్మీ నారాయణుల అనుగ్రహం అందరికీ కలగాలని, వారి ఆశీస్సులతో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు పొందుతారని ఆశిస్తూ....
ఓం శ్రీ మాత్రే నమః🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏
No comments:
Post a Comment