శ్రీ విజయ సాయిబాబా మందిరం గోరంట్ల మెయిన్ రోడ్ అమరావతి రోడ్ గుంటూరు SRI VIJAYA SAIBABA MANDIR GORANTLA GUNTUR విజయ సాయిబాబా మందిరం...గోరంట్ల...గుంటూరు
ఓం శ్రీ సాయిరాం🙏🙏
గుంటూరుకి అతిసమీపంలో ఉన్న గోరంట్ల గ్రామంలో ఉన్న విజయ సాయిబాబా మందిరం చిన్నదైనా, ఎంతో భక్తి-శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రక్కనే ప్రసన్నాంజనేయ స్వామి మందిరం కూడా ఉన్నది.
ఆలయం పైన గణపతి విగ్రహం, మధ్యలో బాబా, కుమారస్వామి విగ్రహలు చూడవచ్చు. సాయిబాబా మందిరం లోపలికి ప్రవేశించగానే ఎంతో కళాత్మకంగా నెమలి బొమ్మలతో, మండపం రంగులతో వేసిన అలంకరణ కనిపిస్తుంది. బాబా విగ్రహం ఎదురుగా కూర్మం (తాబేలు) ప్రతిష్టించారు. ప్రక్కన మండపానికి ఒకవైపు విఘ్నేశ్వరుడు, మరొకవైపు దత్తాత్రేయుడు దర్శనం చేసుకోవచ్చు. బాబా విగ్రహం చూడచక్కగా మనిషి రూపం చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఎంతో అద్భుతంగా అలంకరించారు. షిరిడిలో మాదిరిగా విగ్రహం ముందు సమాధి ఏర్పాటుచేసి అలంకారం చేసారు. పాదుకలు దర్శించుకోవటానికి, ప్రదక్షిణలు చేయుటకు వీలుగా ఏర్పాటుచేసారు.
హే పరమేశ్వర దీనదయాళో,సాయినాధ గురుదేవ కృపాళో!
రక్ష రక్ష జగదీశ్వర సాయి,ఆర్తత్రాణ పరాయణ సాయి!!
ప్రతి గురువారం అభిషేక, అర్చనాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. పల్లకిసేవ కోసం పల్లకి, ఉయ్యాలసేవ కోసం ఊయల ఏర్పాట్లు ఉన్నాయి. షిరిడిలో మాదిరిగా శ్రీ కృష్ణుని విగ్రహం, ద్వారకామాయి చిత్రపటం ఒకవైపున ఉన్నాయి.
ఈ విజయసాయి మందిరంలో ఏఏ పదార్ధాలతో అభిషేకం చేస్తే, ఏఏ ఫలితాలు కలుగుతాయో రాసిన బోర్డు కూడా ఏర్పాటుచేసారు. ఏకాదశసూత్రాలు, ఊదీమంత్రం బోర్డులు కూడా ఉన్నాయి. ఇక్కడ పెద్ధ బాబాచిత్రం ఒక గ్లాస్ మీద వేసినది చాలాఅందంగా ఉన్నది. ఇక్కడ ప్రతిరోజూ నాలుగు హారతులు తప్పక జరుగుతాయని ఇక్కడి అర్చకులు వేణుమాధవ్ గారు తెలియచేసారు. మీరు గోరంట్ల గ్రామం వైపు వచ్చినప్పుడు తప్పక ఈ విజయసాయి మందిరాన్ని దర్శించి, స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని, వారి ఆశీస్సులతో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు పొందాలని కోరకుంటూ....
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏
No comments:
Post a Comment