Sunday, May 23, 2021

పొన్నూరు శ్రీవీరాంజనేయస్వామి దేవాలయం

పొన్నూరు శ్రీవీరాంజనేయస్వామి దేవాలయం!! 


గుంటూరు జిల్లా పొన్నూరులో భారీ విగ్రహ రూపం లో శ్రీ వీరాంజనేయ స్వామి వెలుగొందుతున్నాడు. 26—2-1969 న ప్రతిష్ట జరిగింది. శ్రీ కని గల్పుల కోటయ్య, తాయమ్మ వైశ్య దంపతులు స్వామి విగ్రహ నిర్మాణాన్ని స్వంత ఖర్చుల తో చేయించారు. స్వామి విగ్రహం 24అడుగుల ఎత్తు, 12అడుగుల వెడల్పు తో ఉంటాడు. పొన్నూరు అంటే-పొన్ను అంటే బంగారం ఊరు అంటే గ్రామం. కనుక బంగారు గ్రామం. లేక స్వర్ణ పట్టణం అని అర్ధం.

వైశ్య స్వామి సద్గురు జగన్నాధ స్వామి గారు పూనుకొని చేయించిన కార్యక్రమం ఇది.ఆయన స్వయం గా గ్రామ గ్రామాలు తిరిగి శిష్యులకు జపదీక్ష నిచ్చి, విగ్రహం తయారై బయల్దేరే సమయం లో అన్ని గ్రామాల భక్తులను ఆహ్వానించి యడ్ల పాడు నుండి పొన్నూరు దేవాలయం చేరేవరకు ఏ విధమైన ఆటంకాలు కలుగ కుండా చూడమని తాము చేసిన జప ఫలితాన్ని ధారా దత్తం చేసి అత్యంత క్రమశిక్షణతో దీక్షతో శోభా యాత్రలాగా నిర్వహించారు. యడ్ల పాడులో బయల్దేరినప్పుడు వెలిగించిన కర్పూర జ్యోతి పొన్నూరు ఆలయం చేరేవరకు అఖండం గా వెలిగెట్లు చూస్తూ, అత్యంత భక్తీ శ్రద్ధలతో స్వామిని రంగ రంగ వైభోగం గా తోడ్కొని తెచ్చి ప్రతిష్ట చేశారు. ఆ జ్యోతి నేటికీ అఖండం గానే వెలుగుతూనే ఉండటం ప్రత్యేకత.అందరి జప ఫలాలను ధార పోసి తెచ్చిన స్వామి అంటే గొప్ప మహిమాన్వితుడై విరాజిల్లు తున్నాడు.

విగ్రహ నిర్మాణానికి రెండు సంవత్స్సరాలు పట్టింది. అక్కడి నుండి పొన్నూరుకు చేర్చటానికి ఒక ఏదాది పట్టింది అంతటి అకుంఠిత దీక్షతో భక్తులు స్వామిని పొన్నూరుకు తెచ్చుకొన్నారు. అందుకే భక్తులపాలిటి 'కొంగు పొన్ను' అంటే బంగారం అయ్యాడు వీరాంజనేయస్వామి, భయంకరం గా కనిపిస్తాడు. ఎడమ చేతిలో భారీ గద తో,కుడి చేయి పైకెత్తి దర్శనమిచ్చే నల్ల రాతి భారీ ఆంజనేయస్వామి.తోక శిరస్సుదాకా వెనక కనిపిస్తుంది ఆభరణాలతో, వెండినేత్రాలు నుదుట వెండి తిరునామం తో ఉంటాడు లంగోటి కట్టికనిపిస్తాడు.

పూర్వము పొన్నూరు స్వర్ణపురి (బంగారు భూమి) అని పిలవబడేది. తరువాత స్వర్ణపురి తమిళరాజుల పరిపాలనలోకి వెళ్ళింది. అప్పుడు ఈ ఊరిని, 'పొన్నూరు'(పొన్ను+ఊరు) అని పిలవడం ప్రారంభించారు. తమిళంలో 'పొన్ను' అంటే బంగారం అని అర్థం. పొన్ను+ఊరు, అంటే స్వర్ణపురి అని అర్థం వస్తుంది. కాలక్రమేణా ఇదే పేరు వాడుకలో అలాగే నిలిచిపోయింది.

తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ది చెందినా ఆంజనేయ క్షేత్రాల్లో చాల ప్రాముక్యత గల దేవాలయం పొన్నూరు ఆంజనేయ స్వామి దేవాలయం. ఈ దేవాలయం లో శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ గరుత్మంతస్వామి ల విగ్రహ ప్రతిష్ఠ జరిగినది. ఈ విగ్రహాలు 24 అడుగుల ఎత్తు 30 అడుగుల ఎత్తుతో నయనానందకరముగా కనిపిస్తూ బహుళ ప్రసిద్ధికెక్కినవి.

ఆలయం లో ఉన్న మహిమన్మితమైన హనుమ గ్రహ పీడలను,దుస్త శక్తులను తోలిగిస్తాడని భక్తుల విశ్వాసం. స్వామి వారి దివ్య మంగళ రూపాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు.

ప్రతి నిత్యం స్వామి వారికి విశేషమైన పూజ కార్యక్రమాలు నిర్వహించాబడుతాయి.

పొన్నూరు పట్టణం తోపాటు మండలం కూడా మంచి రవాణా వ్యవస్థ కలిగిఉంది. పట్టణం గుంటూరు-బాపట్ల-చీరాల రాష్ట్ర రహదారిపై ఉండటం చేత దూర, సమీప ప్రాంతాలతో చక్కని సంధానం కలిగిఉంది.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS