Sunday, May 30, 2021

శివానంద క్షేత్రం.. శివాలయం.. నార్కెట్ పల్లి.. నల్గొండ జిల్లా.. హైదరాబాద్ హైవే..నలగొండ జిల్లాలో నార్కెట్ పల్లిలో ఉన్న పురాతన శివాలయం శివానంద క్షేత్రం Sivananda Kshetram nalgonda

 శివానంద క్షేత్రం.. శివాలయం.. నార్కెట్ పల్లి.. నల్గొండ జిల్లా.. హైదరాబాద్ హైవే..


హైదరాబాద్ నల్గొండ హైవే రహదారి మీద, నల్గొండ జిల్లా నార్కెట్ పల్లిలో హోటల్ వివేర ప్రక్కనే వున్న పురాతనమైన, ప్రాచీనమైన శివానందక్షేత్రం - చిన్న శివాలయం. లోపలికి వెళ్ళగానే హాటల్ వివేరా ముందు కొలనులో(పౌంటేన్) శివలింగం మీద ధ్యానంలో ఉన్న శివుడు (ధ్యాన బుద్ధుడిని పోలి ఉంటుంది..) కనిపిస్తాడు. దేవాలయం ముఖద్వారం మీద "ఓం నమః శివాయ" అను బోర్డు కనిపిస్తుంది. బోర్డు మీద 14-11 2005కు ముందు ఆలయ పురాతన ఫొటోలు కనిపిస్తొయు. ఈఆలయాన్ని పునరుద్ధరించిన వారు సద్గురు శ్రీ కందుకూరి శివానందమూర్తి గారు. వారి చిత్ర పటాలు దర్శనమిస్తాయి, వారి సద్గురువు శ్రీ కందుకూరి భీమునిపట్నం గారి (విశాఖపట్నం ) చిత్ర పటం కూడా చూడవచ్చు. ఆలయంలో రావి,వేపచెట్టు సముదాయం, యజ్ఞశాల, ఇక్కడ మరొక ప్రక్క బోర్డు మీద ఏయే ద్రవ్యాలతో శివాభిషేకం చేస్తే ఏ విధమైన ఫలితం వస్తుందో వ్రాయబడి వుంటుంది. ఆలయంలోకి వెళ్ళగానే గర్భగుడిలో గణపతి, ప్రక్కనే నాగాభరణ భూషితుడై, పూలతో అలంకరించిన శివలింగాన్ని(పరమేశ్వరుని) దర్శనం చేసుకోవచ్చు. ఎంతో పురాతనమైన ఈ క్షేత్రాన్ని అధునాతనంగా తీర్చిదిద్దారు. ఆహ్లాదకరమైన ప్రాంగణంలో చక్కటి వాతావరణంలో ప్రయాణికులు మరియూ భక్తులు సేద తీరుటకు వీలుగా ఆధునికంగా పూల చెట్లతో చక్కగా చిన్న శివాలయం అద్భుతంగా నిర్మించబడిందీ క్షేత్రం. బయటికి వెళ్ళే ద్వారం మీద "పునఃదర్శన ప్రాప్తిరస్తు" అని వ్రాయబడి వుంటుంది. కనుక అటువైపు స్వంత వాహనాలలో వెళ్ళేటప్పుడు ఈ శివాలయాన్ని దర్శించి ఆ శివానందుని కృపాకటాక్షాలు పొంది, మీరూ సుఖసంతోషాలతో ఆనందంగా వుండాలని ఆశిస్తూ...
ఓం శ్రీ గరుభ్యోనమః🙏

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS