Wednesday, May 26, 2021

శ్రీ క్రిష్ణ పారిజాత వృక్షం, కింటూర్, బారాబంకి, ఉత్తర ప్రదేశ్

తీర్ధయాత్ర - మధ్యప్రదేశ్ 

శ్రీ క్రిష్ణ పారిజాత వృక్షం, కింటూర్, బారాబంకి, ఉత్తర ప్రదేశ్

దర్శనం సమయం: ఉదయం 6:00 నుండి సాయంత్రం 6:00 వరకు

బారాబంకి - పారిజాత చెట్టుకు పుట్టినిల్లు ఈ పారిజాత పుష్పం స‌త్య‌భామ‌కు ఎంతో ఇష్టం. స్వర్గంలోకం నుండి కృష్ణ పరమాత్మ తెచ్చిన వృక్షం. పారిజాత వృక్షం, పుష్పం అనే పేర్లు చెబితే చటుక్కున మనకు గుర్తుకు వచ్చేది సత్యభామ-శ్రీకృష్ణుడు. పురాణాల్లో చెప్పిన ప్రకారం తన ఇష్టసఖి సత్యభామకు కృష్ణుడు పారిజాతాన్ని తెచ్చి ఇస్తాడు. 

శ్రీకృష్ణుడు ఇంద్రలోకం నుంచి తెచ్చి సత్యభామకి బహూకరించిన పారిజాత వృక్షం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బారబంకి జిల్లాలోని కింటూర్ గ్రామంలో ఉన్నదట. అక్కడ కనిపించే ఈ మహావృక్షం ప్రపంచంలోకెల్లా విలక్షణమైన వృక్షంగా శాస్త్రజ్ఞులు చెపుతున్నారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ వృక్షం తన శాఖ ముక్కలు నుండి పునరుత్పత్తి గాని, పండ్లు గాని ఉత్పత్తి చేయదు మరి. 

 ప్రపంచంలోని ఏ ఇతర చెట్టుకు లేని ప్రత్యేకత ఈ వృక్షానికి ఉండటం గమనార్హం. ఇంకా ఈ చెట్టు విశిష్టతను చూస్తే దిగువ భాగంలో ఈ చెట్టు ఆకులు చేతి ఐదు వేళ్ళను పోలి ఉంటాయి. పైభాగాన ఉండే ఆకులు ఏడు భాగాలుగా ఉంటాయి. పుష్పాలు చాలా అందంగా బంగారు రంగు - తెలుపు రంగులో కలిసి చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. 

బారాబంకి లో కల పారిజాత వృక్షం ప్రపంచంలోని మొదటిది. ఇది ఏక లింగ పురుష చెట్టు. ఇది పండ్లు లేదా విత్తనాలు ఉత్పత్తి చేయలేదు. ఈ చెట్టు 5000 సంవత్సరాల నాటిదని చెపుతారు. జూన్-జూలై నెలల్లో వికసిస్తుండే ఈ వృక్షం మరో విశేషం ఏమిటో తెలుసా దీని ఆకులు కానీ, శాఖలు కానీ ఎండిపోయి రాలవు. ఒకవేళ ఎండిపోతే అలాగే కుంచించుకుపోయి కాండంలో కలిసిపోతాయి. ఇదే పారిజాతం వృక్షం యొక్క గొప్పతనం.

ఇక్కడ కృష్ణాస్టమి పండుగ మరియు శ్రీకృష్ణునికి సంబంధించిన అన్ని పండుగలను ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. ఇక్కడివారు 

ఎలా చేరుకోవాలి:
విమాన ప్రయాణం ద్వారా: లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బారాబంకీ 45 కిలోమీటర్ల దూరంలో ఉంది.

రైలు ప్రయాణం ద్వారా: బారాబంకి జిల్లాలోని భుద్వాల్ జెఎన్ రైల్వే స్టేషన్ నుండి బారాబంకీ 3 కిలోమీటర్ల దూరంలో ఉంది, మరియు కింటూర్ గ్రామం అక్కడి నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది.

రోడ్డు మార్గం ద్వారా: కింటూర్ గ్రామానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న బారాబంకి జిల్లాలోని రామ్‌నగర్ పట్టణం. రామ్‌నగర్ పట్టణానికి చేరుకోవడానికి ఉత్తర ప్రదేశ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ యొక్క బస్సులు అందుబాటులో ఉన్నాయి. రామ్‌నగర్ టౌన్ నుండి స్థానిక రవాణా త్రీ వీలర్, జీప్ మొదలైనవి ఉదయం 6.00 నుండి సాయంత్రం 7.00 వరకు అందుబాటులో ఉన్నాయి.

సర్వేజనా సుఖినోభవంతు 
🙏😊

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS