కొత్తగా వ్యాపారం పెట్టిన వారు.. లాభాల బాటలో పయనించేందుకు కొన్ని పనులను చేయాలి.
ఎవరైతే మహాలక్ష్మీ అనుగ్రహం అనునిత్యం కావాలని కోరుకుంటారో.. ఆ దేవత తమ ఇంట నివాసం ఉండాలని ఎవరైతే భావిస్తారో.. వారంతా శుక్రవారం నాడు ఐశ్వర్య కాళీ దీపం వెలిగించాలి.
ఇలా చేయడం వల్ల తక్కువ వేతనంతో బాధపడుతున్న వారికి ఎక్కువ వేతనం లేదా పూర్తి జీతం వస్తుంది
అలాగే వ్యాపారులకు మెరుగైన లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.
అయితే ఈ ఐశ్వర్య కాళీ దీపాన్ని ఏ దిశలో పెట్టాలి. ఎలా పెట్టాలి.. ఏయే సమయాల్లో పెడితే మీకు శుభప్రదంగా ఉంటుంది.. అలాగే పూజ గదిలో క్రమం తప్పకుండా వేటిని మార్చాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఐశ్వర్య దీపం అంటే..
ఉప్పుతో పెట్టే దీపాన్ని ఐశ్వర్య దీపం అంటారు. ఈ దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వారి ఇంట సకల దోషాలన్నీ తొలగిపోయి శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
ఐశ్వర్య కాళీ ఫొటో..
ఎవరైతే అనారోగ్య వాతావరణంతో బాధపడుతున్నారో.. ఎవరి ఇల్లు అయితే కళావిహీనంగా ఉందో.. ఎవరెవరు కార్యాలయంలో సమస్యల గురించి బాధపడుతున్నారో అవన్నీ తొలగిపోయేందుకు భోజపత్ర యంత్ర యుక్తమైన గోమాత, పంచభూత, శక్తి పీఠ యంత్ర సహిత ఐశ్వర్య కాళీ పాదుకలను ఉన్న ఫొటో ఉంచితే.. అక్కడ దోషాలన్నీ తొలగిపోయి.. శుభాలు ప్రారంభమవుతాయి.
సిరి సంపదలు పెరిగేందుకు..
ఎవరి ఇంట లేదా కార్యాలయంలో సిరి సంపదలు పెరగాలని కోరుకుంటారో.. అలాంటి వారు ఐశ్వర్య దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల సిరి సంపదలకు కొరత అనేదే ఉండదని పండితులు చెబుతున్నారు.
ఎలా వెలిగించాలంటే..
ముందుగా ఓ ఇత్తడి ప్లేటును తీసుకోవాలి.
వెడల్పుగా ఉండే రెండు ప్రమిదలను తీసుకోవాలి.
శుక్రవారం నాడు ఉదయాన్నే రాళ్ల ఉప్పును తీసుకోవాలి.
కలకండ, అక్షింతలు సిద్ధం చేసుకుని, పువ్వులు పూజకు సిద్ధం చేసుకోవాలి. వాటితో పాటు చిన్న బెల్లం ముక్క.. రెండు అరటిపండ్లు, తాంబూలం కూడా సిద్ధం చేసుకోవాలి.
పూజ గదిలో..
పూజకు ముందు ఇంటిని మొత్తం శుభ్రం చేసుకుని, పూజ గదిలో లక్ష్మీదేవి ఫొటో లేదా ప్రతిమను శుభ్రం చేసుకున్న తర్వాత, చందనంతో కలిపిన పసుపుతో బొట్లు పెట్టుకోవాలి. బియ్యం పిండి, పసుపు, కుంకుమతో కలిపి ముగ్గులను వేయాలి. ఆ తర్వాత ఇత్తడి ప్లేటును తీసుకుని, అందులో పెద్దదైన ఓ ప్రమిదలో రాళ్ల ఉప్పును నింపుకోవాలి. ఆ ప్రమిదపై అక్షింతలు, కలకండ నింపిన ప్రమిదలను ఉంచాలి. దానిపై నెయ్యి లేదా నువ్వుల నూనెనుతో దీపాన్ని వెలిగించాలి.
ప్రతి శుక్రవారం..
ఈ దీపాన్ని ప్రతి శుక్రవారం నాడు సూర్యోదయానికి ముందు లేదా సూర్యోదయం తర్వాత వెలిగించాలి. ఆ దీపం వెలిగించినప్పుడు శ్లోకాన్ని చదువుకోవాలి. పండ్లు లేదా పాలు, పటిక బెల్లం, కొబ్బరికాయ ఏదైనా నైవేద్యంగా పెట్టి లక్ష్మీ వేంకటేశ్వరస్వామి స్త్రోత్రం చదువుకోవాలి. అలాగే కనకధార స్తోత్రం కూడా చదివితే శుభప్రదంగా ఉంటుంది. ఇలా 11 శుక్రవారాలు లేదా 16 శుక్రవారాలు లేదా 41 శుక్రవారాలు సంకల్పంగా చేసుకుని ఇంట్లో ఐశ్వర్యదీపం వెలిగించాలి. ఈ ఉప్పు దీపం ఈశాన్య భాగంలో పెట్టడం వల్ల మంచి ఫలితం వస్తుంది. శుక్రవారం ఇలా దీపారాధన చేశాక తర్వాతి రోజు అంటే శనివారం రోజు ఆ ప్రమిదలను ఉప్పును నీటిలో కలపాలి లేదా ఎవ్వరు తొక్కని ప్రదేశంలో వేయాలి. లేదా పారే నీళ్లలో వేయొచ్చు. ఆ తర్వాత ఆవుకు అరటిపండ్లు,
తోటకూర లేదా గడ్డిని పెట్టి మూడు ప్రదక్షిణలు చేయాలి.
No comments:
Post a Comment