Monday, January 31, 2022

కుజ గ్రహ దోషానికి సాధారణ పరిహారములు

 సాధారణంగా  కుజదోషం అంటే చాలామంది భయపడుతూ ఉంటారు.


కుజ దోషంగా చెప్పబడే స్థానాలు..లగ్నం, రెండవ ఇంట, నాలుగవ ఇంట, ఏడవ ఇంట, ఎనిమిదవ ఇంట, పన్నెండవ ఇంట  కుజుడు ఉండకూడదు.వివాహ సమయంలో వధూవరుల జాతకాలు పరిశీలించి, జాతక పొంతనలు చూసి వివాహము చేయాలి. అలా చేయనిచో భార్య,భర్తల అన్యోన్యత లోపించుట, తరచుగా కలహాలు, భర్తకు నీచ సంబంధము లుండుట, దాంపత్య సుఖము లోపించుట, భర్త నిర్వహించవలసిన బాధ్యతలకు దూరంగా సన్యాసి మనస్తత్వము కలిగి ఉండుట,సంతాన హీనత , ఇళ్ళు సంసారంలో అనేక లోపాలు ఉంటాయి కాబట్టి కుజ దోషం గురించి వివాహపొతనలలో తరచి చూడటం జరుగుతుంది. ఏయే గ్రహాలతో ఉంటే ఏయే ఫలితాలోకూడా చెప్పబడింది

వీటి గురించి అనేక పరిహారాలు శాస్త్రం నందు చెప్పబడినాయి. కావున భయపడవలసిన అవసరం లేదు.ఈ పరిహారక క్రియలు సమస్య యొక్క స్వరూపం బట్టి, జాతక పరిశీలన చేసిన తరువాత చేయ వలసి ఉంటుంది. ఈ పరిహారాలు అందరికి ఒకలాగేనే ఉండవు. ఈ పరిహారాలు ఎవరికీ వారు ఆచరిస్తేనే మంచిది. వ్యక్తి చేయలేని పరిస్తితిలో ఇంకా ఎవరైనా చేయవచ్చు. పరిహర క్రియ ఏదైనా మనస్సు కేంద్రీకరించటం, నమ్మకము, విశ్వాము, భగవంతునికి సంపూర్ణ సమర్పణ  ఉండాలి. భగవంతుడే ఈ క్రియలు జరుపుతున్నడన్న భావన రావాలి. ఎవరికీ ఏది వీలు అయితే దాని ఆచరించచ్చు జాతకంలో కుజ  గ్రహము బలహీనంగా ఉన్నప్పుడు  కుజగ్రహ దోష శాంతి విధానాలు చెప్పబడినాయి.  


కుజ గ్రహ దోషానికి సాధారణ పరిహారములు


సింధూర వర్ణ ఆంజనేయ స్వామికి ఏడు మంగళ వారములు ప్రదక్షిణలు చేయాలి.

ఎర్రని పుష్పాల మాల సుబ్రహ్మణ్య, ఆంజనేయ స్వామి గుడిలో స్వామికి అలంకరించాలి.

బెల్లం కలిపిన ఎర్రని కందిపప్పు కొద్దిగా  గోవుకు తినిపించాలి.

మంగళవారము రోజున ఎర్రని కుక్కకు ఆహారం వేయాలి.

స్త్రీలు ఏడు మంగళవారాలు ఏడుగురు ముతైదువులకు ఎర్రని పూలు , ఎర్ర జాకెట్, ఎర్ర గాజులు, దానం చేయాలి. ఎర్ర చందనం, కందులు, దానిమ్మ పండ్లు ఎర్రవస్త్రాలలో కట్టి సుబ్రహ్మణ్య స్వామి గుడిలో దానం ఇవ్వాలి.

కోతులకు తీపి పదార్థములు తినిపించాలి.

రాగి పాత్రలో నీరు తాగటం, రాగి పాత్రలు వాడటం మంచిది.

పోట్లకాయలు తరగటం, మంచిది కాదు.

రక్త దానము చేయుట చాల మంచిది.

అమ్మవారికి (దుర్గ) ఎర్ర చీర సమర్పించటం, నవగ్రహ గుడిలో కుజ విగ్రహం వద్ద ఎర్రపులతో పూజ పగడ దానం, ఎర్రరవికలగుడ్డ దానం మంచిది.

కుజుని అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్య స్వామికి ఉపవాసం ఉంది, కంది పప్పుతో చేసిన పదార్ధాలు తినాలి.

రాగిపళ్ళెంలో కందులు, కందిపప్పు పోసి దక్షిణ తాంబూలంతో మంగళవారం  దానం చేయాలి.

కుజగ్రహం వలన  కలిగే రోగములకు ఎర్రటి కుండలో అన్నం వండి, ఎర్రవస్త్రంలో మూట కట్టి, దాని మీద దీపం వెలిగించి రోగికి దిష్టి తీసి కుక్కలకు అన్నం పెట్టుట ద్వారా నయం అవుతుంది. కాని డాక్టర్ దగ్గర మందులు మానేయ కూడదు.

కుజుడు అన్నదమ్ములకు కారకుడుగా చెప్తారు, మూడవ ఇంట్లో ఉంటె ఎన్నో చిక్కులు వస్తాయి. ఏనుగు దంతం వస్తువు ఇంట్లో దక్షిణం పక్క ఉంచి కుజుని ఆరాధించాలి.

ఏడు, ఎనిమిది స్థానాలలో కుజుడు ఉంటె డబ్బు ఉన్న సుఖము ఉండదు, అందుకని ఏడు మంగళ వారాలు తల స్నానం చేసి దక్షిణ దిశలో మూడు వత్తుల దీపం వెలిగించి సాయంకాలం  కుజ స్తోత్రము, సుబ్రహ్మణ్య పారాయణం చేయాలి, ఉపవాసం ఉండి కందిపప్పుతో తాయారు చేసిన ఆహారము తీసుకుంటే భార్యా భర్తలు  సంతోషంగా ఉంటారు, సమయానికి డబ్బు అందుతుంది.

కుజుని వలన స్వర పేటికకు సంబంధించిన వ్యాధులు వ్దస్తే మంగళ వారం, క్రుత్హిక నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించి గంట, దీప దానము చేసిన సమస్య తొలగే అవకాశం కలదు.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS