Sunday, January 16, 2022

వ్యక్తులతో, శక్తితో అనుకూలత కోసం..

 వ్యక్తులతో, శక్తితో అనుకూలత కోసం.. శ్రీ సర్వ ప్రియంకర్యై నమః*



ప్రాతర్వదామి లలితే తవ పుణ్య నామ

కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి

శ్రీ శాంభవీతి జగతాం జననీ పరేతి

వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి ॥

- లలితా పంచరత్నం


ఈ లోకంలో జన్మించిన ప్రతివారూ తమ చుట్టూ ఉన్నవారితో అనుకూలతను సాధించుకోవాలి.


 అన్నిటికన్నా ముఖ్యంగా మన దేహంతో పరిపూర్ణమైన అనుకూలత కావాలి. 


మన ఆప్తబంధువులైన అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, రక్త సంబంధీకులు, భార్య, భర్త, సంతానం అందరితోనూ అనుకూలత ఉండాలి.


 చుట్టూ ఉన్న సమాజంతోనూ అనుకూలత ఉండాలి. తాము పని చేస్తున్న ఉద్యోగంతో అనుకూలత ఉండాలి. అక్కడ పనిచేసే వారంతా మనవారుగా మారాలి. 


ఎల్పప్పుడూ ఆనందంగా, సంతోషంగా, సంతృప్తిగా ఉండాలంటే చుట్టూ ఉన్న ప్రకృతితో, వ్యక్తులతో అనుకూలత ఉండాలి. 


మనలోని కణాలలోనూ, మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనూ, మనతోపాటు జీవించే జీవులలోనూ, వ్యక్తులలోనూ అమ్మవారిని దర్శించడం అలవాటు చేసుకున్న వారికి ఈ ఇబ్బంది ఉండదు.


 ముందుగా ప్రకృతి, తర్వాత వ్యక్తుల అందరి సహకారం మనకు పరిపూర్ణంగా కలుగుతూనే ఉంటుంది. 


ఈ కాలంలో మనం కోల్పోతున్న ఈ సంతృప్తిని సాధించుకోవడానికి లలితా త్రిపురసుందరీ మాతను ‘ఓం సర్వ ప్రియంకర్యై నమః’ అనే మంత్రంతో ఉపాసిస్తుంటే అన్ని రకాల ఐశ్వర్యాలు, ఆనందాలు మనకు లభిస్తూనే ఉంటాయి. 


ఈ మంత్రాన్ని ప్రతి రోజూ ఒక గంట జపించడమే కాకుండా, ఎవరు మనకు కనిపించినా వారిలోనూ అమ్మవారిని దర్శిస్తూ ఈ జపాన్ని చేస్తుంటే వారంతా మనకు అనుకూలంగా మారుతారు.


 మన ఉద్యోగాలు, వ్యాపారాలన్నీ ఈ భావనవల్ల విస్తరిస్తాయనడంలోనూ సందేహం లేదు.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS