Sunday, January 9, 2022

ఈ దైనందిన జీవితంలో సామాన్య మానవుల సకల సమస్యలకు పరిష్కారమేంటి? " అని ధర్మరాజు అడిగిన ప్రశ్నకు.. భీష్మపితామహులు మానవ జాతికి ఉపదేశించిన స్తోత్రమే శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం.

 ఈ దైనందిన జీవితంలో సామాన్య మానవుల సకల సమస్యలకు పరిష్కారమేంటి? " అని ధర్మరాజు అడిగిన ప్రశ్నకు.. భీష్మపితామహులు  మానవ జాతికి ఉపదేశించిన స్తోత్రమే శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం.

అత్యంత శక్తివంతమైన శ్లోకాలవి. ఒక్కో శ్లోకంలో ఒక్కో సందర్భానికి తగినట్లుగా.. ఒక్కో సమస్యను పరిష్కరించే శక్తి దాగివుంది. 

అందుకే  ప్రపంచదేశాలలో సైతం  ఈనాడు జాతి, మత, భాషలకు అతీతంగా శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం నేర్పిస్తున్నారు.. పఠిస్తున్నారు.

కాబట్టి సమస్యల పరిష్కారానికి, అభీష్ట సిద్ధికి (కోరిక నెరవేరుటకు) విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనం చాలా శ్రేయస్కరము. ఎవరి కోరికనను అనుసరించి వారు ఈ క్రింద సూచించిన శ్లోకములను 108 మార్లు  జపించవలెను. పిల్లల క్షేమార్థము తల్లిదండ్రులు జపము చేయవచ్చును:

1. విద్యాభివృద్ధికి: (14 వ శ్లోకం)

----------------------------------------

సర్వగః సర్వ విద్భానుర్ విష్వక్సేనో జనార్దనః ౹

వేదోవేద విదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ౹౹

2. ఉదర రోగ నివృత్తికి: (16 వ శ్లోకం)

----------------------------------------

భ్రాజిష్ణుర్ భోజనం భోక్తా సహిష్ణుర్ జగదాదిజః ౹

అనఘో విజయోజేతా విశ్వయోనిః పునర్వసుః౹౹

3. ఉత్సాహమునకు: (18 వ శ్లోకం)

----------------------------------------

వేద్యోవైద్యః సదాయోగీ వీరహా మాధవో మధుః ౹

అతీంద్రియో మహామాయో మహోత్సాహోమహాబలః౹౹

4. మేధాసంపత్తికి: (19 వ శ్లోకం)

----------------------------------------

మహాబుధ్ధి ర్మహావీర్యో మహాశక్తి ర్మహాద్యుతిః ౹

అనిర్దేశ్యవపుః శ్రీమానమేయాత్మా మహాద్రిధృక్ ౹౹

5. కంటి చూపునకు: (24 వ శ్లోకం)

----------------------------------------

అగ్రణీర్ గ్రామణీః శ్రీమాన్ న్యాయోనేతా సమీరణః ౹

సహస్రమూర్థావిశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్౹౹

6. కోరికలీరేడుటకు: (27 వ శ్లోకం)

----------------------------------------

అసంఖ్యేయో2ప్రమేయాత్మా విశిష్టః శిష్టకృత్శుచిః౹

సిద్ధార్థః సిధ్ధ సంకల్పః సిద్ధిదః సిధ్ధిసాధనః ౹౹

7. వివాహ ప్రాప్తికి: (32 వ శ్లోకం)

----------------------------------------

భూతభవ్య భవన్నాథః పవనః పావనో2నలః ౹

కామహాకామకృత్కాన్తః కామః కామప్రదః ప్రభుః ౹౹

8. అభివృద్ధికి: (42 వ శ్లోకం)

----------------------------------------

వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదోధృవః౹

పరర్థిః పరమ స్పష్ట: తుష్ట: పుష్టః శుభేక్షణః ౹౹

9. మరణ భీతి తొలగుటకు: (44 వ శ్లోకం)

----------------------------------------

వైకుంఠ: పురుషః ప్రాణః   ప్రాణదః ప్రణవః పృథుః ౹

హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజః ౹౹

10. కుటుంబ ధనాభివృద్ధికి: (46 వ శ్లోకం)

----------------------------------------

విస్తారః స్థావరఃస్థాణుః ప్రమాణం బీజమవ్యయం ౹

అర్థో2నర్థో మహాకోశో మహాభోగో మహాధనః ౹౹

 11. జ్ఞానాభివృద్ధికి: (48 వ శ్లోకం)

----------------------------------------

యజ్ఞఇజ్యో మహేజ్యశ్చః క్రతుస్సత్రం సతాంగతిః ౹

సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం ౹౹

12. క్షేమాభివృధ్ధికి: (64 వ శ్లోకం)

----------------------------------------

అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమ కృచ్ఛివః ౹

శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాంవరః ౹౹

13. నిరంతర దైవ చింతనకు: (65 వ శ్లోకం)

----------------------------------------

శ్రీదః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః ౹

శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ౹౹

14. దుఃఖ నివారణకు: (67 వ శ్లోకం)

----------------------------------------

ఉదీర్ణ స్సర్వతశ్చక్షు రనీశః శాశ్వత స్థిరః ౹

భూశయో భూషణోభూతి ర్విశోకః శోకనాశనః ౹౹

15. జన్మ రాహిత్యమునకు: (75 వ శ్లోకం)

----------------------------------------

సద్గతి స్సత్కృతి స్సత్తా సద్భూతి స్సత్పరాయణః ౹

శూరసేనోయదుశ్రేష్ఠ స్సన్నివాసఃసుయామునః౹౹

 16. శత్రువుల జయించుటకు:(88 వ శ్లోకం)

----------------------------------------

సులభస్సువ్రతః సిద్ధశ్శత్రుజిత్ శత్రు తాపనః ౹

న్యగ్రోధోదుంబరో2శ్వత్ఠ శ్చాణూరాంధ్ర నిషూధనః౹౹

17. భయ నాశనముకు: (89 వ శ్లోకం)

----------------------------------------

సహస్రార్చి స్సప్తజిహ్వ స్సప్తైధా స్సప్తవాహనః |

అమూర్తి రణఘో2చింత్యో భయకృత్ భయ నాశనః ||

18. మంగళ ప్రాప్తికి: (96 వ శ్లోకం)

----------------------------------------

సనాత్ సనాతనతమః కపిలః కపి రవ్యయః ౹

స్వస్తిదఃస్వస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః౹౹

19. ఆపదలు తొలగుటకు, లోక కల్యాణమునకు: (97,98 శ్లోకాలు)

----------------------------------------

అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః ౹

శబ్దాదిగః శబ్దసహః శిశిరః శర్వరీ కరః ౹౹

అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః ౹

విద్వత్తమో వీతభయః పుణ్యః  శ్రవణ కీర్తనః ౹౹

20. దుస్వప్న నాశనమునకు:(99 వ శ్లోకం)

----------------------------------------

ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్స్వప్న నాశనః ౹

వీరహా రక్షణః సంతో జీవనః పర్యవస్తితః ౹౹

21. పాపక్షయమునకు

: (106 వ శ్లోకం)

----------------------------------------

ఆత్మయోనిస్స్వయం జాతో వైఖానః సామగాయనః ౹

దేవకీ నందనః స్రష్టా క్షితీశః పాపనాశనః ౹౹

*విష్ణు సహస్రనామాన్ని అనునిత్యం ఏడాది పాటు పఠిస్తే?

కష్టాలతో విసిగిపోయారా? 

విష్ణు సహస్రనామం చదవండి.. అంటున్నారు. ఆధ్యాత్మిక పండితులు. విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు నిష్ఠతో పఠించే వారికి ఎలాంటి ఇబ్బందులైనా తొలగిపోతాయి. కష్టనష్టాలు ఒక్కసారిగా మీదపడి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో విష్ణు సహస్ర నామపారాయణం అన్నింటికీ విరుగుడులా పనిచేస్తుందని వారు సూచిస్తున్నారు. 

అనునిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా కష్టాలు, వ్యాధులు తొలగిపోయి, అష్టైశ్వర్యాలు శుభాలు చేకూరుతాయి. విష్ణు సహస్రనామ పఠనం వలన పుణ్యరాశి పెరుగుతుందనీ.. ఉత్తమగతులు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. ఇంకా ఇంటి దేవతా పూజతో, ఇష్టదేవతా పూజతో కూడా ఇబ్బందులను తొలగించుకోవచ్చునని వారు సూచిస్తున్నారు. 

అయితే విష్ణు సహస్రనామాన్ని అనునిత్యం ఏడాది పాటు పఠించడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయంటే..?

1. అదృష్టం

2. ఆర్థిక ఇబ్బందులు వుండవు 

3. గృహంలో ఆహ్లాదకరమైన వాతావరణం 

4. కోరిన కోరికలు నెరవేరుతాయి

5. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది

విష్ణు సహస్రనామాన్ని పఠించే ముందు శుచిగా స్నానమాచరించడం చేయాలి. ఆపై పూజగదిలో కూర్చుని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. లేకుంటే వినడమైనా చేయాలి. ఈ విష్ణు సహస్ర నామం నుంచి వెలువడే శబ్ధం దుష్ట ప్రభావాన్ని దూరం చేస్తుంది.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS