Thursday, January 11, 2024

శ్రీ మేధా దక్షిణామూర్తి రూపు ఉన్నత విద్య కొరకు, పిల్లలకు చదువు పట్ల ఆసక్తి, జ్ఞాపకశక్తి పెరిగి పరీక్షలలో విజయం చేకూర్చే శ్రీ మేధా దక్షిణామూర్తి

#శ్రీ మేధా దక్షిణామూర్తి రూపు ఉన్నత విద్య కొరకు, పిల్లలకు చదువు పట్ల ఆసక్తి, జ్ఞాపకశక్తి పెరిగి పరీక్షలలో విజయం చేకూర్చే శ్రీ మేధా దక్షిణామూర్తి రూపు


#శివ జ్ఞాన స్వరూపుడు మేధా దక్షిణామూర్తి, 
#విష్ణు జ్ఞాన స్వరూపుడు హయగ్రీవుడు. 
వీరిద్దరూ జ్ఞాన స్వరూపులే. జ్ఞాన ప్రదాతలే

#ఇక విద్యల గురించి వేరే చెప్పనక్క ర్లేదు. దక్షిణామూర్తి స్తోత్రం గురు గ్రహ అనుగ్రహాన్ని కూడా కలిగిస్తుందని పెద్దలు చెబుతారు

#గురవే సర్వలోకానాం 
భిషజే భవ రోగిణాం
నిధయే సర్వ విద్యానాం 
శ్రీ దక్షిణామూర్తయేనమ:

#అన్నిలోకాలకూ గురువు సంసారమనే రోగంతో బాధపడుతుతన్న వారికి వైద్యుడు, అన్ని విద్యలకూ నిధి అయిన శ్రీదక్షిణామూర్తికి నమస్కారమని దీని అర్థం

#శివుని గురు స్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సంప్రదాయం 

#దక్షిణ అంటే సమర్థత అని అర్ధం. దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం. అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఖాలన్నీ తొలగిపోయాయి. దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేది దయాదాక్షిణ్యం

 #ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే ఆ రూపమే దక్షిణామూర్తి

#మహర్షులు దర్శించిన దక్షిణామూర్తులు అనేక రకాలు. మొట్టమొదట బ్రహ్మకు దర్శనమిచ్చారు దక్షిణామూర్తి

 #ఆ తర్వాత వశిష్టునకు, సనకసనందనాదులకు కూడా సాక్షాత్కరించారు దక్షిణామూర్తి

#దక్షిణామూర్తిని ఉపాసించేవారికి బుద్ధి వికసిస్తుంది

#అందుకే దక్షిణామూర్తిని పూజించమని విద్యార్ధులకు ప్రత్యేకంగా చెప్తారు. #విష్ణు, బ్రహ్మ, సూర్య, స్కంద, ఇంద్ర తదితరులు దక్షిణామూర్తిని ఉపాసించి గురుత్వాన్ని పొందారు

#మంత్రశాస్త్రం అనేక దక్షిణామూర్తులను ప్రస్తావించింది

ఆ రూపాలు వరుసగా….

శుద్ధ దక్షిణామూర్తి, 
మేధా దక్షిణామూర్తి,
 విద్యా దక్షిణామూర్తి, 
లక్ష్మీ దక్షిణామూర్తి, 
వాగీశ్వర దక్షిణామూర్తి, 
వటమూల నివాస దక్షిణామూర్తి, 
సాంబ దక్షిణామూర్తి¸
హంస దక్షిణామూర్తి, 
లకుట దక్షిణామూర్తి, 
చిదంబర దక్షిణామూర్తి,
 వీర దక్షిణామూర్తి, 
వీరభద్ర దక్షిణామూర్తి¸ 
కీర్తి దక్షిణామూర్తి,
 బ్రహ్మ దక్షిణామూర్తి¸
 శక్తి దక్షిణామూర్తి,
 సిద్ధ దక్షిణామూర్తి.

#దక్షిణామూర్తులలో మేధా దక్షిణామూర్తి విద్యార్ధులకు చదువును ప్రసాదించగలడు

 #సరస్వతీదేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవాలు మేధా దక్షిణామూర్తి స్వామివారు మరియూ శ్రీ హాయగ్రీవ స్వామివారు

#మేధా దక్షిణామూర్తి చలవతో పిల్లలు చక్కటి విద్యావంతులై, జీవితంలో సుఖసంతోషాలను సొంతం చేసుకుంటారు.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS