Thursday, January 18, 2024

బంగారం ఎప్పుడు కొనాలి


        

బంగారం ఎప్పుడు కొనాలి


నిత్యజీవితంలో బంగారం లేకుండా ఏ శుభకార్యము జరగడం లేదు. సంపదను బంగారం రూపంలో కూడా పొదుపు చేస్తూ ఉంటారు. అటువంటి బంగారము ఏ రోజున కొనాలి ఏ రోజున కొనకూడదు అనే విషయం జ్యోతిష్య శాస్త్రంలో చాలా స్పష్టంగా వివరించబడింది. బంగారం బుధ గురు శుక్ర వారాలలో కొంటే మంచిది. గురువారం నాడు పుష్యమి నక్షత్రము వచ్చిన రోజున గురు పుష్య యోగము అంటారు ఈ రోజున బంగారం కొంటే అత్యంత వేగంగా బంగారం కొంటూ ఉంటారు. గృహంలో బంగారం పెరుగుతుంది అటువంటి అవకాశాలను ఈ యోగం ఇస్తుంది. గురు పుష్య యోగము నాడు కాకపోతే గురువారము గురు హోర లో బంగారం కొనవచ్చు గురువారం నాడు ఉదయం 6:00 నుండి 7:00 వరకు మధ్యాహ్నం ఒంటిగంట నుండి రెండు గంటల వరకు రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు ఉండే సమయాన్ని గురు హోర అంటారు. రాత్రిపూట బంగారం కొనడం అంత శ్రేయస్కరం కాదు కావున మధ్యాహ్నం ఒంటిగంట నుండి రెండు గంటల మధ్యలో బంగారం కొనడం మంచిది. అదేవిధంగా శుక్రవారం కూడా పై సమయాలు వర్తిస్తాయి. శుక్రవారం కూడా మధ్యాహ్నం ఒంటిగంట నుండి రెండు గంటల మధ్యలో బంగారం కొనడం చాలా మంచిది. శుక్రవారం నాడు పుబ్బ నక్షత్రం కానీ పూర్వాషాడ నక్షత్రం కానీ ఉన్నప్పుడు బంగారం కొంటే బంగారం ఎక్కువగా కొనే అవకాశం ఉంటుంది అనగా బంగారం గృహంలో అభివృద్ధి చెందుతుంది. బంగారం కొనకూడని రోజులు కూడా ఉన్నాయి శనివారం నాడు ఎటువంటి పరిస్థితులలోనూ కూడా బంగారం కొనరాదు ఒకవేళ తెలియక కొంటే ఆ బంగారం దొంగల పాలు అవ్వడం కానీ చేజారి పోవడం కానీ ఎల్లప్పుడూ తాకట్టులో ఉండి విడిపించుకోకపోవడం గానీ జరుగుతుంది. కావున శనివారం మరియు ఆదివారం  బంగారం కొనరాదు. బంగారం కొనే విషయంలో పై నియమాల పాటిస్తూ ఉంటే బంగారం అనే సంపద అనేక రెట్లు వృద్ధి చెందుతుంది.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS