Saturday, January 6, 2024

అరుణాచలం గిరి ప్రదక్షిణ

*అరుణాచలం గిరి ప్రదక్షిణ-1*


1) ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కానీ /చేశాక కానీ - కోరిక కోరు కోకూడడు
2) శివుడికి తెలుసు మనకు ఎప్పుడు ఏం ఇవ్వాలి అని
3) శివుడు మనకు కోటి రూపాయలు ఇవ్వాలని అనుకుంటాడు - మనం లక్ష  అడిగితే లాభం ఉండదు

4) 365 రోజులు - 24×7 ఎప్పుడైనా గిరి ప్రదక్షిణ చేయవచ్చు. 
5) పౌర్ణమి రోజున చేస్తే ఎక్కువ పుణ్యం అని ఉండదు.
6) గిరి ప్రదక్షిణ మౌనంగా /భక్తి పాటలు పాడుతూ/ భజన చేస్తూ /భక్తి కీర్తనలు పాడుతూ చేయవచ్చు
7) గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు - రాజకీయాలు /సినిమా ముచ్చట్లు /ఇతర ముచ్చట్లు పెడుతూ చేయవద్దు
8) మనం తిరిగేది - ఏదో ఒక కొండ చుట్టూ కాదు .. సాక్ష్యాత్తు పరమ శివుడి చుట్టూ
9) కనుక గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మర్రి చెట్టును కింద ధ్యానంలో ఉన్న దక్షిణామూర్తిని(శివుడిని) మనసులో పెట్టుకోవాలి.    *అరుణాచలం గిరి ప్రదక్షిణ-2*

10) గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎప్పుడూ రోడ్డుకు ఎడమ వైపు మాత్రమే నడవాలి
11) కుడి వైపు దేవతలు /సిద్ధ పురుషులు /మహా మహా యోగులు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు 
12) వారికి మనం అడ్డుగా నడవకూడదు
13) మనం గిరి ప్రదక్షిణ ఎక్కడ మొదలు పెడితే - అక్కడ పూర్తి చేయాలి
14) చాలా మెల్లగా మెల్లగా నడవాలి 
15) ఒక 9 నెలల గర్భిణి స్త్రీ నెత్తి మీద నీటి బింద పెట్టుకొని..నేల మీద నూనె ఉంటే 
16) అప్పుడు ఆమె ఎంత మెల్లగా నడుస్తుందో - మనం కూడా అంత మెల్లగా నడవాలి
17) భగవాన్ శ్రీ రమణ మహర్షి గిరి ప్రదక్షిణ 2-3 రోజులు చేసేవారు  
18) గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు - దారిలో కనిపించే వారికి ఏదో కొంత దానం చేస్తూ ఉండాలి
19) దారిలో శునకాలు /కోతులు కనబడితే వాటికి బిస్కట్లు /పండ్లు పెడుతూ ఉండాలి

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS