అయోధ్యను పరిపాలించిన మాంధాత నుంచి రఘువంశోత్తముడైన రాముడి వరకు అందరూ అతిరథమహారథులే. ప్రతి ఒక్కరూ అమోఘమైన ప్రతిభా సంపన్నులై ఒక్కొక్కరిదీ ఒక్కో బాట. అంతిమంగా ప్రజా సంక్షేమమే వారి ధ్యేయం.
మాంధాత రాజు అంటే ఇలా ఉండాలి. అన్నంత గొప్పగా పరిపాలించాడు. షట్చ క్రవర్తుల్లో ఒకడిగా పేరు పొందాడు.
త్రిశంకు మహారాజు: ఇతడి పేరు మీదు గానే త్రిశంకు స్వర్గం ఏర్పడింది.
హరిశ్చంద్ర మహారాజు: సత్యానికి ప్రతి
రూపం. విశ్వామిత్రుడి కిచ్చిన మాట కోసం కుటుంబాన్నీ త్యాగం చేశాడు.
నగర చక్రవర్తి: లోకంలో ధర్మాన్ని నెల
కొల్పాడు. సగరుడు చేసిన అశ్వమేధ యాగంలో భాగంగా అశ్వాన్ని వెతుకుతూ అతని కుమారులు భూమినంతా తవ్వే శారు. అలా ఏర్పడినవే సముద్రాలు. అందుకే వాటికి సాగరాలని పేరు.
దిలీపుడు: ప్రజలను తన కన్నబిడ్డల |
కన్నా మిన్నగా చూసుకున్నాడు. కామ ధేనువు కుమార్తె నందినీ ధేనువు అను గ్రహం పొందాడు. గోసేవ అంటే దిలీపుడులా చేయాలనేంతగా ప్రసిద్ధి పొందాడు.
భగీరథుడు: స్వర్గంనుంచి గంగను తీసుకువచ్చిన ఘనత పొందాడు.
అంబరీషుడు: వరమభాగవతోత్తముడు. విష్ణుభక్తితో జీవిత పర్యంతం ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు.
రఘుమహారాజు: అత్యంత తేజోవంతు
డైన రాజు, ఇతని పేరు మీదే రాముడి వంశానికి రవువంశమనే పేరు వచ్చింది.
దశరథుడు: పదిదిక్కుల్లో రథాన్ని నడిపే
శక్తి ఉన్నవాడు. దేవదానవ యుద్ధంలో దేవతలకు సాయంగా నిలబడ్డాడు. శ్రీరామచంద్రుడి తండ్రి.
శ్రీరాముడు: రఘుకులోత్తముడిగా పేరొం దాడు. రాజ్యపాలన అంటే రాముడిదే అన్నంత కీర్తి గడించాడు.
నరుడిగా అవతరించి, నారాయ ణుడిగా పూజలందుకుంటున్నాడు.
No comments:
Post a Comment