Saturday, January 13, 2024

ఆలస్య వివాహం

 ఆలస్య వివాహం


ప్రస్తుత కాలంలో అత్యధికులు ఎదుర్కొంటున్న సమస్య ఆలస్య వివాహం. కొందరి జాతకంలో వివాహ పరంగా ఎటువంటి సమస్యలు లేనప్పటికీ ఇంకా మంచి సంబంధం వస్తుంది చేద్దాం అని ఆలస్యం చేస్తూ ఉండడం ఒక కారణం. మరికొందరు జాతకాలలో వివాహం చేద్దామనుకున్నప్పటికీ జాతకరీత్యా వివాహం ఆలస్యం అవుతుంది. కొందరి జాతకాలలో సంబంధాలు వస్తూ ఉంటాయి కానీ సరైన సంబంధాలు రావు. వివాహం ఆలస్యంగా కావడానికి జాతక చక్రం నందు కొన్ని కారణాలు పరిశీలన చేయవచ్చు వివాహం కోసం కుటుంబ స్థానాన్ని కళత్ర స్థానాన్ని ముఖ్యంగా పరిశీలించాలి .ఈ స్థానాల్లో శని భగవానుడు లేదా కుజుడు రవి లేదా రాహువు కేతువులు ఉన్నప్పుడు వివాహాలు ఆలస్యం అవుతాయి. అష్టమ స్థానం నవమ స్థానం దశమ ఏకాదశ స్థానాలు కూడా వివాహం కోసం పరిశీలించాలి అష్టమ స్థానం యొక్క దృష్టి కుటుంబ స్థానంపై ఉన్నప్పుడు ఆలస్య వివాహం జరిగే అవకాశం ఉంది. కావున ఇది కూడా పరిగణలో తీసుకోవాలి. సప్తమాధిపతి దుస్థానాలైన 6 8 12 స్థానాల్లో ఉన్నప్పుడు కానీ సప్తమాధిపతి లేదా కుటుంబాధిపతి పాపార్గళం చెందినప్పుడు గానీ వివాహం ఆలస్యం అవుతుంది. గురు భగవానుడు, శని  భగవానుడు వక్రించినప్పుడు ఆలస్య వివాహం జరుగుతుంది. ముఖ్యంగా స్త్రీ జాతకంలో అష్టమ స్థానం పరిశీలించాలి దీనిని మాంగల్య స్థానం అంటారు. ముఖ్యంగా రెండు ఐదు ఏడు తొమ్మిది పది ఈ స్థానాలలో పాపగ్రహాలు స్థితి పొందినప్పుడు ఆలస్య వివాహం జరుగుతుంది. సప్తమాధిపతి నవమ స్థానంలో ఉన్నప్పుడు కూడా ఆలస్య వివాహం జరుగుతుంది. సప్తమ భావంలో రాహువు గాని కేతువు కానీ ఉన్నప్పుడు ఆలస్యవాహం కానీ లేదా వివాహ సంబంధాలు దగ్గరికి వచ్చి మిస్ అవుతూ ఉండడం గాని జరగవచ్చు. కుటుంబ స్థానంలో రాహువు శుక్ర భగవానుడు ఉన్నప్పుడు కూడా ఆలస్యవాహం జరుగుతాయి. సప్తమ స్థానంలో శని భగవానుడు ఉన్నప్పుడు కూడా ఆలస్యవాహం జరుగుతుంది. ఒక్కొక్కసారి జాతకంలో గ్రహాలు సరైన స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆలస్యవాహం జరుగుతుంది. కుజదోషం ఎక్కువగా ఆలస్యం చేయదు. జాతకంలో విష యోగం ఉంటే ఆలస్యం వివాహం జరుగుతుంది లేదా వివాహానంతరం అనేక సమస్యలు తీసుకొస్తుంది. కొన్ని జాతకాలకు సంబంధాలు వస్తూ ఉంటాయి కానీ తొందరగా ఒక నిర్ణయానికి రాలేకుండా ఎక్కువ కాలం పాటు వివాహ సంబంధమైన మాటలు మాట్లాడుతూ ఒక నిర్ణయానికి రాలేకపోతుంటారు. ఇటువంటి వాటికి చిన్న చిన్న పరిహారాలు ద్వారా సమస్యను పరిహారం చేసుకోవచ్చు. కొందరి జాతకం అయితే జాతక పరంగా దోషం ఉన్నప్పుడు 40 సంవత్సరాల వరకు వివాహం కాదు. మరికొన్ని జాతకాలు వివాహం కాకుండా మిగిలిపోతుంటారు. జీవితకాలం వివాహం కాకుండా మిగిలిపోయే జాతకాలు గురించి మరొకసారి చర్చిద్దాం. వివాహానికి సంబంధించిన గ్రహాలన్నీ సరైన స్థానంలో ఉన్నప్పుడు కూడా ఆ గ్రహాలు పాపగ్రహ నక్షత్రాలలో స్థితి పొందినప్పుడు కూడా వివాహం ఆలస్యం వంటి విషయాలు చాలా సూక్ష్మంగా పరిశీలించాలి. ఆలస్య వివాహం ఉన్నవారికి దోషం ఆధారంగా పరిహారం ఉంటుంది. కొందరి జాతకంలో చిన్న చిన్న దోషాలు ఉంటాయి ఇటువంటి జాతకులు ఎవరికి వారు చేసుకునే విధంగా డబ్బు ఖర్చు లేని చిన్న చిన్న పరిహారాలు కూడా ఉంటాయి. అటువంటి పరిహారాలు చేసుకున్నప్పుడు వెంటనే వివాహం అవుతుంది.వివాహం ఆలస్యం అవుతుంది అనుకున్న వారందరూ జాతక పరిశీలన చేసుకుని సరియైన పరిహారం చేసుకుంటే తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంది.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS