Thursday, December 23, 2021

శ్రీ దేవీ భాగవతంలో చెప్పబడిన కామ్యహోమ ద్రవ్యాలు

 శ్రీ దేవీ భాగవతంలో చెప్పబడిన కామ్యహోమ ద్రవ్యాలు


భగవాన్ వ్యాస మహర్షి రచించిన శ్రీ దేవీ భాగవతం సుప్రసిద్ధ పురాణ గ్రంధం ఇందులో 11వ స్కంధం 23.వ అధ్యాయంలో వివిధ రకాల కామ్యాలకు - కోరికలకు) ఏఏ ద్రవ్యాలతో హెూమం చేయాలో తెలియచేయబడింది. ఉపాసకులు ఇక్కడ తెలుపబోయే ద్రవ్యాలతో హోమాలు చేసుకుని ఇష్టకామ్య సిద్ధిని ఆశిస్తున్నాము. పొందగలరని ఆశిస్తున్నాము.

1.పాలు, పెరుగు, నెయ్యి - కన్యాలాభం, వరలాభం
పేలాలతో హోమం - వివాహం

 2 మారేడు సమిధలు, ఆకులు,కాయలు, వేర్లు, పూలు వీటితో హోమం  - ఐశ్వర్యం ప్రదం.

3. గరిక, పాలు, తేనె, పెరుగు, నెయ్యి -
అపమృత్యు నివారణ 

4. జిల్లేడు సమిధలతో హోమం - సర్వత్రా విజయం, కార్యసిద్ధి 

5. ఉప్పు, తేనెలతో హోమం - ఇష్ట జనవశీకరణ

6. ఎర్రకలువలు, జాజిపూలు, మల్లెపూలు - ఐశ్వర్యప్రదం

 7. పాలుగారె తిప్ప తీగతో హోమం - ఆయుర్వృద్ధి, సర్వరోగహారం

8. మామిడి చెట్టు సమిధలతో హోమం - జ్వరోగ హరం

9. వచ (వస)తో హోమం -- క్షయరోగ ఉపశమనం 

10. మేడిచెట్టు సమిధలతో హోమం - అతిమేహ రోగ హరం

11. చెరుకు, తేనెలతో హోమం - ప్రమేహ రోగ హరం

12. అన్నంతో హోమం -అన్న వృద్ధి

13. పాయసం, నెయ్యితో హోమం -సంతాన ప్రాప్తి

14. మోదుగ సమిధలతో హోమం - బ్రహ్మ వచ్చస్సు

15. నేతితో హోమం - బుద్ది శక్తి

16. పాలతో హోమం  - మేధా శక్తి

17. నువ్వులు, బియ్యంతో హోమం - ఐశ్వర్యం, వశీకరణ

కామ్యహెూమాన్ని పై తెలిపిన ద్రవ్యాలతో కనీసం 10,000 సార్లు చెయ్యాలి

🌹శ్రీ మాత్రే నమః🌹

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS