*మహిమాన్విత క్షేత్రం అరుణాచలం*
పరమేశ్వరుడు అగ్నిలింగ రూపంలో వెలసిన అతి మహిమాన్విత క్షేత్రం తిరువణ్ణామలై అనబడే అరుణాచలం.
అనేక మహిమలు కలిగిన అరుణాచల గిరిని ప్రదక్షిణం చేయడం వలన కలిగే శుభ ఫలితాలు అనేకం.
సోమవారంనాడు ప్రదక్షిణలు
చేస్తే లోకాలను ఏలే శక్తి
లభిస్తుంది.
మంగళవారం ప్రదక్షిణం చేస్తే
పేదరికం తొలగిపోతుంది. సుభిక్షంగా వుంటారు. జనన మరణాల
చక్రం నుండి విముక్తి లభిస్తుంది. మహాత్ములు
శేషాద్రి స్వాములు వంటి సిధ్ధులు మంగళవారంనాడే గిరి ప్రదిక్షణలు చేసేవారు.
బుధవారం గిరి
ప్రదక్షిణం చేస్తే లలితకళలలో రాణింపు,
విజయం లభిస్తుంది.
గురువారం గురువారం
ప్రదక్షిణం చేస్తే ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది.
ప్రతి శుక్రవారం గిరి ప్రదక్షిణం చేస్తే వైకుంఠ ప్రాప్తి చేకూరుతుంది.
శనివారాలలో గిరి ప్రదక్షిణం చేస్తే
నవగ్రహాల కటాక్షం సిధ్ధిస్తుంది.
ఆదివారం నాడు అరుణాచలగిరి ప్రదిక్షణలు చేస్తే కైలాసప్రాప్తి కలుగుతుంది.
సంతానహీనులైన భార్యాభర్తలు 48 రోజులపాటు భక్తితో గిరి ప్రదక్షిణలు
చేస్తే సంతానభాగ్యం కలుగుతుంది.
గిరిని ప్రదక్షిణం చేయడానికి
వేసే మొదటి అడుగుతోనే
ముల్లోకాలు చుట్టివచ్చిన పుణ్య
ఫలం లభిస్తుంది.
రెండవ అడుగులో పవిత్ర తీర్ధాలలో స్నానం చేసిన
పుణ్యఫలం లభిస్తుంది.
మూడవ అడుగు వేయగానే అశ్వమేధ యాగం చేసిన
పుణ్యం లభిస్తుంది.
నాలుగవ అడుగు వేయగానే
అష్టాంగ యోగం చేసిన
ఫలితం లభిస్తుంది.
తిరువణ్ణామలైలో జరిగే
కార్తీక దీపోత్సవం నాడు
ఐదు సార్లు గిరికి ప్రదక్షిణలు
చేసి వస్తే పాప విమోచనం
లభిస్తుంది.
భరణీ దీపం రోజున ప్రాతఃకాలమున మూడున్నర
ఘంటలకు ఒక సారి,
ఏడు గంటలకు ఒకసారి, పగలు 11 గంటలకు ఒకసారి సాయంకాలం
దీపదర్శన సమయాన ఒకసారి రాత్రి 11గం.లకు
ఒకసారి అని ఐదు సార్లు
గిరి ప్రదక్షిణలు చేస్తే
ఘోర పాపాలన్నీ హరిస్తాయి.
గిరి ప్రదక్షిణం చేసి రాగానే
స్నానం చేయడమో..
నిద్రపోవడమో చేయకూడదు.
వాటివల్ల పుణ్యఫలం
తగ్గి పాపం ఫలం కలుగుతుంది. భగవన్నామ స్మరణలోనే గడపాలి.
No comments:
Post a Comment