ప్రతీ దిశకు ఒక ప్రత్యేకత ఉంది. తూర్పు వైపు ఇంద్రుడు లేక శుక్రుడి స్థానం. దక్షిణం యముడు లేక పితృదేవతల స్థానం. పశ్చిమం వరుణుడు లేక ఋషి స్థానం. ఉత్తరం సోముడు లేదా కుభేరుడి స్థానం.
దీపం యొక్క వత్తిని తూర్పు వైపుకు పెట్టి దీపం వెలిగిస్తే, ఇంద్రుడు ప్రసన్నుడు అవుతాడు. శుక్రుడు కూడా ప్రసన్నుడు అవుతాడు. ఇలా చేయడం వల్ల మీకు సంపద,ఐశ్వర్యము,సమృద్ధి,మంచి నిద్ర కలుగుతాయి. దీపానికి స్వచ్ఛమైన ఆవునెయ్యి వాడడం మంచిది.
పితృ దీపం : దీపం ఒత్తి దక్షిణం వైపు ఉండేలా చేసి, మీరు దీపాన్ని వెలిగిస్తే యముడు ప్రత్యక్షం అవుతాడు. పితృ దేవతలు ప్రసన్నులు అవుతారు. ప్రమాదాలు తప్పిపోవడం, అప మృత్యు దోషాలు తప్పడం,మంచి ఆరోగ్యం చేకూరడం,కుటుంబంలో శాంతి సామరస్యాలు కలగడం జరుగుతాయి. దీనికి నువ్వుల నూనె వాడితే మంచిది.
ఋషి దీపం : పశ్చిమం వైపు వత్తి ఉండేలా చేసి, మీరు దీపాన్ని వెలిగిస్తే వరుణుడు ,ఋషులు ప్రసన్నులవుతారు. వ్యవసాయంలో సమృద్ధిగా గింజలు పండడం,మంచి వర్షాలు, మంచి జ్ఞానం,మంచి మేధస్సు, జ్ఞాపక శక్తి,మంచి ఆరోగ్యం ...శాంతి చేకూరతాయి.దీనికి నువ్వుల నూనె శ్రేష్టం.
కుబేర దీపం : దీపం యొక్క వత్తి ఉత్తరానికి ఉండేలా చేసి మీరు దీపాన్ని వెలిగిస్తే, సోముడు లేక కుబేరుడు ప్రసన్నులవుతారు. సంపద, వ్యాపారంలో విజయం, ప్రమోషన్లు, ఆఫీసులో విజయము, బంగారం , వజ్రాలు విరివిగా లౌకిక సంపదలు సమకూరుతాయి. దీనికై ఆవునేతిని వాడితే మంచిది.
పిల్లల మీద కోపం వచ్చినప్పుడు అప్రయత్నంగా కొన్ని మాటలు తల్లిదండ్రుల నోళ్ళ నుండి వెలువడుతాయి. ఉద్దేశపూర్వకంగా రానివే అయినా, పిల్లల శ్రేయస్సును దృష్టలో తీసుకొని చెప్పినవే అయినా,అవి శాపంగా పరిగణించబడతాయి.ఇవి కూడా ఒక రకమైన పితృ శాపాలు.
No comments:
Post a Comment