Sunday, December 12, 2021

ఏయే పనులకు ఏయే స్తోత్రాలు పఠిస్తే బాగుంటుంది ??

🕉 ఏయే పనులకు ఏయే స్తోత్రాలు పఠిస్తే బాగుంటుంది ??



👉 1. విష్ణు..లలితా.. సహస్రనామ స్తోత్రాలు. 
కుటుంబసభ్యుల మధ్య వున్న విభేదాలు, తగాదాలు, ఘర్షణలు తొలగిపోయి... అందరూ కలిసి మెలిసి సత్సంబంధాలుగా ఏర్పడేందుకు "విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామాల"ను నిత్యం పారాయణం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. 

విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజూ పఠిస్తే.. ఏ సమస్యలు తలెత్తవు. పైగా అన్ని పనులలో విజయాలను సాధిస్తారు.

👉 2.కనకధారా స్తోత్రం..!!

"కనకధార స్తోత్రం"ను ప్రతిరోజు చదివితే నిర్వహించుకున్న వ్యాపారంలో మంచి అభివృద్ధి లభించడంతోపాటు... నూతనంగా ఏర్పాటు చేసుకున్న వ్యాపారాలు కూడా మంచి విజయాలు సాధిస్తాయి.

👉 3.సూర్యాష్టకం.. ఆదిత్య హృదయం..!!

ప్రతిరోజూ "సూర్యాష్టకం, ఆదిత్య హృదయం" చదువుతూ.. "సూర్యధ్యానం" చేస్తే.. ఉద్యోగాలు చేస్తున్నవారికి మంచి పురోభివృద్ధి లభిస్తుంది. అలాగే ఉద్యోగాలు లేనివారిని మంచి అవకాశాలతోపాటు ఫలితాలు కూడా లభిస్తాయి.

👉4.‘లక్ష్మీ అష్టోత్ర శతనామావళి..

లక్ష్మీ అష్టోత్తర శతనామావళి"ని నిత్యం పారాయణం చేస్తే పిల్లలకు..మంచి సద్గుణాలతో కలిగినవారు వివాహ సంబంధాలు తీసుకువస్తారు. అలాగే పెళ్లి పనులు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా జరుగుతాయి.

👉5.నవగ్రహ స్తోత్రం..

నవగ్రహ స్తోత్రా"న్ని ప్రతిరోజు చదువుకుంటే.. ఋణబాధల నుంచి ఇబ్బందులు పడుతున్నవారు తక్షణమే వాటి నుంచి విముక్తి పొందుతారు. అంతేకాకుండా.. ధనానికి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు ఇక తలెత్తవు.

👉. 6. హాయగ్రీవ స్తోత్రం..సరస్వతి ద్వాదశ నామాలు.

విద్యార్థులు మంచి విద్యను పొందడానికి, చదువులో ఏకాగ్రతను పెంచుకోవడానికి ప్రతిరోజూ "హయగ్రీవ స్తోత్రం", "సరస్వతి ద్వాదశ నామాల"ను పఠించాలి.

👉 7. గోపాల స్తోత్రం..!!

సంతానం లేని వారు ప్రతిరోజు "గోపాల స్తోత్రం"ను పఠిస్తే.. మంచి ఫలితం లభిస్తుందని... అలాగే గర్భంతో వున్న వారు..ఇదే స్తోత్రాన్ని ప్రతిరోజు పఠిస్తే ప్రసవం సుఖంగా అవుతుందని పండితులు, శాస్త్రాన్ని ఆధారంగా చెబుతున్నారు.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS