Sunday, December 12, 2021

రాఘవేంద్ర స్వామి ఆరాధన

రాఘవేంద్ర స్వామి ఆరాధన 
మానవ కల్యాణానికి వెలసి, భక్తుల మనోరధాలను నెరవేరుస్తూ, భక్తులపాలిట కల్పవృక్షముగా, కామధేనువుగా, కీర్తించ బడుతున్న మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి మన భారత దేశములో జన్మించిన మహా పురుషులు, కారణ జన్ములలో ఒకరు.
వైష్ణవ కుటుంబంలో జన్మించి, వెంకటనాధుడుగా నామకరణం పొంది, మధ్వ పీఠాన్ని ఆధిరోహించి రాఘవేంద్ర తీర్థులు, రాఘవేంద్రస్వామి గా ప్రఖ్యాతి చెందారు..కృతయుగములో ప్రహ్లాదుడు కలియుగములో వ్యాసరాయలే రాఘవేంద్రులుగా అవతరించారు. అనతికాలంలోనే వేదాలను, అష్టాదశ పురాణాలను ఆపోసనపట్టి సాటిలేని మేధావిగా పేరుపొందారు.
*కుంభకోణంలో తన గురువైన సుంధీంద్ర యతికి శ్రీరామచంద్రులు కలలో కనిపించి వెంకటనాథుడు ఆయన వారసుడని తెలిపారు.* *శ్రీమూలరాముడు, పంచముఖ ప్రాణదేవరు (పంచముఖ ఆంజనేయస్వామి భక్తులు ) పంచముఖి గ్రామంలో తపస్సు చేసి హనుమంతుఁని దర్శనం పొందారు. మంత్రాలయములో మఠమును  స్థాపించారు. రాఘవేంద్రులు సంగీతంలో కూడా నిష్ణ్నాతులే.
 
*కనకదాసుడనే అనే హరిజనునికి ఎప్పుడూ తన వెంట ఉండే మూలరాముల విగ్రహాలకు పూజ చేయించి విముక్తిని ప్రసాదించారు.
 
తన భౌతిక జీవితం వంద సంవత్సరాలని, గ్రంథ జీవితం మూడువందల సంవత్సరాలని, బృందావన జీవితం ఏడు వందలు సంవత్సరాలని శ్రీ రాఘవేంద్రులు వివరించారు.* *దేశ పర్యటన గావించి, ఆంధ్ర ప్రదేశలో ఆదోని చేరారు శ్రీరాఘవేంద్రులు.*
*మృతిచెందిన బాలునికి ప్రాణం పోశారు.*
*అప్పటి ఆదోని నవాబు మూలరాముని అర్చించి నైవేద్యం సమర్పించమని ఒక బంగారు పళ్ళెం మూతవేసి పంపారు. నవాబు ఆంతర్యాన్ని గ్రహించిన స్వామి, దానిఫై మంత్ర జలం జల్లి మూతవేయమన్నారు. నవాబు పంపిన మాంసం ముక్కలు కాస్తా, సువాసనగల పువ్వులు, నోరూరించే ఫలాలుగా మారిపోయాయి.
నవాబు తన చర్యకు సిగ్గుపడి, రాఘవేంద్రులి కోరిక ప్రకారం మంచాల గ్రామాన్ని నజరానాగా సమర్పించాడు.
చివరగా తన జీవసమాధికి బృందావనాన్ని నిర్మించమని అదేశించారు రాఘవేంద్రులు. *అవసరమయిన రాతిని మాధవరంలోని ప్రత్యేక శిలనుండి సేకరించమని ఆదేశించారు.
 రాఘవేంద్రులు " ఆ శిలపై శ్రీరామచంద్రుడు ఏడు గడియలు కాలం విశ్రమించారని, అందువల్ల ఆ రాతితో నిర్మించిన ఆ పవిత్ర బృందావనం ఏడు వందలకాలం పూజింపబడుతుందని " వివరించారు.
శిష్యులు నిర్మించిన ఆ పవిత్ర బృందావనంలో ప్రవేశించారు భక్తులంతా స్వామి ఎడబాటు సహించలేక దుఃఖసాగరంలో మునిగిపోయారు.
నేటికి 350 సంవత్సరాల క్రితం సజీవ సమాధి అయిన ఆ పరమాత్మ ఆలయములో ప్రవేశించిన ప్రతి భక్తుడికి తన కటాక్షవీక్షణాలతో వీక్షిస్తుంటాడు.
నేడు అనగా శ్రావణ బహుళ విదియ.
శ్రీ రాఘవేంద్ర స్వామి వారి 350 వ ఆరాధన దినం.
పూజ్యాయ రాఘవేంద్రాయ
సత్య ధర్మ రతా యచ భజతాం కల్పవృక్షాయ నమతాం కామథేనవే.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS