☛ #పురశ్చరణ_అంటే :
ఏ మంత్రాన్నైనా #శాస్త్రోక్తంగా ఒక నియమిత పద్ధతిలో సాధన చేసే విధానాన్ని పురశ్చరణ అంటారు......
"జపము, హెూమము, తర్పణము, మార్జనం, బ్రాహ్మణ భోజనం ఇవి పరశ్చరణలోని #పంచాంగాలు........ ఈ ఐదు విధాలైన కర్మచేత మనం ఉపాసించే దేవత సంతోషించి #పురః = బిడ్డలమైన మన ముందు, #చరతి = సంచరిస్తుంది. కాబట్టి దీనికి పురశ్చరణ అనే పేరు వచ్చింది."
☛ #పురశ్చరణ_ఎందుకు..?
జీవంలేని దేహం ఎలాగైతే కార్యసాధనకి పనికి రాదో అలాగే పురశ్చరణ లేని మంత్రం కూడా నిరర్ధకమైనదని భావం. కాబట్టి దేవత మంత్రాన్ని పురశ్చరణ పూర్వకంగా ఉపాసిస్తేనే ఆ దేవత అనుగ్రహం మనకు లభిస్తుంది.
➤ #పురశ్చరణ_అంగాలు :
వివిధ మంత్రశాస్త్ర గ్రంథాలలో వివరించిన ప్రకారంగా ఏ మంత్రానికైనా..
❶ ఒక లక్ష సార్లు అనగా (108 సంఖ్య గల మాలతో 1000 మాలలు) మూల మంత్రాన్ని జపం చేయాలి..
❷ అందులో పదో వంతు అనగా 10 వేల సార్లు మూలమంత్రంతో హెూమం చేయాలి..
❸ హెూమ సంఖ్యలో పదోవంతు అనగా ఒక వెయ్యి సార్లు మూలమంత్రంతో తర్పణ చెయ్యాలి..
❹ తర్పణ సంఖ్యలో పదోవంతు. 100 సార్లు మూలమంత్రంతో మార్జన లేదా అభిషేకం చెయ్యాలి..
❺ అందులో పదో వంతు. 10 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఈ 5 పనులతో మంత్ర పురశ్చరణ పూర్తవుతుంది.
ఇంకా వివరంగా......
❶ #మంత్ర_జపం :
గురువు ఉద్దేశించిన దేవత మంత్రాన్ని పురశ్చరణలో భాగంగా నియమ పూర్వకంగా ఒక లక్షసార్లు (1000 మాలలు) జపించాలి. (మంత్ర మహోదధి ప్రకారం) ఈ 1 లక్ష జపాన్ని సాధకుని శక్త్యానుసారం 11-21-40 రోజులలో పూర్తి చేయవచ్చు.
❷ #మంత్ర_దేవత_దశాంశ_హెూమం :
ఒక లక్ష సార్లు జపం చేసిన తరువాత అందులో దశాంశం అనగా పదివేల సార్లు మూలమంత్రంతో హెూమాన్ని చేయాలి.
◆ #హెూమ_సంకల్పం :
మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ _ _ _ పరదేవతా ముద్దిస్య శ్రీ _ _ _ పరదేవతా ప్రీత్యర్ధం. శ్రీ _ _ _ మంత్ర పురశ్చరణాంగత్వేన శ్రీ _ _ _ మంత్ర హవనం కరిష్యే అని సంకల్పం చెప్పుకొని హెూమాన్ని ప్రారంభించాలి.
(హోమ విధానం ప్రత్యేకంగా తెలియచేయబడింది.)
◆ #సమర్పణ :
ఈ విధంగా మూలమంత్రంతో 10వేల సార్లు హెూమం చేసిన తరువాత చివరగా..
"అనేన మయాకృతేన శ్రీ _ _ _ మంత్ర హవనేన శ్రీ _ _ _ పరదేవతా సుప్రీతా సుప్రసన్నా వరదాభవతు. శ్రీ _ _ _ పరదేవతా ప్రీత్యర్థం ఏతత్ఫలం సర్వం శ్రీ _ _ _ పరదేవతా చరణారవిందార్పణమస్తు, తత్సద్భహ్మరణమస్తు.”
అని ఉద్దరిణతో నీళ్ళు హెూమకుండంలోకి వదలాలి. తరువాత హెూమ భస్మాన్ని నుదుట ధరించాలి.
❸ #మంత్ర_దేవత_తర్పణం :
జప దశాంశం హెూమాన్ని చేసిన తరువాత అదే మంత్రంతో హెూమ దశాంశం అనగా ఒక 1000సార్లు తర్పణ చేయాలి.
◆ #తర్పణ_సంకల్పం :
"మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ _ _ _ పరదేవతాముద్దిస్య శ్రీ _ _ _ పరదేవతా ప్రీత్యర్థం. శ్రీ _ _ _ మంత్ర పురశ్చరణాంగత్వేన శ్రీ _ _ _ మంత్ర తర్పణం కరిష్యే” అని సంకల్పం చెప్పుకొని తర్పణాన్ని ప్రారంభించాలి.
ఒక పళ్ళెంలో దేవత యంత్రాన్ని/విగ్రహాన్ని ఉంచి గంధ పుష్పాలతో అర్పించి కుంకుమ కలిపిన నీళ్ళతో లేదా పాలతో తర్పణం చెయ్యాలి.
◆ #తర్పణ_మంత్రం :(మూల మంత్రం చివర్లో)
_ _ _ పరదేవతాం తర్పయామినమః
◆ #తర్పణ_సమర్పణ :
"అనేన మయాకృతేన శ్రీ _ _ _ మంత్ర తర్పణేన శ్రీ _ _ _ పరదేవతా సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు. శ్రీ _ _ _ పరదేవతా ప్రీత్యర్థం ఏతత్ ఫలం సర్వం శ్రీ _ _ _ పరదేవతా చరణారవిందార్పణమస్తు, తత్సత్ప్రృహ్మరణమస్తు.”
అని ఉద్ధరిణతో నీళ్ళు ఒక పళ్ళెంలోకి వదలాలి. దీనితో తర్పణం పూర్తవుతుంది.
❹ #మంత్ర_దేవత_మార్జనం_లేదా_అభిషేకం :
ఇలా మంత్రంతో తర్పణ చేసిన తరువాత అందులో పదోవంతు అనగా 100 సార్లు మార్జనం లేదా అభిషేకం చేయాలి.
◆ #అభిషేక_సంకల్పం :
“మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ _ _ _ పరదేవతా ముద్దిస్య శ్రీ _ _ _ పరదేవతా ప్రీత్యర్ధం. శ్రీ _ _ _ మంత్ర పురశ్చరణాంగత్వేన శ్రీ _ _ _ మంత్ర అభిషేకం కరిష్యే.”
అని సంకల్పం చెప్పుకొని, ఒక పంచపాత్రలో పాలు లేదా కుంకుమ కలిపిన నీరు తీసుకుని వాటితో ఒక పెద్దపళ్ళెంలో దేవత విగ్రహాన్ని గానీ, యంత్రాన్ని గానీ ఉంచి వాటిపై పువ్వుతో గాని, ఉద్ధరిణతో గాని అభిషేకం చేయాలి.
◆ #అభిషేక_మంత్రం :(మూల మంత్రం చివర్లో)
_ _ _ పరదేవతాం అభిషించామి నమః
◆ #అభిషేక_సమర్పణ :
“అనేన మయాకృతేన శ్రీ _ _ _ మంత్ర అభిషేకేన శ్రీ _ _ _ పరదేవతా సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు. శ్రీ _ _ _ పరదేవతా ప్రీత్యర్థం ఏతత్ఫలం సర్వం శ్రీ _ _ _ పరదేవతా చరణారవిందార్పణమస్తు, తత్సద్భహ్మరణమస్తు.”
అని ఉద్ధరిణతో నీళ్ళు అరివేణం (ఒక పళ్ళెం)లోకి వదలాలి. దీనితో అభిషేకం పూర్తవుతుంది.
❺ #బ్రాహ్మణ_భోజనం :
పురశ్చరణలో భాగంగా 100 సార్లు అభిషేకం చేసిన తరువాత అందులో పదోవంతు అనగా 10 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి.
◆ #బ్రాహ్మణ_భోజన_సంకల్పం :
"మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ _ _ _ పరదేవతాముద్దిస్య శ్రీ _ _ _ పరదేవతా ప్రీత్యర్ధం. శ్రీ _ _ _ మూలమంత్ర పురశ్చరణాంగత్వేన బ్రాహ్మణ భోజనం (అన్న సంతర్పణం) కరిష్యే.”
అని సంకల్పం చెప్పుకొని 10 మందికి తృప్తిగా ఆదరంగా భోజనం పెట్టుకోవాలి. ఇది శాస్త్ర నియమమైనప్పటికీ, ఏ వర్ణం వారినైనా పది మందిని పిలిచి భోజనం పెట్టుకోవచ్చు.
◆ #బ్రాహ్మణ_భోజన_సమర్పణ :
ఈ విధంగా అన్న వితరణ చేసిన తరువాత
“అనేన మయాకృతేన శ్రీ _ _ _ మంత్ర పురశ్చరణాంగత్వేన అన్న సంతర్పణేన శ్రీ _ _ _ పరదేవతా సుప్రీతా సుప్రసన్నా వరదాభవతు. శ్రీ _ _ _ పరదేవతా ప్రీత్యర్థం ఏతత్ఫలం సర్వం శ్రీ _ _ _ పరదేవతా చరణారవిందార్పణమస్తు, తత్సద్భహ్మరణమస్తు."
అని ఉద్దరిణతో నీళ్ళు అరివేణం (ఒక పళ్ళెం)లోకి వదలాలి. అలా వదిలిన నీటిని 3 సార్లు తీర్థంగా స్వీకరించాలి.
దీనితో దేవత మంత్ర పురశ్చరణ పూర్తవుతుంది.....
➽ #పురశ్చరణ_చేయలేనివారికి :
ఇష్ట దేవతా పై అచంచలమైన భక్తి విశ్వాసాలు కలిగి వుండి పురశ్చరణ విధానాన్ని అనుసరించలేని వారికి కూడా ఒక మార్గం శాస్త్రంలో చెప్పబడింది.
∬ యది పూజాద్యశక్తశ్చే ద్రవ్యాభావేన సుందరి
కేవలం జపమాత్రేణ పురశ్చర్యా విధీయతే ∬
తగినంత శక్తి లేక పంచాంగ పూర్వకంగా పురశ్చరణ చేయలేని వారు అచంచలమైన భక్తితో ఇష్ట దేవతను మనసులో “అమ్మా/స్వామి నేను పురశ్చర్యను శాస్త్రోక్త పద్ధతిలో ఆచరించటానికి #అశక్తుడను, దయచేసి నాకు మంత్ర జపంతోనే మంత్రసిద్ధిని ప్రసాదించు" అని వేడుకుని జపాన్ని చేస్తే కేవలం జపంతోనే పూర్తి పురశ్చరణ ఫలం లభిస్తుంది.
గుర్తుంచుకోండి ఇది కేవలం #శక్తిలేని వారికి మాత్రమే. అవకాశం వుండీ, శక్తివున్న సాధకులు పంచాంగ పూర్వకంగానే పురశ్చరణ చేయాలి.
➽ #పురశ్చరణ_స్త్రీలు :
పురుషులు దేవత మంత్రాన్ని పురశ్చరణ పూర్వకంగా, పంచాంగ సహితంగా అనుష్ఠానం చేస్తేనే సంపూర్ణ ఫలితం లభిస్తుంది. అదే స్త్రీల విషయంలో పురశ్చరణ విషయమై మంత్ర శాస్త్రం వారికి కొంత #సౌలభ్యాన్ని ఇచ్చింది.
∬ నియమః పురుషే జ్ఞేయా న యోషిత్సు కదాచన
న న్యాసా యోషితాం చాత్ర న ధ్యానం న చ పూజనం
కేవలం జపమాత్రేణ మంత్రాః సిద్ధ్యన్తి యోసితామ్ ∬
మంత్ర పురశ్చరణ గురించి ఇంతకు ముందు చెప్పిన నియమాలన్నీ పురుషులకు మాత్రమే. న్యాసం, ధ్యానం, పూజ ఇవేవీ చేయలేక పోయినప్పటికీ స్త్రీలకు కేవలం #జపంతోనే మంత్రం సిద్ధిస్తుంది.
అయితే శాస్త్రరీత్యా స్త్రీలకు పై విధంగా వెసులుబాటు కలిగినప్పటికీ అవకాశం వున్నవారు శక్తి కలిగినవారు #పంచాంగ_పూర్వకంగా పురశ్చరణ చేస్తేనే మంచిది.
★★★ పురశ్చరణ_నియమాలు:
✱ ∬ స్త్రీణాం నిందాం ప్రహారం చ కాటిల్యం వా ప్రియం వచః
ఆత్మనోహితమన్విచ్ఛన్ కాళీ భక్తో వివర్జయేత్ ∬
(మంత్రమహోదధి, కాళీమంత్ర కథనం 3వ తరంగం)
【ఈ కాళీ మహావిద్యా మంత్రాన్ని జపించే సాధకుడు స్త్రీలని నిందించకూడదు. వారి మరణానికి కారకుడు కాకూడదు. అంటే స్త్రీల మీద ఎటువంటి మంత్ర తంత్ర ప్రయోగాలు చేయకూడదు. అలాగే వారి గురించి చెడుమాటలు మాట్లాడకూడదు.】
✱ ∬ భూశయ్యా బ్రహ్మచారిత్వం మౌనమాచార్య సేవనం నిత్యం త్రిషమాణ స్నానం క్షుర కర్మ నిసర్జనం ∬
【భూమి మీద పడుకోవటం, బ్రహ్మచర్యాన్ని పాటించటం, ఎక్కువసేపు మౌనంగా వుండటం, పెద్దల గురువుల సేవ చేయటం, ప్రతిరోజూ మూడుసార్లు స్నానం చెయ్యటం, క్షవరం చేయించుకోకుండా వుండటం అనేవి ప్రధానంగా పాటించాల్సిన నియమాలు. అలాగే ఆహారం కూడా ఒక పూట భోజనం రాత్రికి ఫలహారం చేస్తే మంచిది.】
🌹🙏🌹
http://www.siddheswaripeetham.org/
_
No comments:
Post a Comment