తిరుమల ప్రధానాలయం
తిరుమల ప్రధానాలయం అయిన గర్భగుడిలో శ్రీవారి దివ్య మంగళ విగ్రహంతో పాటు 4 విగ్రహాలుగా దర్శనమిచ్చే నలుగురు మూర్తులున్నారు. వీరినే చతుర్బేరాలు అంటారు. బేర మంటే విగ్రహం అని అర్ధం.
1.కౌతుక బేరం
ఇక్కడ నిత్య సేవలన్నీ కౌతుక బేరానికి నిర్వహిస్తారు.
ఈయన భోగ శ్రీనివాసుడు.
7వ శతాబ్దంలో పల్లవ యువరాణి సమవాయి ఈ విగ్రహాన్ని బహుకరించారు.
రోజువారి అభిషేకాలు, దీపారాధన నైవేద్యాలన్ని భోగ శ్రీనివాసునికే జరపడం ఆచారంగా వస్తుంది
2.బలి బేరం
సొమ్ము అప్పగింతలు, కొలువు బలి బేరానికి జరుగుతాయి.
గర్భగుడిలో ఉండే శ్రీవారి చిన్న విగ్రహం. ఈయన కొలువు శ్రీనివాసుడు.
మూల విరాట్ కు తోమాలసేవ తరువాత కొలువు శ్రీనివాసుని ఆలయ మండపానికి తీసుకువచ్చి రోజువారి పంచాంగ శ్రవణం జరిపిస్తారు.
3.స్నపన బేరం
స్నపన బేరం ఈ మూర్తిని 11వ శతాబ్దం వరకు ఉత్సవ విగ్రహంగా పూజించారు.
ఈయనే ఉగ్ర శ్రీనివాసుడు. శ్రీదేవి భూదేవి సహిత శ్రీవారీయన.
4.ఉత్సవ బేరం
ఉత్సవ కార్యక్రమాలన్ని ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి సహిత మలయప్పస్వామికి నిర్వహిస్తున్నారు.
మలయప్పస్వామి వారు ఉత్సవాలతో వైభోగం వెలిగిస్తారు. ఉత్సవాలలో ఉత్సవ బేరాన్ని ఊరేగిస్తున్నారు. ఉత్సవ బేరమంటే మలయప్పస్వామి.
బ్రహ్మోత్సవాలలో బ్రహ్మా వెలిగించే స్వామి ఈయనే. భక్త కోటికి దర్శనమిస్తూ సాగిపోతుంటారు.
ఈయనకు ఇరువైపులా 24 అంగుళాల ఎత్తున శ్రీదేవి భూదేవి కొలువైయున్నారు.
ధృవ బేరం
స్వామి వారి ప్రతిమను ధ్రువ బేరం అంటారు. నిశ్చల, ధీర, గంభీర మూర్తి శ్రీవారు.
ధ్రువమూర్తినే దేవదేవుడు ఈయనకు నిత్య సేవలు అందుతున్నాయి.
భక్తుల కోర్కెలు తీర్చే భారం
మాత్రం ఈ మూర్తులలో ధ్రువ మూర్తిది. అంటే ప్రధాన మూర్తి శ్రీ వెంకటేశ్వరునిదే.
గర్భాలయంలో దర్పంగా చిద్విలాసం చిందించే స్వామియే బ్రహ్మాండ నాయకుడు మూల విరాట్. ఆగమ పరిభాషలో ఈ మూల విరాటునే ధ్రువ బేరం అని పిలుస్తున్నారు.
దేవ దేవుని విగ్రహం ఎత్తు తొమిదిన్నర అడుగులు. ప్రతి రోజు అనేక రకాల పూలతోను బంగారు నగలతోను ఈ ధ్రువ బేరాన్ని అలంకరిస్తారు. గర్భగుడిలో అలంకరించే విరిదండలు మరింత శోభను తెస్తాయి.
ఇక్కడ శ్రీనివాసునికి ఇరువైపులా ఇష్ట సకులుండరు. వీరిరువురు స్వామి వారి వక్ష స్థలం మీద దర్శన మిస్తుంటారు.
ప్రధాన విగ్రహంతో పాటు ఈ నలుగురు మూర్తులు శ్రీవారి ఆలయంలో కొలువై భక్తుల కోర్కెలు తీరుస్తున్నారు.
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా;
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,
శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.🙏
🌸 జై శ్రీమన్నారాయణ 🌸
No comments:
Post a Comment