Friday, July 7, 2023

చతురామ్నాయ పీఠాలు, వాటి సాంప్రదాయాలు.

#గురు_పరంపర... భవిష్యత్ చతురామ్నాయ పీఠాధిపతులు...


చతురామ్నాయ పీఠాలు, వాటి సాంప్రదాయాలు. 

||శ్లోకం||
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం!
నమామి భగవత్పాద శంకరం లోకశంకరం!!

            కైలాస శంకరుడు, కాలడి శంకరుడడిగా ఈ పుణ్యభూమిలో కేవలం 32 సంవత్సరముల కాలము మాత్రమే నడయాడి, 5వ ఏటనే సన్యాస దీక్ష గ్రహించి  వేదవేదాంగాలను అత్యల్ప సమయములోనే అధ్యయనము చేసి అసంఖ్యాకమైన స్త్రోత్ర రచనలెన్నో చేశారు. మానవమాత్రులెవ్వరికి సాధ్యముకానీ బ్రహ్మ సూత్రాలకు, భగవద్గీతకు, విష్ణు సహస్ర నామములకు భాష్యం చెప్పారు. అద్వైత తత్వాన్ని భోధించారు. ఆసేతు హిమాచలం మూడు సార్లు కాలినడకన నడయాడి, పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన అవైధిక మతాలను, సిద్ధాంతాలను నిర్మూలించి  సనాతన వైధిక ధర్మ ప్రతిష్ణాపన గావించారు. ఆదిత్యయోగీ..
            అటువంటి జగద్గురు శ్రీమత్ శంకరభగవత్ పాదాచార్యులవారు దూరదృష్టితో ఆలోచించి సనాతన ధర్మ పరిరక్షణకు, ధర్మ స్థాపనకు భారతదేశం నలుమూలలా నాలుగు పీఠాలను స్థాపించి
మహాద్భుతమైన సేవ చేశారు. ఎలాగైతే దేశ రక్షణకు సైన్యం అవసరమో అలాగే మన ధర్మ రక్షణకు ఈ నాలుగు పీఠాలు అంతే అవసరమని భావించి ఈ పీఠాలను స్థాపించారు. నేడు మరల మన ప్రారబ్ధ వశాన అనేక అవైధిక మతాలు, కొత్తకొత్త దేవుళ్ళు పుట్టుకొస్తున్నారు. భారతదేశం మొత్తం అంతటా ఎవరు  మఠాలు, ఆశ్రమాలు, ఆఖడాలు, స్థాపించాలన్నా లేక స్వామీజీలు, మఠాధిపతులు, సన్యాసులు, బాబాలు, ఫకీర్లుగా, దేవుళ్ళుగా శాస్త్ర విహితంగా గుర్తింపు పడాలన్నా ఈ పీఠాధిపతుల ఆమోదము ఆత్యావశ్యకము. కాబట్టి ఈ క్లిష్టమైన సమయములో మనకు శంకరలు స్థాపించిన ఆ నాలుగు పీఠాలను స్మరించుకొని నేటి జగద్గురువుల ఉపదేశాను సారము  నడుచుకొని జన్మను సార్థకము చేసుకొందాము. 
         *****  *****  *****  *****  *****
చతురామ్నాయ పీఠాలు :
ఆదిత్యయోగీ..
1)తూర్పున గోవర్ధన మఠం- పూరీ క్షేత్రం 
    ఆమ్నాయం-పూర్వామ్నాయం
     సాంప్రదాయం-భోగవార
     దేవత-జగన్నాథుడు
     దేవి-విమల
      సన్యసుల నామధేయాలు- వన, అరణ్య
      బ్రహ్మచారుల నామధేయాలు- ప్రకాశ
     ఆచార్యులు- పద్మపాదాచార్యులు
     తీర్థం- సముద్రం
     వేదం-ఋగ్వేదం 
     మహా వాక్యం-'ప్రజ్ఞానం బ్రహ్మ' 
      గోత్రం-కాశ్యప
      ఈ మఠాధిపత్య ప్రదేశాలు-అంగ(అస్సాం) 
                వంగ
                కళింగ
                మగధ(దక్షిణ బీహార్) 
                 ఉత్కల్(ఒరిస్సా) 
              **********************
2)పడమట శారదా మఠ్:ద్వారక
             ఆమ్నాయం - పశ్చిమామ్నాయం
              సాంప్రదాయం-కీటవార
               సన్యాసుల నామధేయాలు-  తీర్థ,     ఆశ్రమ. 
               బ్రహ్మచారుల నామధేయాలు- స్వరూప్
              దేవత- సిద్ధేశ్వరుడు
              దేవి- భద్రకాళి
              ఆచార్యుడు - హస్తామలకచార్య
               తీర్థం- గోమతి
               వేదము- సామవేదం 
                మహావాక్యం- 'తత్వమసి' 
                గోత్రం- అభిగత
                ఈ పీఠధిపత్యంలోని ప్రదేశాలు:
               సింధు(పంజాబ్) 
                సౌవీర
                సౌరాష్ట్ర(సూరత్) 
                మహరాష్ట్ర
              *********************

3)ఉత్తరాన జోతిర్మఠ్ - బదరి క్షేత్రం 
                ఆమ్నాయం - ఉత్తర
                 సాంప్రదాయం- ఆనందవార
                 సన్యాసుల నామధేయాలు- గిరి, పర్వత, సాగర
                 బ్రహ్మ చారుల నామధేయాలు-
ఆనంద
                 క్షేత్రం - బదరికాశ్రమం
                 తీర్థం- అలకనంద
                  దేవత- నారాయణ
                  దేవి-పూర్ణగిరి
                  ఆచార్యులు- తోటకాచార్యులు
                  వేదం- అధర్వణ వేదం
                  మహావాక్యం - 'అయం ఆత్మా బ్రహ్మ'
                   గోత్రం - భృగు
                  పీఠధిపత్యంలోని ప్రదేశాలు :
                   కురు(హర్యానా)
                   కాశ్మీర
                   కాంభోజ-(అప్పటి ఆఫగనిస్తాన్)
                   పాంచాల(హర్యానా&హిమాచల్ ప్రదేశ్)
                   ****************

4)దక్షిణాన శృంగేరి పీఠము:   
                ఆమ్నాయము- దక్షిణామ్నాయం
                 సాంప్రదాయం-భూరివార
                 సన్యాసుల నామధేయాలు: సరస్వతి, భారతీ, పూరి
                  బ్రహ్మచారుల నామధేయాలు: 
చైతన్య
                  దేవత- ఆది వరాహ
                   దేవి- కామాక్షి
                   ఆచార్యులు- సురేశ్వరాచార్య
                    క్షేత్రం - రామేశ్వరం
                    తీర్థం-తుంగభద్ర నది
                    వేదం- యజుర్వేదం
                    మహావాక్యం -'అహం బ్రహ్మాస్మి' 
                  ఈ పీఠధిపత్యంలోని ప్రదేశాలు :    
                    ఆంధ్ర, 
                    ద్రావిడ,
                     కేరళ
                     కర్ణాటక 
     
  ||శ్లోకం||
 శంకరం  శంకరాచార్యం కేశవం బాధరాయణం! 
సూత్ర భాష్య కృతౌ వందే భగవంతౌ పునఃపునః!! 
               
సనాతన ధర్మాచార్యా ప్రతిష్ఠాన్.....
................................................................

మనిషి జీవితంలో జన్మనిచ్చిన తల్లి, తండ్రి, తోడబుట్టిన అన్న దమ్ములు, జీవితం పంచుకునే భార్య, వారసులైన కొడుకులు, కూతుళ్ళు..
     ఇలా ఎందఱో బంధువులు తారసపడతారు. వీరందరూ ఎల్లప్పుడూ తనతో ఉంటారని, కష్ట సుఖాల్లో తోడు వస్తారని భావించడం మానవ సహజం.

కానీ ఈ బంధాలు అన్ని శాశ్వతం కాదు అని, మనకు జీవితంలోను, తరువాత కూడా తోడు వచ్చే బంధువులు ఎవరో, వారి గురించి చాణిక్యుడు ఒక చిన్న శ్లోకంలో ఎంతో చక్కగా వివరించాడు.

౹౹సత్యం మాతా, పితా జ్ఞానం,ధర్మో భ్రాతా,దయా సఖా౹౹
౹౹శాంతి: పత్నీ, క్షమా పుత్రా:షఢెతె మమ బాంధవా:౹౹

సత్యమే తల్లి, జ్ఞానమే తండ్రి, ధర్మమే సోదరుడు, 
దయా స్నేహితుడు,శాంతి భార్య, వోర్పే పుత్రుడు. 
ఈ ఆరే మానవునకు నిజమైన బంధువులు అని అర్ధం.

ఏ జీవికైన జన్మనిచ్చేది తల్లి.
తల్లి స్థానం మారదు.
ఎటువంటి పరిస్థితులలో నైనా, 
తల్లి ప్రేమ మారదు. అలాగే,
సత్యం ఒక్కటే.అది ఎన్నటికి, మారదు.

జ్ఞానం తండ్రి. తండ్రి ఎలాగైతే విద్యా బుద్ధులు నేర్పించి
జీవించే ఉపాయాలు నేర్పడం ద్వారా,
సుఖవంతమైన జీవితానికి మార్గదర్శకుడు అవుతున్నాడో,
జ్ఞానం కూడా మనిషికి సంతోషం గా జీవించడం నేర్పుతుంది.
మనిషి పురోగతికి మూలం జ్ఞానమే.

సోదరుడు ఎలాగైతే ఎప్పుడు అండగా నిలుస్తాడో,
తోడుగా ఉండి, అభివృద్ధికి బాటలు వేస్తాడో,
ధర్మం ఎప్పుడు మనిషికి వెంట నుండి ఆత్మీయతను,
అనురాగాన్ని పంచి,ధర్మాన్ని పాటించిన వాడికి అమృత ఫలాలను అందిస్తుంది.

దయ మిత్రుని లాంటిది..
మిత్రుని వలే మంచి చెడులను ప్రభోదిస్తుంది.

శాంతి భార్య వంటిది.భార్య సుగుణ శీలి అయితే,
ఆ మనిషి జీవితం పూలపాన్పు లాగా ఉంటుంది. 
భార్య గయ్యాళి అయితే ఆ మనిషి జీవితం నరక ప్రాయం ఔతుంది.
అలాగే జీవితంలో శాంతి ఉన్నవాడికి ఇంక ఏ లోటు ఉండదు.
శాంతిని అలవరచుకోని మనిషి జీవితం నరకంతో సమానం.

ఓర్పు పుత్రునిలాంటిది. పుత్రుడు ఎలాగైతే నరకం నుండి రక్షిస్తాడు అని నమ్ముతామో, అలాగే ఓర్పు ఉన్న వ్యక్తి యొక్క జీవితం స్వర్గతుల్యమే.

పై శ్లోకం ద్వారా చాణిక్యుడు ఒక మనిషి తన జీవితంలో బంధువులు
ఎంత ముఖ్యం అని అనుకుంటాడో,
అంతకన్నా, సత్యం, జ్ఞానం, ధర్మం, దయ, శాంతి, ఓర్పు అనే 
ఆరు గుణాలు అంతే ముఖ్యం అని చెప్తాడు..

ఊహ తెలిసిన దగ్గరనుంచి,
మరణించే వరకు ఎలాగైతే బంధువులను వీడి పోలేమో,
అలాగే ఈ ఆరు గుణాలను ఆజన్మాంతం పాటించాలి అని ఉపదేశించాడు....

🚩🙏  సర్వేజనా సుఖినో భవంతు 🙏🚩
.
సేకరణ...

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS