మహారాష్ట్రలోని నాసిక్లో గల త్రయంబకేశ్వరంలో నారాయణనాగబలి పూజ మూడురోజులపాటు జరుపబడును..
మొదటిరోజున ఈ పరిహారం చేయించుకునేవారు కుశావర్త కుండ్ లో స్నానంచేసి బ్రాహ్మణులకు వివిధ రకాల దానాలను ఇచ్చి(మనం ఇచ్చే దక్షిణ లోనే దానాలు కూడా కలిపి) ఆపై త్రయంబకేశ్వర్ ఆలయంలో ప్రార్థనలుచేస్తారు...
ఆ తరువాత అక్కడకు దగ్గరలో ఉన్న ధర్మస్థల అనే ప్రదేశానికివెళ్ళి అక్కడ గోదావరి మరియు అహల్యనదులు సంగమించే ప్రదేశంలో నారాయణనాగబలి పూజలను చేయించుకుంటారు.
కేవలము పితృదోషం, పితృశాపం ఉన్నవారే కాక ఇతరుల ఉసురుపోసుకున్నవాళ్ళుకూడా (తనకన్నా బలహీనుల్ని దౌర్జన్యంతో లొంగదీసుకుని వాళ్ళ ధన, మాన ప్రాణాల్ని దోచుకుని వాళ్ళకి తీవ్రమైన మానసికవేదన కలిగించినపుడు ఆ అశక్తులైన వారి మనోవేదన ఒక శాపం రూపం ధరించి వారిపై దౌర్జన్యంచేసినవారికి తగులుతుంది. దీనినే ఉసురు పోసుకోవటం అంటారు)
ఇలా ఇతరుల ఉసురుపోసుకున్నవారికి ఎంతోచెడు జరిగే అవకాశం ఉన్నది. అంతేకాకుండా ఆ ఉసురు తరతరాలుగా తర్వాతివారినికూడా పీడించే అవకాశం ఉంటుంది....
మొదటిరోజున నదిఒడ్డున ఒక ప్రదేశంలో కలశస్థాపన చేస్తారు. ఆ తరువాత బ్రహ్మ,విష్ణు,రుద్ర, యమ అనే దేవతల్ని ఆరాధిస్తారు. ఆ తరువాత పర్నశార్ అనే ప్రక్రియ జరుపబడుతుంది.
ఈ ప్రక్రియలో చనిపోయి అశాంతితో తల్లడిల్లుతున్న పూర్వీకుల ఆత్మలను అక్కడకు రప్పించి(పిండి తో చేసిన బొమ్మ ద్వారా) వారి ఆత్మశాంతికి తగిన పరిహారాలను చేయటం జరుగుతుంది.
రెండవరోజున చనిపోయిన వ్యక్తిపట్ల గౌరవాన్ని సూచిస్తూ సూతకం పాటించి కుశావర్తన్లో స్నానంచేస్తారు.దానితో పాటు నాగదోషం ఉన్నవారు నాగుకు(పిండితో చేసిన నాగ ప్రతిమకు) అంతిమ సంస్కారాలు చేసి సుతకం పాటించాలి..
మూడవరోజున శుద్ధి ప్రక్రియ పూర్తి చేసి త్రయంబకేశ్వర ఆలయంలో పూజలుచేసి నారాయణ నాగబలి ప్రక్రియను తమచేత చేయించిన బ్రాహ్మణ పండితులకు తమశక్తి కొద్ది దక్షిణ సమర్పిస్తారు..
No comments:
Post a Comment