సంపత్కరీదేవి...!!
🌿శ్రీ లలితాదేవి యొక్క గజ దళానికి సంపత్కరీ దేవి అధికారిణి.
🌸ఈ దేవి
అనుగ్రహం లభించినవారికి నవ నిధులు సంప్రాప్తిస్తాయి.
🌿కోట్లాది గజ , తురగ , రధములు కలిగిన సంపత్కరీ దేవి
తనను నమ్మి వచ్చిన భక్తులందరికి సకల సంపదలను అనుగ్రహిస్తుంది.
🌸లలితా సహస్రనామములలో
"సంపత్కరీ సమారూఢ
సింధూర వ్రజ సేవితా " అనే నామము ఈ దేవిని కీర్తిస్తున్నది.
🌿 ఒక కోటి ఏనుగులు వెంటరాగా, సకలాస్త్రశస్త్రములు దేవికి రక్షణ కాగా , రణకోలాహలమనే ఏనుగు మీద అధిరోహించి దర్శనమిస్తుంది.
🌸ఎంత పేదరికం లో వున్నవారికైనా ఈ దేవి అనుగ్రహం తో సకలసౌఖ్యాలు లభిస్తాయి.
🌿దేవి అధిరోహించిన ఏనుగు యొక్క ఒక్కొక్క అడుగు
లోను తామరపద్మాలు
దర్శనమిస్తాయి.
🌸ఒక్క ఏనుగుని పోషించడానికే పెద్ద నిధి అవసరమౌతుంది.
కోటానుకోట్ల ఏనుగులను
పోషిస్తున్న సంపన్నురాలు.
🌿ఆ పెన్నిధులనన్నిటిని
తనను భక్తితో ఉపాసించేవారికి అడగకనే కటాక్షించే
కరుణామయి సంపత్కరీదేవి.
🌸లలితాంబికను కీర్తించే స్తోత్రాలలో ముఖ్యమైన, అతి శక్తివంతమైన అంకుశమును, ఎవరైతే
భక్తి శ్రధ్ధలతో ధ్యానిస్తారో
🌿వారు సకలదేవతలను, భూపాలకులను, శతృవులను సహితం తమ వశం చేసుకొనే
శక్తిని పొందగలరని చెప్తారు.
🌸అంతటి మహిమ కలిగిన అంకుశ అంశయే ఈ సంపత్కరీ దేవి.
🌿ఏనుగుని మదమణిచేందుకు అంకుశం ఉపయోగ పడినట్లు, మానవులలోని అహంకారాన్ని సంపత్కరీ
దేవి అణిచి వేస్తుంది.
🌸అణిగి పోయిన ఏనుగు
ఎన్నో ఉపయోగకరమైన
పనులకు సహాయపడినట్లు,
🌿 అహంకారం , మోహం అణగారి తనను శరణాగతితో పూజించే
భక్తుల జీవితాలలో శుభములను కలిగించి సకలసౌభాగ్యములను
కటాక్షిస్తుంది
🌸ఏనుగులు, గుఱ్ఱములు
వేరే ఎక్కడో లేవు.
మనలోనే, చపలత్వం , అహంకార రూపాలలో వున్నాయి.
🌿 మొండిదైన అశ్వమును అధిరోహించడానికి ముందు దానిని మచ్చిక చేసుకొని లొంగదీసుకోవాలి.
🌸 అలాగే దేవి అనుగ్రహం పొందడానికి
మనలో వుండే అహంకారాన్ని ,మదాన్ని
సంపూర్ణంగా అణచివేసుకొని భగవంతుని పాదాలనాశ్రయించాలని దేవీ తత్వం బోధిస్తుంది.
🌿సంపత్కరీ దేవి నమ్మినవారిని రక్షింపక వదలదు...స్వస్తి....
No comments:
Post a Comment