కమలాంబిక....!!
అత్యంత మహిమాన్విత స్థలమైన తిరువారూర్ లో జన్మించడమే మహాభాగ్యమని , ముక్తిప్రదమని కీర్తిస్తారు.
🌸తమిళనాడు తంజావూరు జిల్లాలో గల తిరువారూర్ ప్రాచీన నామం వల్మీకపురం. వల్మీకం అంటే పుట్ట.
🌿 ఇక్కడ పరమేశ్వరునికి వల్మీకనాదర్ అనే పేరు వుంది. ఈ ఆలయం ఎంతో ప్రాచీనమైనదని యీ ఆలయం లోని ఈశ్వరుడు
🌸స్వయంభూ ఆవిర్భావ కాల నిర్ణయం చేయడం ఎవరి వలనా కాదని, పరమ భక్తుడైన తిరునావుక్కరసర్ ప్రవచించారు.
🌿తంజావూరు సమీపంలో గల సప్తవిధాంగ క్షేత్రాలాయాలలో ప్రధమ ఆలయం ఇది. ఈ పుణ్యస్ధలంలో
నవగ్రహాలను ఒకే వరసలో
దర్శిస్తాము.
🌸లలితా సహస్రనామాలలోని
అంబికను సంపూర్ణ రూపంగా దర్శించగల శ్రీవిద్యా క్షేత్రం.
🌿 భారతదేశంలోని పెద్ద
పెద్ద ఆలయాలలో ఒకటిగా చెప్పబడుతున్న క్షేత్ర
ఆలయం.
🌸తిరువారూరు శ్రీ రాజేశ్వరుని ఆలయంలో ప్రవేశించగానే ఎత్తిన చేతులు దింపకుండా
🌿 వందనములు
సమర్పించవలసిన దేవతామూర్తులెన్నో
ప్రత్యేక సన్నిధులలోనుండి దర్శనమిస్తారు.
🌸అమ్మవారి శ్రీ చక్రంలోని దేవతామూర్తులు దర్శనమనుగ్రహిస్తున్న
ఆలయం.
🌿శ్రీ మన్నారాయణుడు పూజించిన సోమస్కంద శివశక్తి మూర్తిని , బ్రహ్మ , ఇంద్రాది దేవతలు సేవించిన అనంతరం ముచుకుంద చక్రవర్తి భక్తితో పూజించి
ఆ విగ్రహాన్ని యిక్కడ ప్రతిష్టించినట్లు ఐహీకం.
🌸మూర్తి త్యాగరాజేశ్వరునిదైనా
అంబికకు కూడా అత్యంత ప్రధాన్యత వుంది.
🌿ఈ స్ధల ప్రత్యేకత ఏమిటంటే
ప్రధాన మూర్తి అయిన
త్యాగరాజేశ్వరుని దర్శిస్తే
శ్రీవిద్యా స్వరూపం అంతర్ముఖంగా మనకి బోధిస్తునట్లు గోచరిస్తుంది.
🌸ఎందుకంటే అక్కడ ఎప్పుడూ త్యాగరాజేశ్వరుని
ముఖం మాత్రం బయటికి తెలిసేలా అలంకరించబడి వుంటుంది.
🌿ముందు వైపునుండి దర్శిస్తే శివశక్తి రూపిణిగా పరమశివుడు
వెనుకవైపునుండి దర్శనం చేసుకుంటే ,
🌸 శివశక్త్యైక రూపిణి లలితాంబిక గా స్త్రీ రూపంలోనూ ఆశీనురాలై ప్రత్యేకంగా అలంకరించిన రూపంలో దృగ్గోచరమవుతుంది.
🌿ఇటువంటి మర్మగర్భితములైన విషయాలు కలిగిన ఆలయం యిది.
🌸 అమ్మవారు ప్రత్యేకంగా ఒక ఆలయంలో కమలాంబికగా దర్శనం కటాక్షిస్తు వున్నది.
🌿అంబిక ఆలయానికి పడమటి
దిశగా అక్షర పీఠం వున్నది.
ఈ పీఠం లో 51 బీజాక్షరాలు
వ్రాసి వున్న శక్తివంతమైన మహిమాన్విత రాగి యంత్రం వున్నది.
🌸ఇది అన్ని మంత్రాలలోని శక్తిని సంపూర్ణంగా
సిధ్ధింపజేయగల శక్తి పీఠం ...స్వస్తి...🚩🌞🙏🌹🎻
No comments:
Post a Comment