Sunday, July 30, 2023

ఆర్ధిక సమస్యలకు పరిహారాలు...!!

 ఆర్ధిక సమస్యలకు పరిహారాలు...!!





🌿ప్రతి పౌర్ణిమ తిధి రోజు మహాలక్ష్మి ఆలయంలో సహస్రనామార్చన చేయిస్తే లక్ష్మి కటాక్షం కలుగుతుంది,


🌸ప్రతి మంగళ వారం శ్రీ ఆంజనేయ స్వామివారికి 108 ప్రదక్షిణలు చేసి అర్చన చేయాలి.


🌿41 రోజుల పాటు శ్రీ లలిత సహస్రనామావళి తో అమ్మవారికి కుంకుమార్చన చేయాలి.


🌸21 రోజుల పాటు వరుసగా శ్రీ ఆంజనేయ స్వామివారికి ఆకు పూజ జరిపించాలి.


🌿41 రోజుల పాటు ప్రతిరోజూ హనుమాన్ చాలీసా 11 సార్లు చదవాలి. అన్ని నియమాలు పాటించాలి.


🌸90 రోజుల పాటు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రతి రోజు 108 ప్రదక్షిణలు చేసి అర్చన చేయాలి.


🌿శ్రీకాళహస్తిలో రాహు-కేతు పూజ మంగళవారం రాహు కాలంలో చేయాలి.


🌸18 మంగళవారాలు లేదా శుక్రవారలందు దుర్గా ఆలయం లో రాహు కాలం దీపం వెలిగించాలి.


🌿41 రోజుల పాటు గణపతిని గరిక తో అర్చించాలి.


🌸11 శ్రావణ నక్షత్రమ్ రోజులందు శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి తులసి దళాలు, పూలతో సహస్ర నామార్చన చేయించాలి.


🌿5 స్వాతి నక్షత్రం రోజులలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారికీ సహస్ర నామార్చన జరిపించాలి.


🌸శ్రీలక్ష్మి సహస్రనావళి లేదా శ్రీ లలిత సహస్ర నామావళితో ఒక సంవత్సరం పాటు కుంకుమార్చన చేయాలి. అన్ని నియమాలను పాటించాలి.


🌿ప్రతిరోజూ శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం మరియు శ్రీసూక్తం పారాయణం చేస్తే ఆర్ధిక సమస్యలు క్రమంగా తగ్గిపోగలవు.


🌸గణపతి ఆలయంలో 41 రోజుల పాటు ప్రతి రోజు 28 ప్రదక్షిణాలు చేసి గణపతి సహస్రనామ స్తోత్రం పారాయణం చేయాలి. ఈ రోజులలో చవితి తిధి రోజున ఉపవాసం ఉంది గణపతికి ఉండ్రాళ్ళు మరియు ఇతర మధుర ఫలాలను నివేదిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.


🌿సర్పసూక్తంతో శివాలయంలో 21 రోజుల పాటు అభిషేకం చేయాలి.


🌸11 సప్తాహాలు శ్రీ గురుచరిత్ర అన్ని నియమాలతో పారాయణం చేసి అనంతరం ఏదైనా దత్త క్షేత్రాలు దర్శించ రాగలరు


🌿5 లేదా 11 లేదా 15 లేదా 21 లేదా 25 లేదా 27 సంఖ్యలో బ్రాహ్మణులకు అన్నదానం చేస్తే ఎటువంటి ధన ఉద్యోగ సమస్యలైన తీరిపోగలవు


🌸గురుముఖంగా లక్ష్మి, లలిత. దత్త విష్ణు శివ మంత్రాలను తీసుకొని ప్రతిరోజూ క్రమం తప్పకుండ జపం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి


🌿సంధ్యావందనం అర్హత ఉన్నవారు తప్పనిసరిగా ప్రతిరోజూ సంధ్యా వందనం ఆచరించాలి. సంధ్యావందనం చేయకుండా ఏ దేవతను ఆరాధించిన ప్రయోజనం ఉండదు. సంధ్యావందనం తో సకల అరిష్టాలు తొలగిపోగలవు.


🌸చండీ సప్తశతి పారాయణం ప్రతిరోజూ పారాయణం చేస్తే అన్ని సమస్యలు తీరిపోగలవు.


🌿వాల్మీకి రామాయణం లోని సుందరకాండను ప్రతిరోజూ పారాయణం చేస్తే అన్నీ శుభాలు కలుగుతాయి.


🌸పైన ఉదహరింపబడిన పరిహారాలు ఎవ్వరైన ఏదైనా ఒకటి మనస్ఫూర్తిగా పాటించవచ్చు.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS