🌿సాధారణంగా మనకు తెలిసినవి శిలా నిర్మితమైన లింగాలు మాత్రమే.. అందులో కూడా నల్ల రాతి శివలింగాలే అధికం.
🌸కానీ మనకు తెలియని శివలింగాలు ఇంకా అనేకం ఉన్నాయి.
అందులో 30 రకాల శివలింగాలు మరీ ముఖ్యమైనవి. అపూరూపమైనవి..
🙏🌹ఆయా లింగాలు ఇచ్చే ఫలితాలు అనంతం....🌹🙏
🌿రకరకాల పదార్ధాలతో రూపొందించిన శివలింగాలు గురించి పురాణాలు వివిధ సందర్భాలల్లో వర్ణించాయి....
🌸ఏయే శివలింగాలను పూజిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయంటే.....
🌿1) గంధపు లింగం.
రెండు భాగాలు కస్తూరి , నాలుగు భాగాలు గంధం , మూడు భాగాలు కుంకుమను కలిపి ఈ లింగాన్ని చేస్తారు దీనిని పూజిస్తే శివ సాయిజ్యం లభిస్తుంది.
🌸2) నవనీత లింగం.
వెన్నతో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి.
🌿3) పుష్పలింగం.
నానావిధ సుగంధ పుష్పాలతో దీనిని నిర్మిస్తారు....దీనిని పూజిస్తే రాజ్యాధిపత్యం కలుగుతుంది.
🌸4) రజోమయ లింగం.
పుప్పొడితో నిర్మించిన ఈ లింగాన్ని పూజించడం వల్ల విద్యాథరత్వం సిద్ధిస్తుంది..... శివ సాయిజ్యాన్ని పొందగలరు
🌿5) ధ్యాన లింగం.
యవలు , గోధుమలు , వరిపిండితో ఈ లింగాన్ని నిర్మిస్తారు....దీనిని పూజించడం వల్ల సంపదల వృద్ధి , సంతానం కలుగుతుంది.
🌸6 ) తిలిపిస్టోత్థ లింగం.
నూగు పిండితో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే ఇష్టసిద్ది కలుగుతుంది.
🌿7) లవణ లింగం..
హరిదళం , త్రికటుకము , ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి .
🌸8 ) కర్పూరాజ లింగం .
ముక్తి ప్రదమైనది.
🌿9) భస్మమయ లింగం.
భస్మముతో తయారు చేస్తారు ...... సర్వసిద్ధులను కలుగచేస్తుంది
🌸10) శర్కరామయ లింగం..
సుఖప్రదం..
🌿11) సద్భోత్థ లింగం..
ప్రీతికరని కలిగిస్తుంది.
🌸12) పాలరాతి లింగం..
ఆరోగ్యదాయకం.
🌿13) వంకాకురమయ లింగం.
వంశవృద్దిని కలిగిస్తుంది ...... దీనిని వెదురు మొలకలతో తయారు చేస్తారు .
🌸14) కేశాస్థి లింగం .
వెంట్రుకలు , ఎముకలతో తయారు చేస్తారు .....ఇది శత్రునాశనం చేస్తుంది.
🌿15) పిష్టమయ లింగం..
ఇది పిండితో తయారు చేయబడుతుంది...ఇది విద్యలను ప్రసాదిస్తుంది.
🌸16) దధిదుగ్థ లింగం .
కీర్తి ప్రతిష్టలను కలిగిస్తుంది.
🌿17) ఫలోత్థ లింగం..
ఫలప్రదమైనది.
🌸18) రాత్రి ఘజాత లింగం.
ముక్తి ప్రదం
🌿19) గోమయ లింగం..
కపిల గోవు పేడతో ఈ లింగాన్ని తయారు చేస్తారు దీనిని పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది భూమిపై పడి మట్టి కలిసిన పేడ పనికిరాదు
🌸20) దూర్వాకాండజ లింగం.
గరికతో తయారు చేయబడు ఈ లింగం అపమృత్యుభయాన్ని తొలగిస్తుంది
🌿21) వైడూర్య లింగం..
శత్రునాశనం , దృష్టి దోషహరం
🌸22) ముక్త లింగం .
ముత్యంతో తయారు చేయబడిన ఈ లింగం ఇష్ట సిద్దిని కలిగిస్తుంది
🌿 *23) సువర్ణ నిర్మిత లింగం.
బంగారంతో చేసిన ఈ లింగం ముక్తిని కలిగిస్తుంది. రాజ్యాధికారాన్ని కలిగిస్తుంది చక్రవర్తిత్వాన్ని కలిగిస్తుంది ధన ధాన్యాలను సమకూరుస్తుంది పేరు ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతుంది
🌸24) ఇత్తడి - కంచు లింగం..
ముక్తిని ప్రసాదిస్తుంది
🌿25) రజత లింగం..
సంపదలను కలిగిస్తుంది
🌸26) ఇనుము - సీసపు లింగం..
శత్రునాశనం చేస్తుంది
🌿27) అష్టధాతు లింగం.
చర్మరోగాలను నివారిస్తుంది.....సర్వసిద్ధి ప్రదం
🌸28) స్ఫటీక లింగం.
సర్వసిద్ధికరం , అనుకున్న కార్యాలను సఫలీకృతం చేస్తుంది
👍29) తుష్టోత్థ లింగం..
మారణ క్రియకు పూజిస్తారు
🌸30) సీతాఖండ లింగం.
ఫటిక బెల్లంతో తయారు చేసింది..... ఆరోగ్యసిద్ధి కలుగుతుంది*
🌹పరమేశ్వర పూజా పుష్పఫలము ..🌹
🌹🙏శివున్ని దర్భలతో పూజిస్తే - దీర్ఘాయుస్సు!
ఉమ్మెత్తలతో పూజిస్తే - సుతప్రాప్తి!
జిల్లేడు పూలతో పూజిస్తే - శౌర్యము !
🌿కలువ పూలతో పూజిస్తే - విక్రమ వృద్ధి !
బంధూక సుమములతో పూజిస్తే - భూషణ ప్రాప్తి !
🌸జాజి పూలతో అర్చిస్తే - వాహన ప్రాప్తి !
మల్లెపూలతో పూజిస్తే - భోగము ప్రాప్తిస్తాయి !
🌿అవిసె పూలతో పూజిస్తే - పరమేశ్వర ప్రాప్తి !
కొండ గోగుపూలతో ఆరాధిస్తే - వస్త్ర లాభం !
🌸నువ్వుల పువ్వులతో ఉమామహేశ్వరుణ్ణి పూజిస్తే యౌవన ప్రాప్తి కలుగుతుంది !
🌿తుమ్మి పువ్వులతో అర్చిస్తే - మోక్ష లభం !
నందివర్థన పూజ - సౌందర్యాన్ని చేకూర్చుతుంది !
🌸లోకహితం కోసం శివుడు ఎత్తిన అవతారాలు..
ఓంకార స్వరూపుడైన శివుడు లోకహితం కోసం ఎన్ని రూపాలు ధరించాడు.
🌿ఈ విషయంపై శివపురణం ఓసారి తిరగేస్తే అందులో ఎనిమిది రూపాలు ధరించినట్లు పెర్కొంటోంది.
అవేంటంటే....
🌹రుద్రుడు !
భవుడు !
శర్వుడు !
ఉగ్రుడు !
భీముడు !
పశుపతి !
ఈశానుడు !
మహాదేవుడు !..
🌸1) రుద్రుడు : దుఃఖ నివారకుడైన అగ్నిని అదిష్టించి ఉంటాడు !!
🌿2) శర్వుడు : జీవుల మనుగడ కోసం భూమిని అధిష్టించి ఉంటాడు !!
🌸3) భవుడు : ఈ జగానికి అత్యంతావశ్యకమైన జలాన్ని ఆశ్రయించి ఉంటాడు !!
🌿4) ఉగ్రుడు : జగత్తు కదలికలకు కారకుడై వాయువును అధిష్టించి ఉంటాడు !!
🌸5) భీముడు : ఆకాశాన్ని ఆశ్రయించి ఉంటాడు !!
🌿6) పశుపతి : సంసార బద్ధులైన జీవులను పాప విముక్తులను చేసేందుకై జీవాత్మను అధిష్టించి 5ఉంటాడు !!
7) ఈశానుడు : ఈ చరాచర జీవులను శాసించే సూర్యునలో ప్రకాశిస్తుంటాడు !!
8) మహాదేవుడు : తన చల్లని కిరణాలతో జీవులను పాలించు చంద్రునిలో ప్రకాశిస్తుంటాడు !!.
No comments:
Post a Comment