*సాధారణంగా ఆలయంలో ప్రధాన ద్వారం వద్ద, గర్భగుడిలోకి వెళ్లేముందు ఉన్న గడపలు రాయితో తయారు చేసి ఉంటారు. ఈ గడపకు ప్రతి భక్తుడూ నమస్కరిస్తుంటాడు. ఇలా ఎందుకు నమస్కరిస్తారనే విషయం చాలా మంది భక్తులకు తెలియదు.*
*వాస్తవానికి గృహాలకు చెక్కతో తయారు చేసిన గడప ఉంటుంది. అలాగే, ఆలయాలకు అయితే రాయితో తయారు చేసిన గడప ఉంటుంది. ఆలయాలకు రాతితోనే ఎందుకు గడపను తయారు చేస్తారు? ఆ ఆలయ గడపకు ఎందుకు నమస్కరించాలి అనే అంశాలను పరిశీలిస్తే...*
*రాయి పర్వతానికి చెందినది. భద్రుడు అనే ఋషి భద్రమనే పర్వతంగానూ, హిమవంతుడు అనే భక్తుడు హిమాలయముగానూ, నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రిగానూ అవతరించారని పురాణాలు చెపుతున్నాయి. ఈ ఆ భక్తుల కోసం భగవంతుడు కూడా ఆ కొండలమీదే వెలిశాడు. అందుకే ఆ కొండ రాళ్ళ నుంచి వచ్చిన రాయినే మలిచి ఆలయ గర్భగుడులకు గడపగా పెట్టారని శాస్త్రాలు చెపుతున్నాయి.*
*అయితే, ఆ గడప నిత్యం దైవాన్ని దర్శిస్తూ ఉంటుంది. అలా ఆ గడప రాయి పుణ్యం చేసుకుంది. అందుకే ఆ గడప రాయి చేసుకున్న పుణ్యానికి నమస్కరిస్తూ, కొండ రాయిగా మారిన భక్తుడిని దాటుతున్నందుకు క్షమించమని, మన్నించమని వేడుకోవడమే గడపకు నమస్కరిస్తారని పురాణాలు చెపుతున్నాయి. అందుకే ఆలయాల్లో ప్రధాన గడప తొక్కకుండా కేవలం దాటాలని ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తున్నారు.*
🌸🫐🌸🫐🌸
No comments:
Post a Comment