• పాడ్యమి నాడు కూష్మాండము ( గుమ్మడి, బూడిద గుమ్మడి ) తినరాదు. ఎందుకంటే ఇది నష్టాన్ని కలిగిస్తుంది.
• విదియనాడు వంకాయ తినడం విషం.
• తదియనాడు అడవి దొండకాయ తినడం వలన శత్రువులు పెరుగుతారు .
• చవితినాడు ముల్లంగి తింటే ధన నష్టం కలుగుతుంది .
• పంచమినాడు మారేడును ( బిల్వ ) తింటే అపనింద కలుగుతుంది.
• షష్టినాడు వేప ఆకు, వేప పండ్లు, వేప పుల్ల నోటిలో వేసుకోవడం వలన నీచ జన్మ కలుగుతుంది.
• సప్తమినాడు తాటి పండ్లను తింటే వ్యాధి ఎక్కువవుతుంది. అంతేగాక శరీరం నాశనం అవుతుంది.
• అష్టమి నాడు కొబ్బరి తిన్నవారి బుద్ధి నశిస్తుంది.
• నవమినాడు సొరకాయ ( ఆనపకాయ ) తినడాన్ని గోమాంస భక్షణవలె త్యజించాలి.
• ఏకాదశినాడు చిక్కుడు కాయ, ద్వాదశినాడు బచ్చలి, త్రయోదశి నాడు వంకాయ తిన్నచో పుత్రుని నాశనము జరుగుతుంది.
• అమావాస్య, పౌర్ణమి, సంక్రాంతి, చతుర్దశి, అష్టమి తిథులు, ఆదివారము, శ్రాద్ధ దినములలో, వ్రతమాచరించే రోజులలో స్త్రీతో సహవాసము, నువ్వులను తినడం మరియు శరీరానికి నూనెను పట్టించడం నిషిద్ధము.
( బ్రహ్మవైవర్త పురాణం , బ్రహ్మఖండం : 27.37-38 )
• ఆదివారం నాడు అలచంద పప్పు, అల్లం, వేరుశనగ, ఎరుపు రంగులో ఉండే ఆకుకూరలు తినకూడదు.
( బ్రహ్మవైవర్త పురాణం , శ్రీకృష్ణ ఖండము : 75-90 )
• సూర్యాస్తమయం తర్వాత నువ్వులు వాడబడిన ఏ ఆహార పదార్థాన్ని కూడా తినరాదు.
( మనుస్మృతి : 4.75 )
• లక్ష్మీప్రాప్తి కోరిక ఉన్నవారు రాత్రికి పెరుగు మరియు పేలపిండి తినకూడదు. ఇది నరకాన్ని కలిగిస్తుంది ( ప్రాప్తింపజేస్తుంది ) .
( మహాభారతం, అనుశాసన పర్వం : 104.93 )
• పాలతో పాటు ఉప్పు , పెరుగు , వెల్లుల్లి , ముల్లంగి , బెల్లం , నువ్వులు , నిమ్మకాయ , అరటి , బొప్పాయి మొదలైన అన్ని రకాల పండ్లు , తులసి , అల్లం ఎన్నడూ సేవించరాదు. ఇవి విరుద్ధ ఆహారానికి సంబంధించినవి .
• పాలు త్రాగడానికి 2 గంటల ముందు గానీ లేదా 2 గంటల తరువాత గానీ భోజనం చెయ్యాలి. జ్వరం వచ్చినప్పుడు పాలు త్రాగడం అనేది పాము విషంతో సమానం .
• ముక్కలుగా కోసి చాలాసేపు ఉంచబడిన పండ్లు , పచ్చివి ( మామిడి , జామ , బొప్పాయి మొదలైనవి ) తినకూడదు. పండ్లు భోజనానికంటే ముందే తినండి. రాత్రికి పండ్లు తినకూడదు.
• ఒకసారి వండినటువంటి ఆహారాన్ని మరలా వేడిచేసి తినడం వలన శరీరంలో గడ్డలు తయారవుతాయి. ఈ గడ్డలు ట్యూమర్ వ్యాధికి దారితీయవచ్చు.
• తినకూడని పదార్థాలను తినడం ( అభక్ష్య - భక్షణము ) వలన కలిగే పాపం నశించడానికి ఐదురోజుల పాటు గోమూత్రం, గోమయం ( ఆవుపేడ ), పాలు , పెరుగు మాత్రమే ఆహారంగా తీసుకొనవలెను .
( వసిష్ఠ స్మృతి : 370 )
No comments:
Post a Comment