Sunday, May 28, 2023

అరుణాచలం " అనే పదానికి ఎవరి అవగాహన బట్టి వారికి అనేక అర్ధాలు స్ఫూరిస్తాయి.



*" అరుణాచలం " అనే పదానికి ఎవరి అవగాహన బట్టి వారికి అనేక అర్ధాలు స్ఫూరిస్తాయి.*


*అరుణాచలం అంటే ఆగమ శాస్త్రం ప్రకారం అరుణాచలేశ్వర దేవాలయములో ప్రతిష్ఠింపబడిన శివలింగం.*

*పౌరాణికులకు అది అరుణాచల పర్వతం.*
*భక్తులకు శివస్వరూపం.*
*యోగులకు పరంజ్యోతి.*
*తదాతీతం కూడా.*
*జ్ఞానోపాసకులకు హృదయస్తుడైన పురుషుడు.*
*నిర్గుణ అభిమానులకు నిర్మల జ్యోతి.*

*భూతత్వ పరిశోధకులకు అతి ప్రాచీనమైన కొండ .... ఇలా ఎన్నో .....భగవాన్ రమణ మహర్షి వాక్కులకు వేరే ప్రమాణముల ఆవశ్యత లేదు.*
*వారు అనేక పర్యాయములు అరుణాచలం గురించి ప్రస్తావించడం జరిగింది.*

*అరుణాచలం సాక్షాత్తూ కైలాసమే.*

 *ఈ క్షేత్రంలో నున్న ప్రతి శిలా శివలింగమే.*
*ఈ క్షేత్రంలో తీసుకున్న ఆహారము, నీరు అమృతమే.* 
*ఈ క్షేత్రంలో ఏమి మాట్లాడుకున్నా శివుణ్ణి స్తుతించినట్లే.* 
*ఈ క్షేత్రంలో ఏ కర్మ చేసినా అది పూజయే.*
*గిరి ప్రదక్షిణ చేస్తే మొత్తం సృష్టి చుట్టివచ్చినట్లే.* *గిరిప్రదక్షిణ చేస్తే ముక్తి లభిస్తుంది.*

*అరుణాచలం గిరి చుట్టూ 24 మైళ్ల లోపల మరణిస్తే వారికి ముక్తి కలుగుతుంది.*

*అంతేకాదు ...కమలాలయమున తిరువారూర్ నందు జన్మించినచో ముక్తి.*

*చిదంబరమును దర్శించినచో ముక్తి.* 

*కాశి క్షేత్రమున మరణించినచో ముక్తి.*

*అరుణాచలమును స్మరించిన మాత్రమున ముక్తి.*

*దీనిని బట్టి అరుణాచలము విశిష్టత తెలియ వచ్చుచున్నది.*

*కానీ అరుణాచలము మాత్రము గిరి రూపంలో నున్న దేవుడే.*

*మనం మన దేహంతో తాదాత్త్యము చెందినట్లే, పరమ శివుడు ఈ కొండతో తాదాత్త్యము చెందాడు.*
*అందువలన ఈ కొండ పరమశివుడే.*

*తనను అన్వేషించే భక్తులపై కరుణతో వాళ్ళకు కనబడాలని శివుడు కొండ రూపము దాల్చాడు.*

*అరుణాచల శివ ..అరుణాచల శివ ..అరుణాచలా*

🔥🔥🔥🔥🔥🔥🔥🔥

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS