1. పూజ మధ్యలో మాట్లాడితే, ఎవరితో మాట్లాడతామో వాళ్ళకి మన పూజ ఫలితం వెళ్తుంది అని శాస్త్ర వాక్కు.
2. జపం చేసేటప్పుడు జపమాల పొరపాటు గా కూడా కింద పడకూడదు.
3. అగ్ని ఎక్కడ ఉన్న అది పవిత్రమైన భగవంతుడి శక్తి. దాన్ని నోటితో ఊదడం దోషం.
4. మన శరీరం లో ఒక్కో అంగానికి ఒక్కో దేవత ఉంటారు. అవయవాల్ని తిట్టుకోవడం, కొట్టుకోవడం దోషం. అలాగే పంచ భూతాల్లో వేటిని కూడా తిట్టడం కానీ కోపంగా తన్నడం కానీ, దాటడం కానీ చేయకూడదు.
5. అరుణాచలం పుణ్యక్షేత్రం లో గిరి ప్రదక్షిణం రోడ్ కు ఎడమవైపు నుండే నడవాలి. కుడి వైపు ఎప్పుడూ దేవతలు ప్రదక్షిణ చేస్తుంటారు.
6. జున్ను పాలు తినరాదు. ఆవు ఈనిన 11 రోజుల లోపు, ఆవు దగ్గర పాలు తీసకోకూడదు.
7. పడుకునేటప్పుడు దైవ నామస్మరణ చేస్తూ పడుకుని, లేచేటప్పుడు, అదే నామం చెబుతూ లేస్తే పడుకున్నoత సేపు కూడా దైవనామ స్మరణ ఫలితం వస్తుంది.
8. వినాయకుడికి తులసి, సూర్యనారాయణ స్వామి కి మారేడు వేయకూడదు.
ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి, ద్వాదశి దినాలలో తులసిని తుంచరాదు. పూజకి, దేవుడి పూజకి వేర్వేరుగా తులసి ని పెంచుకోవాలి.
9. మన చుట్టూ ఎన్నో సూక్ష్మ శరీరాలుంటాయి. అవి అన్నం లోని సారాన్ని తీసుకోవడానికి ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటాయి. అందుకే దేవుడికి నైవేద్యం పెట్టకుండా తినడం , అన్నం ప్లేట్ లో పెట్టాక చాలా సేపటికి తినడం, ప్లేట్ పెట్టి, గట్టిగా అన్నం పెట్టాను రమ్మని పిలవడం, మూతలు పెట్టకుండా ఉంచడం, ఎండిపోయినవి తినడం నిషిద్ధం. అయితే ఏమౌతుంది అని, అవి కూడా జీవులే కదా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అవి అన్నం లోని సారమంతా తీసుకున్నాక, మనము తింటే శక్తి రాదు, మనసు పై ప్రభావం పడి, పాపపు ఆలోచనలో, లేక మానసిక ఒత్తిడి కో దారి తీయొచ్చు. అందుకే ఎప్పుడూ అన్నం భగవత్ నైవేద్యంగాపెట్టి, కాకి కి పెట్టి తినడం వల్ల వచ్చే ప్రమాదాలు తగ్గుతాయి.
10. తడి కాళ్లతో పడుకోకూడదు. అన్నం తినే ముందు తిన్న తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోవాలి.🌹😊🙏🏻
No comments:
Post a Comment