Sunday, May 28, 2023

రుద్రపారాయణంవల్ల, రుద్రాభిషేకంవల్ల ఏమిటీ ప్రయోజనం?

*రుద్రపారాయణంవల్ల, రుద్రాభిషేకంవల్ల ఏమిటీ ప్రయోజనం?*


కోటి జన్మలలో సంపాదించిన పుణ్యం ఉంటేనే కాని శివుని పట్ల భక్తి కలగదని ఘోషిస్తున్నది శివగీత.

'కోటి జన్మార్జితై: పుణ్యే: శివే భక్తిర్విజాయతే'.

*'శివ'* అనే రెండక్షరాలే మన పాపాలను పటాపంచలు చేసి, మోక్షాన్ని ప్రసాదిస్తాయి. సూత్రంలో మణులు ఉండేటట్లుగా ఈ సమస్త ప్రపంచంలో ఆ దేవాదిదేవుని అష్టమూర్తులు వ్యాపించి ఉన్నాయి. 

*శర్వుడు, భవుడు, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, పశుపతి, మహాదేవుడు, ఈశానుడు అనేవి ఆయన అష్టమూర్తుల పేర్లు.*
మనలో ప్రాణాపానాది ఐదు వాయువులూ, నాగకూర్మాది ఐదు ఉపవాయువులూ ఉన్నాయి. ఈ పదింటికీ మూలమైనది ఆత్మ. దాంతో పదకొండు. ఇవే ఏకాదశరుద్ర స్వరూపం*

 రుద్రపారాయణంవల్ల, రుద్రాభిషేకంవల్ల ఇవన్ని శుద్ధమవుతాయి.🙏🏻

🔱 ఓం నమః శివాయ🔱

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS