Tuesday, May 30, 2023

వారం రోజులు - ఏ రోజు ఏం చేయాలి.......!!

వారం రోజులు - ఏ రోజు ఏం చేయాలి.......!!


మానవుడు ఏ రోజు ఏం చేయాలి? 
ఏం చేస్తే పుణ్యఫలితం దక్కుతుంది. ఏ రోజు ఏం కార్యాలు చేయాలి..? 
ఏ దేవున్ని పూజించాలి..? 
ఈ విషయాలు నిత్యం అందరికి అవసరమే. 
ఏ రోజే ఏం చేయాల్లో శాస్త్రాలు వివరించాయి. 
ఇక ఏ రోజు ఏ దేవుడికి పూజ చేస్తే ఎలాంటి పుణ్యఫలితం దక్కుతుందో శివ మహా పురాణం విద్యేశ్వర సంహిత 14వ అధ్యాయం వివరించింది. దేవతల ప్రీతి కోసం 5 విధాలైన పూజ ఏర్పడింది. 

మంత్రాలతో జపం, హోమం, దానం, తపస్సు, సమారాధనలు అనేవే 5 విధాలు. సమారాధనం అంటే దేవుడి ప్రతిమ నుంచే వేదిక. ప్రతిమ, అగ్ని, లేక బ్రాహ్మణుడిని షోడశోపచారాలతో పూజించటం ఈ 4 రకాలలో ఒక దానికంటే ఒకటి ఉత్తమమైనది. పూజలు మనకున్న 7 వారాలలో ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవతకు చేయాల్సి ఉంటుంది.

ఆదివారం చేయాల్సిన కార్యాలు........
ఉత్తర దిశగా ప్రయాణం, ఉద్యోగంలో చేరడం, మంగళ కృత్యాలు, ఉత్సవాలు, నృపాభిషేకం, లోహం, చెక్క, చర్మ, ఊక పనులు, యుద్ధం, అస్తక్రర్మలు, వ్యవసాయపు పనులు, ధ్యానక్రియలు, ఔషధ సేవనం, వైద్యం, ఉల్లి, పొగాకు, మిర్చి.. వంటి తోటలు వేయడం, కెంపు ధరించడం చేయవచ్చు.

ఆదివారం చేయాల్సిన పూజలు.....
ఆదివారం ఆదిత్యుడిని, ఇతర దేవతలను, వేద పండితులను పూజించాలి. ఆదిత్య పూజ వల్ల నేత్ర వ్యాధులు, శిరోరోగం, కుష్ఠువ్యాధి తగ్గుతాయి. ఆదిత్యుడిని పూజించి వేద పండితులకు భోజనం పెట్టాలి. ఇలా ఒక రోజు నుంచి ఒక మాసం, ఒక సంవత్సరం లేక 3 సంవత్సరాల పాటు రోగ తీవ్రతనను బట్టి పూజ చేయాలి. దీనివల్ల సూర్యానుగ్రహప్రాప్తి కలుగుతుంది.

సోమవారం చేయాల్సిన కార్యాలు......
దక్షిణ దిక్కు ప్రయాణించడం, కృషి క్రియలు, సమస్త వాస్తు కర్మలు చేయవచ్చు. ఇంకా.. ముత్యం, స్ఫటికం, నూతులు, కాలువలు, చెరువులు, జలం, ఉపనయనం, భూమి, పైకప్పులు, సంగీతం, నృత్య, నాటకాలు, స్తంభ ప్రతిష్ట, భూ సంబంధ కార్యాలు, తెల్లని వస్త్రాలు ధరించడం, వెండి వస్తువులు ఉపయోగించడం, ముత్యాలు ధరించడం, నృత్యాది కళలు ప్రారంభించవచ్చు.

సోమవారం చేయాల్సిన పూజలు.....
సంపద కోరుకోనేవారు సోమవారం లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఆ రోజున పూజ తర్వాత వేద పండిత దంపతులకు నెయ్యితో భోజనం పెట్టాలి.

మంగళవారం చేయాల్సిన కార్యాలు....
తూర్పు దిక్కుకు ప్రయాణించడం, పగడపు ఉంగరం ధరించడం చేయవచ్చు. కోర్టు వ్యవహారాలు, ధైర్య సాహస విషయాల్లో అడుగుముందుకేయడం, అగ్ని, ఆయుధ, ఉగ్ర, అసత్యక్రియలు, వెండి, బంగారం, రాగి, ఇత్తడి, ఇనుము, ధాతువులు కరిగించడం, కందులు, వేరుశనగ వంటి ధాన్యాలు సాగు చేయడం.. వంటివి చేయవచ్చు.

మంగళవారం చేయాల్సిన పూజలు....
ఆరోగ్య సమస్యలు తగ్గేందుకు మంగళవారం కాళీ దేవతను పూజించాలి. మినుము, కంది, పెసరపప్పులతో చేసిన పదార్థాలతో వేద పండితులకు భోజనం పెట్టాలి.

బుధవారం చేయాల్సిన కార్యాలు.....
ఈ రోజు పడమట దిక్కుకు ప్రయాణం మంచిది. నూతన వ్యాపారాలు, యుక్తిగా కార్యాలు నిర్వర్తించవచ్చు. బంగారం మొదలైన నగలు చేయడం, వాహనం, శిల్పం, విద్య, రాజీలు, వివాహం, వ్యాపారం, క్రయవిక్రయాలు, దస్తావేజులు, చిత్ర గణితం, శిల్ప గణిత శాస్త్రాది విద్యలను అభ్యసించడం, అరటి, కొబ్బరి, మామిడి తోటలు పెంచడం, పెసలు మొదలైన పైర్లు వేయడం చేయవచ్చు. 

బుధవారం చేయాల్సిన పూజలు....
బుధవారం రోజు పెరుగు అన్నాన్ని విష్ణు దేవునికి నివేదించాలి. ఈ పూజ, నివేదనల వల్ల పూజ చేసిన వారి కుమారులు, మిత్రులు, భార్య తదితరులకు చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.

గురువారం చేయాల్సిన కార్యాలు.....
గురువారం రోజు పడమర దిక్కు దిశగా ప్రయాణం చేయడం మంచిది. యజ్ఞయాగాది క్రియలు, వివాహాది శుభకార్యాలు, వైదిక కార్యాలు, నూతన విద్యారంభం, వృక్షదోహదక్రియలు, అలంకార ధారణ క్రియలు, గురువులను, దేవతలను పూజించడం, యుద్ధారంభం, తీర్థయాత్రలు, అక్షరాభ్యాసం, శనగలు, చెరుకు, ప్రత్తి వంటి వ్యాపారాలు ప్రారంభించడం, పుష్యరాగం ధరించడం మొదలైనవి. దస్తావేజులు, ఒప్పంద పత్రాలు రాయడం మంచిది కాదని సంప్రదాయం.

గురువారం చేయాల్సిన పూజలు...
ఆయుష్షును, ఆరోగ్యాన్ని కోరేవారు తమ ఇష్టదైవానికి గురువారం రోజున పాలతో, నెయ్యితో చేసిన పదార్థాలను నివేదించాలి. వస్త్రాలను కూడా నివేదించి అర్చన చేయడం కూడా శుభకరం.

శుక్రవారం చేయాల్సిన కార్యాలు....
శుక్రవారం రోజున ఉత్తరం దిక్కు దిశగా ప్రయాణం మంచిది. నూతన వస్త్రాలు ధరించడం, కొనడం, రాజకీయ రంగ ప్రవేశం చేయడం శుభకరం. స్ర్తీ సంబంధ క్రియలు, ముత్యం వజ్రం, వైఢూర్యం, ఆభరణ ధారణ, సుగంధ శయ్యా భరణాలు, ఉద్యోగ కృషి, వ్యవసాయం, కాలు వలు, వివాహం, పుష్ప సంబంధమైన మంగళ కార్యాలు, ధాన్య సంబంధ పనులు ప్రారంభించడం, సాహిత్య విషయాలు, కళలు నేర్చుకోవడం మంచిది. 

శుక్రవారం చేయాల్సిన పూజలు...
శుక్రవారం రోజు కూడా ఇష్టదైవాన్ని శ్రద్ధతో ఆరాధించాలి. ఈ రోజు పూజానంతరం వేదపండితుల తృప్తి కోసం షడ్రుచులతో కూడిన భోజనాన్ని పెట్టాలి. స్త్రీల తృప్తి కోసం మంచి మంచి వస్త్రాలను బహూకరించడం మంచిది.

శనివారం చేయాల్సిన కార్యాలు....
గృహ నిర్మాణాది క్రియలు చేయడం మంచిది. చెక్కడం, కొట్టడం, సీసపు పనులు, దీక్షావలం బన, తగరం, లోహపు పనులు, స్థిరమైన పనులు, ఆవులు, గేదెలు మొదలగువాని పనులు, ఇనుమునుకు సంబంధించినవి, పాప కార్యాలు, అసత్య వాదన, దాసదాసీలను చేర్చుకోవడం మొదలగు పనులకు మంచిది. 

శనివారం చేయాల్సిన పూజలు.....
శనివారం రుద్రాది దేవతల ఆరాధన మంచిది. అపమృత్యువు నుంచి తప్పించుకోవాలనుకునేవారు ఆనాడు నువ్వులతో హోమం చేసి నువ్వులను దానం ఇచ్చి నువ్వులు కలిపిన అన్నంతో పండితులకు భోజనం పెట్టాలి. ఇలా చేయటం వల్ల పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది. శని దోష పూజాది కార్యక్రమాలు కూడా చేయవచ్చు.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS